sitaram echuri
-
ఆ టీవీ షోతో ప్రయోజనం లేదు : ఏచూరి
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్‌లో డిస్కవరీ చానెల్ నిర్వహించిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొనడంపై ఏచూరి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. మోదీ పాల్గొన్న టీవీ షో ఆహ్లాదానికి పనికొస్తుందే కానీ భారత ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి దోహదపడదని విమర్శించారు. 2014 నుంచి దేశ పరిస్థితి క్షీణిస్తుంటే.. మోదీ ప్రభుత్వం ఎలాంటి నివారణ ప్రణాళికలు రూపొందించడం లేదని ఆరోపించారు. రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థ మరింతగా కుదేలవుతుందని, అన్ని రంగాలు సంక్షోభాలు ఎదుర్కొంటాయని చెప్పారు. దేశ ప్రయోజనాలు కాపాడాల్సిన వారు టీవీ షో పేరిట కాలక్షేపం చేయడం విచారకరమని ఏచూరి ఆవేదన వ్యక్తం చేశారు. -
శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో ఏచూరి నిర్భందం
శ్రీనగర్ : సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరిని శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అడ్డుకున్నారు. కశ్మీర్లో ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే మొహమ్మద్ యూసిఫ్ తరిగామితో పాటు ఇతర కార్యకర్తలను ఆయన కలుసుకునేందుకు వెళ్లారు. కానీ పోలీసులు ఏచూరిని ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకున్నారు. ఏచూరితో పాటు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాను కూడా నిర్భందించారు. ఈ ఘటనపై సీపీఎం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనారోగ్యంతో ఉన్న మా పార్టీనాయకులను కలవకుండా ఇలా ఏచూరిని విమానాశ్రయంలోనే నిర్భందించడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని ఒక ప్రకటనలో తెలిపింది. విమానం ఎక్కే ముందే నేను జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్‌మాలిక్‌ను పర్యటనకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరానని ఏచూరి ట్వీట్ చేశారు. ‘మమ్మల్ని ఏయిర్పోర్ట్ దాటి బయటకు వెళ్లనివ్వలేదని, భద్రతాకారణాల రిత్యా అనుమతి ఇవ్వడం కుదరదంటూ పోలీసులు అడ్డుకున్నారని’ తెలిపారు. కాగా కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభలో ప్రతిపక్షనాయకుడు గులాం నబీ ఆజాద్‌ను కూడా శ్రీనగర్ విమానాశ్రయంలో పోలీసులు ఆపి వెనక్కి తిప్పి పంపిన విషయం తెలిసిందే. -
తెలంగాణలో ఆర్థిక దోపిడీ పెరిగింది: ఏచూరి
సాక్షి, మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థిక దోపిడీ పెరిగిందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మంగళవారం మిర్యాలగూలోని ఎన్ఎస్పీ క్యాంపులో సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి గెలుపు కోసం నిర్వహించిన బహిరంగసభలో ఆయన పా ల్గొని మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళి తులు, మైనార్టీలపై దాడులు పెరిగాయని విమర్శించారు. యువత ఉద్యోగాలు లేక ఆర్థ్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటురన్నారని, అన్నదాతల ఆత్మహత్యలు సైతం పెరిగాయన్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరు ఒకటేనన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. బీజేపీతో టీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం ఉందన్నారు. పార్లమెంట్లో బీజేపీని టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని, కానీ ఇక్కడ మా త్రం ముస్లిం ఓట్ల కోసం వ్యతిరేకిస్తుందని అన్నారు. రాష్ట్రంలో కమ్యూనిస్టులకు పూర్వవైభవం వ స్తుందని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడిస్తేనే ప్రజల బతుకులు బాగుపడతాయన్నారు. అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టులు కేసీఆర్‌ను పారదోలాలన్నా రు. రాష్ట్రంలో బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, చదువుల సావిత్రి పథకాన్ని, కూలీబంధు పథకాన్ని అమలు చేస్తామన్నారు. సీపీఎం అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, డబ్బి కార్ మల్లేష్ అథ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారా ములు, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్, హుజూర్నగర్, నాగార్జునసాగర్ బీఎల్ఎఫ్ అభ్యర్ధులు పారేపల్లి శేఖర్‌రావు, సౌజన్య, నాయకులు రాములు, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మాలి పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తలు... -
ఆర్థిక దోపిడీ నుంచి దేశాన్ని కాపాడాలి : సీతారం ఏచూరి
సాక్షి, బోనకల్: సామాజిక దౌర్జన్యం, ఆర్థిక దోపిడీ నుంచి దేశాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ వెనుకబాటు తనానికి కారణం పాలకుల ఏలుబడేనన్నారు. టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. ప్రజా ఉద్యమాల ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. దేశంలో ఆర్థిక దోపిడీ, ధరల పెరుగుదల, రైతు ఆత్మహత్యలు వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోవడానికి కాంగ్రెస్, బీజేపీ విధానాలే కారణమన్నారు. పెట్టుబడిదారులు బ్యాంకుల నుండి రూ.12లక్షల కోట్లను అప్పుగా తీసుకొని... విదేశాలకు వెళ్లడం వెనుక ప్రధాని ప్రోత్సాహం ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మతోన్మాదం పెరిగిందని విమర్శించారు. దళితులు, ముస్లింలు, గిరిజనులపై దౌర్జన్యాలు నానాటికి పెరిగి పోతున్నాయన్నారు. మోదీ సర్కారు కనుసన్నల్లో టీఆర్ఎస్ నడుస్తోందని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటాలు విప్లవకారులకు వేదికగా ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు. విప్లవ కారులకు తెలంగాణ రాష్ట్రం తీర్థయాత్ర లాంటిదన్నారు. దేశంలో మోదీ, తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్లను గద్దె దించాలన్నారు. దేశంలో తెలంగాణ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన 371(డీ) ఆర్టికల్ పాలకుల నిర్లక్ష్యం వలన వెనుకబాటుతనానికి కారణమైందన్నారు. బీఎల్ఎఫ్ అభ్యర్థి కోట రాంబాబును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరావు, నాయకులు దొండపాటి నాగేశ్వరావు, మాదినేని లక్ష్మీ, బండి పద్మ, కోట రాంబాబు, అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు. -
కరుణకు వెంకయ్య పరామర్శ
సాక్షి, చెన్నై : మూత్రనాళ ఇన్ఫెక్షన్కు చికిత్స పొందుతున్న ద్రవిడ మున్నేత్ర కగజం(డీఎంకే) పార్టీ అధినేత కరుణానిధిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరిలు పరామర్శించారు. కరుణానిధి రాజకీయాల్లో అపర చాణక్యుడని, ఆయన ఎన్నో సంస్కరణలకు ఆద్యుడని సీతారాం ఏచూరి అన్నారు. కరుణ ఆరోగ్యంపై స్టాలిన్‌ను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. ఆయన త్వరలోనే సంపూర్ణం ఆరోగ్యంతో ముందుకు రావాలని ఆకాంక్షించారు. కాగా, శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కరుణానిధికి రక్తపోటు ఒక్కసారిగా తగ్గింది. దీంతో ఆయన్ని చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్సచేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రక్తపోటు నియంత్రణలోకి వచ్చిందని శనివారం రాత్రి ఆసుపత్రి వర్గాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కరుణానిధికు ఉపరాష్ట్రపతి పరామర్శ
-
ఏచూరి కాదంటే తెలంగాణ ఆగిందా?
సాక్షి, హైదరాబాద్: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యతిరేకిస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగిందా, ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ మాత్రం ఆగుతుందా అని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఆలోచనా శక్తి, మేధోపటిమకు అనుగుణంగా ఫెడరల్ ఫ్రంట్‌ను తీర్చిదిద్దే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు. అప్పటి వరకు సీతారాం ఏచూరి వంటి వాళ్లు ఏమి మాట్లా డినా, ఏమనుకున్నా పట్టించుకోబోమని, తమ ఆలోచనలు తమకున్నాయన్నారు. ఈ నెల 27న జరగనున్న టీఆర్ఎస్ 17వ ఆవిర్భావ ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి జగదీశ్‌రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి కేటీఆర్ సోమవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లా డుతూ, ఇదే ఏచూరి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారన్నారు. ఏచూరి అనుకున్నంత మాత్రాన జరిగేది ఆగదని స్పష్టం చేశారు. ప్లీనరీకి ఎవరినీ పిలవట్లేదు.. జాతీయ పార్టీల నేతలు, ఇతర రాష్ట్రాల ముఖ్యులెవరూ ప్లీనరీకి రావడం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి ముఖ్యులు ఎవరినీ ఆహ్వానించడం లేదని, ఇది పూర్తిగా పార్టీ కార్యక్రమంగానే నిర్వహిస్తు న్నామని తెలిపారు. ఇది సాధారణ ఎన్నికల ముందు జరుగుతున్న అతి ముఖ్యమైన ప్లీనరీ అని చెప్పారు. 2019లో ఎన్నికల సమయంలో ప్లీనరీ నిర్వహించుకోలేమని, ఈ సమావేశమే రాజకీయంగా విస్తృతమైనదని పేర్కొన్నారు. దేశంలో ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తి ఉండాలని కోరుకుంటున్నారని, దానికి అనుగుణంగా ప్లీనరీలో నిర్ణయాలుంటాయని వెల్లడించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, నమూనా దేశానికి మార్గదర్శ కంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించే దిశగా ఈ ప్లీనరీ ఉంటుందని చెప్పారు. ప్లీనరీ విజయవంతం కోసం పలు కమిటీలను ఏర్పాటు చేశామన్నా రు. పార్టీ వార్షికోత్సవంలో భవిష్యత్ కార్యాచ రణ, పార్టీ కార్య క్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల అమలుపై చర్చ, తీర్మానా లుంటాయని కేటీఆర్ వివరించారు. 13 వేల మంది ప్రతినిధులు ప్లీనరీ ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని కేటీఆర్ చెప్పారు. నియోజకవర్గానికి 100 మంది చొప్పున మొత్తం 13 వేల మంది ప్రతినిధులు, 20 దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ప్రతి నిధులు సమావేశంలో పాల్గొంటారని వెల్లడించారు. సామాన్య ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతినిధుల నమోదు కోసం 40 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముందుగా నమోదు చేసుకున్న తర్వాతనే ప్లీనరీలో పాల్గొంటారని చెప్పారు. 8 భోజన శాలలు ఏర్పాటు చేశా మని తెలంగాణ వంటకాలు నోరూరిస్తాయ న్నారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్లీనరీలో పాల్గొనే అందరికీ అంబలి, సల్ల (మజ్జిగ), నీరు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. శుక్రవారం రోజునే ప్లీనరీ ఉన్నందున ముస్లింలు నమాజ్ చేసుకు నేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వైద్య సేవల కోసం డాక్టర్ల బృందం, నాలుగు అంబులెన్స్‌లు, హెల్త్ క్యాంప్‌లను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థి, యువజన విభాగం నుంచి 500 మంది సుశిక్షుతులైన వారిని ఎంపిక చేశామని, ఇబ్బందులు రాకుండా హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి శిక్షణ, మార్గనిర్దేశనం చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు మల్లారెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు వివేకానంద, కృష్ణా రావు, సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, కర్నె ప్రభాకర్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే మూసీ అందాలు చూస్తారు.. మూసీ సుందరీకరణ త్వరలోనే ప్రారంభమవుతుందని, సుందరీకరించిన తర్వాత సీతారాం ఏచూరిని కూర్చోబెట్టి మూసీ అందాలను చూపిస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మూసీ నదిలోకి చాలా నీళ్లు వచ్చినట్టు ఎన్నికల నాటికి చాలా ఫ్రంట్ లు వస్తాయంటూ ఏచూరి వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్‌ను, ఇక్కడ మూసీ అందాలను ఏచూరి చూస్తారన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే మెచ్చుకుంటున్నారని చెప్పారు. దేశంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ రెండే రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల మంత్రులే రాష్ట్ర అభివృద్ధిని కీర్తిస్తున్నారన్నారు. బీజేపీ మంత్రులూ పొగుడుతున్నారని, తెలంగాణ అభివృద్ధి నమూనా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని తెలిపారు. -
ఏచూరి మరోసారి
సాక్షి, హైదరాబాద్: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి రెండోసారి ఎన్నికయ్యారు. పార్టీ 22వ అఖిల భారత మహాసభల్లో భాగంగా ఆదివారం జరిగిన జాతీ య కార్యవర్గ సమావేశాల్లో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. 17 మందితో కూడిన పొలిట్ బ్యూరోను కూడా పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రస్తుతం 16 మందితో ఉన్న పొలిట్ బ్యూరోలో ఏకే రాఘవన్ ఢిల్లీ కార్యవర్గంలోకి వెళ్లారు. దీంతో పొలిట్ బ్యూరో సభ్యుల సంఖ్య 15కు చేరింది. తాజాగా నీలోత్పల్ బసు, తపన్ సేన్‌లకు చోటు కల్పించారు. రాష్ట్ర కార్యదర్శి తమ్మి నేని వీరభద్రంకు పొలిట్‌బ్యూరోలో అవకాశం వస్తుందని భావించినా చివరికి మొండిచేయే చూపారు. 95 మందితో కేంద్ర కమిటీ సభ్యులను పార్టీ ఎన్నుకుంది. ఇందులో తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం, వీరయ్య, చెరుపల్లి సీతారాములు, నాగయ్యలకు చోటు దక్కింది. ప్రత్యేక ఆహ్వానితులుగా మల్లు స్వరాజ్యం నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర కమిటీలోకి పి.మధు, ఎం.ఎ.గఫూర్, వి.శ్రీనివాసరావు, ప్రత్యేక ఆహ్వానితులుగా పాటూరి రామయ్యలకు అవకాశం దక్కింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానాలపై ఉద్యమిస్తాం: ఏచూరి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన అనంతరం ఏచూరి ప్రసంగించారు. దేశంలోని వామపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి కేంద్రంపై ఉద్యమిస్తామన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానాలతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఓటమే తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. దోపిడీ లేని సమాజం కోసం సమరశీల పోరాటాలు చేద్దామంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సవాళ్లకు, దాడులకు ఎదురొడ్డి దేశ సమగ్రతను కాపాడుకుందామన్నారు. ‘‘శ్రామిక కార్మిక పాలన తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. దేశ సమైక్యతను, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం. ప్రధాన కార్యదర్శిగా మరోసారి ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. నాపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తా. పార్టీ ఐక్యతను మహాసభలు మరోసారి రుజువు చేశాయి’’అని అన్నారు. శాశ్వత ఆహ్వానితులు: రాజేందర్ నేగి(కార్యదర్శి, ఉత్తరాఖండ్), సంజయ్ పరాటే(కార్యదర్శి, ఛత్తీస్‌గఢ్) ప్రత్యేక ఆహ్వానితులు: వీఎస్ అచ్యుతానందన్, మల్లు స్వరాజ్యం, మదన్ ఘోష్, పలోలి కుట్టీ, రామయ్య, కె.వరదరాజన్ సెంట్రల్ కంట్రోల్ కమిషన్: బాసుదేవ్ ఆచార్య, పి.రాజేంద్రన్, ఎస్.శ్రీధర్, జి.రాములు, బొనాని బిశ్వాస్ పొలిట్‌బ్యూరో: సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, ఎస్.రామచంద్ర పిళ్లై, బిమన్ బసు, మాణిక్ సర్కార్, బృందా కారత్, పినరయ్ విజయన్, హన్నన్ మొల్లా, కొడియెరి బాలకృష్ణన్, ఎంఏ బేబీ, సుర్యకాంత మిశ్రా, మహ్మద్ సలీమ్, సుభాషిణీ అలీ, బీవీ రాఘవులు, జి.రామకృష్ణన్, తపన్‌సేన్, నీలోత్పల్ బసు మోదీని గద్దె దింపే వరకు పోరాటం: రాఘవులు బంగారు తెలంగాణ ఎలా ఉండాలో, దాని కోసం ఎలా పురోగమించాలో సభలో చర్చిం చామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు చెప్పారు. సాయుధ పోరాటాలతో ఉద్యమాలకు ఊపిరి పోసింది తెలంగాణ గడ్డ అని.. ఆ స్ఫూర్తి, ఉత్తేజంతోనే దేశవ్యాప్తంగా కమ్యునిస్టు పార్టీ ప్రజా పోరాటాలు నిర్వహించిందని రాఘవులు గుర్తు చేశారు. సీపీఎం 22వ మహసభల బహిరంగసభకు అధ్యక్షత వహించిన రాఘవులు.. మహాసభలు విజయవంతంగా ముగిశాయని ప్రకటించారు. దళిత, గిరిజనులు, మహిళలపై మతోన్మాద శక్తులు లైంగిక దాడులకు పాల్పడుతున్నాయని, సామ్రాజ్యవాద శక్తుల శ్రమ దోపిడీ నుంచి ప్రజల్ని ఎలా రక్షించుకోవాలో సభలో చర్చ జరిగిందన్నారు. లౌకిక శక్తులను ఏకం చేసి మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు ప్రజా పోరాటాలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అచ్ఛే దిన్ కాదు.. కచ్చే దిన్: మాణిక్ సర్కార్ దేశంలో నాలుగేళ్లలో ‘అచ్ఛే దిన్’వస్తాయని మోదీ అన్నారని.. తీరా వెనక్కి తిరిగి చూస్తే అంతా ‘కచ్చే దిన్’అని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ విమర్శించారు. ఎక్కువ రోజులు ప్రజలను మోసం చేయలేమని గుర్తించిన బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ప్రజల మధ్య అశాంతి సృష్టించి, ప్రజల్ని చీల్చుతున్నాయని ఆరోపించారు. అందులో భాగంగానే దళితులు, మైనార్టీలపై దాడులకు తెగబడుతున్నారని నిప్పులు చెరిగారు. బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రత్యామ్నాయం కాదని.. అవి నాణేనికి బొమ్మా బొరుసు లాంటి పార్టీలే అన్నారు. వామపక్ష ప్రజాతంత్ర శక్తులే పాలక పార్టీలకు ప్రత్యామ్నాయమన్నారు. ప్రమాదం పొంచి ఉందని, శత్రువు మన తలుపు తడుతోందని, ఇక ప్రజా పోరాటాలకు సిద్ధమవ్వాలని కార్యకర్తలను కోరారు. మోదీ హఠావో.. దేశ్ బచావో: బృందా కారత్ ‘ఎర్రజెండా లేకుండా చేశామని మోదీ, అమిత్ షా అంటున్నారు. ఎర్రజెండాను అంతం చేయడం ఎవరి వల్ల కాదు. ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటుందని వాళ్లు గుర్తు పెట్టుకోవాలి’ అని సీపీ ఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ హెచ్చరించారు. మోదీని గద్దె దింపేందుకు మహాసభ గట్టి నిర్ణయం తీసుకుందని, ‘మోదీ హఠావో.. దేశ్ బచావో’ నినాదం దేశమంతటా వినిపిస్తోందన్నారు. దేశంలో మహిళలు, చిన్నారులపై లెంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి ఆసిఫాపై జరిగిన అన్యాయానికి మతం రంగు పులిపి పాలిస్తున్న వీళ్లు నేరుస్థుల రక్షకులని విమర్శించారు. మతతత్వ శక్తులను రక్షించేందుకు మోదీ ప్రభుత్వం పని చేస్తోందని, అందుకే మక్కా మసీదు ఘటనకు పాల్పడిన వారిని నిర్దోషులుగా విడుదల చేయించారని ఆరోపించారు. ప్రతి అరగంటకో రైతు ఆత్మహత్య: పినరయి దేశంలో ప్రతి అరగంటకు ఒకరు చొప్పున రైతులు ఆత్మహత్మ చేసుకుంటున్నారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆవేదన వ్యక్తం చేశారు. దారుణమైన ప్రపంచీకరణ, 1991లో వచ్చిన సరళ్జీకృత ఆర్థిక విధానాలను బీజేపీ ముమ్మరం చేసిందని.. పర్యవసానంగా వ్యవసాయ సంక్షోభం ఏర్పడిందన్నారు. కుబేరులకే మేలు చేసే విధానాలతో నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపోయాయని.. ఉద్యోగ, జీవన భద్రత లేకుండా పోయిందన్నారు. మోదీ పాలనలో మతతత్వ వాదులకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని.. దళితులు, మైనార్టీలు, మహిళలపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బేఠీ బచావో..బేఠీ పడావో’అనేవి మోదీ బూటకపు మాటలని విమర్శించారు. మోదీ హయంలో సీనియర్ న్యాయమూర్తులే ప్రజల ముందుకొచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. -
మళ్లీ ఏచూరికే పగ్గాలు!
సాక్షి, హైదరాబాద్ : సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి రెండోసారి ఎన్నిక కానున్నారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన పార్టీ మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన ఆయన.. మరో మూడేళ్ల పాటు అదే పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం జాతీయ మహాసభల వేదికగా పార్టీ కొత్త పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీని ఎన్నుకోనున్నారు. పార్టీ రాజకీయ తీర్మానం విషయంలో తలెత్తిన అభిప్రాయభేదాల నేపథ్యంలో ఓటింగ్ వరకు వెళ్తే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఏచూరి తప్పుకుంటారని ప్రచారం జరిగినా.. ఆ అంశం సామరస్యంగానే పరిష్కారం కావడంతో ఏచూరి మరోసారి అదే పదవిలో కొనసాగుతారని పార్టీ వర్గాలంటున్నాయి. కాగా ఈసారి తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రంను పొలిట్‌బ్యూరోలోకి తీసుకుంటారనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం 16 మంది.. ప్రస్తుతం పొలిట్‌బ్యూరోలో 16 మంది సభ్యులున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోపాటు ప్రకాశ్ కారత్, రామచంద్రన్ పిళ్లై, మాణిక్‌సర్కార్, బిమన్ బోస్, బృందాకారత్, పినరయ్ విజయన్, కె. బాలకృష్ణన్, సూర్యకాంత్ మిశ్రా, ఎ.కె.పద్మనాభన్, హన్నన్‌ముల్లా, ఎం.ఎ.బేబీ, సుభాషిణి అలీ, ఎండీ.సలీం, జి.రామకృష్ణన్, బీవీ రాఘవులు పొలిట్‌బ్యూరో సభ్యులుగా పని చేస్తు న్నారు. వీరిలో రాఘవులు ఒక్కరే తెలుగు రాష్ట్రా లకు చెందిన వారు. ఏచూరిది ఏపీ అయినా ఆయన పార్టీ ప్రధాన కార్యాలయం కోటా నుంచి పదవిలో కొనసాగుతున్నారు. రామచంద్రన్ పిళ్లై, ఏకే రాఘవన్ ఈసారి రిటైర్ అవుతారనే చర్చ జరుగుతోంది. వయసు పెరిగిపోవడంతో వీరిద్దరికీ విశ్రాంతి కల్పిస్తారని అంటున్నారు. మళ్లీ కొనసాగాలనుకుంటే పొలిట్‌బ్యూరోలో అవకాశమిస్తారు. అయితే ఈసారి తమ్మినేనిని కూడా తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆయన క్రియాశీలంగా మారారు. పార్టీ స్తబ్ధుగా ఉన్న సమయంలో 4 వేల కి.మీ. పాదయాత్ర చేసి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను చుట్టి వచ్చారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఏర్పాటు చేసి ఉద్యమాలను ఉధృతం చేశారు.ఇప్పుడు ఈ బీఎల్ఎఫ్ దేశవ్యాప్త సామాజిక ఉద్యమాలకు దిక్సూచిగా మారింది. వీటికితోడు తమ్మినేనికి పార్టీ పట్ల ఉన్న విధేయత, చిత్తశుద్ధిని పరిగణనలోకి తీసుకుని పొలిట్‌బ్యూరోలో అవకాశం ఇస్తారని అంటున్నారు. ఆయనతోపాటు వ్యవసాయ కార్మిక సంఘం నేత విజయ రాఘవన్, ఏపీకి చెందిన సీఐటీయూ నాయకురాలు హేమలతకు కూడా అవకాశం కల్పించవచ్చని తెలుస్తోంది. తెలంగాణ నుంచి పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా తమ్మినేనితోపాటు ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాములు, ప్రత్యేక ఆహ్వానితురాలిగా మల్లు స్వరాజ్యం, ఏపీ నుంచి ఎస్.పుణ్యవతి, పెనుబల్లి మధు, పాటూరి రామయ్య, ఎం.ఎ.గఫూర్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో పాటూరి ఈసారి రిటైర్ అయ్యే అవకాశాలున్నాయి. ‘29 దేశాల సౌహార్ద సందేశాలు’ సీపీఎం జాతీయ మహాసభల సందర్భంగా ప్రపంచంలోని 29 దేశాలకు చెందిన కమ్యూనిస్టు పార్టీలు తమ సౌహార్ద సందేశాలను పంపాయి. చైనా, వియత్నాం, క్యూబా, కొరియాలతో పాటు పలు దేశాల కమ్యూనిస్టు పార్టీలు పంపిన సౌహార్ద సందేశాలను శనివారం ఆ పార్టీ ప్రతినిధులు మీడియాకు విడుదల చేశారు. నేడు బహిరంగ సభ పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ ఎన్నిక అనంతరం జాతీయ మహాసభల ముగింపు సూచికగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సరూర్‌నగర్ ఇండోర్‌స్టేడియం వేదికగా జరుగనున్న ఈ సభకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు హాజరు కానున్నారు. సభను వీక్షించేందుకు సభా ప్రాంగణంలో, ఎల్బీనగర్ చౌరస్తాలో 12 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు మలక్‌పేట టీవీ టవర్ నుంచి రెడ్‌షర్ట్ వలంటీర్ల కవాతు ప్రారంభం కానుంది. ఈ కవాతులో 20 వేల మంది ఎర్ర సైన్యం పాల్గొననుంది. సాయంత్రం ఐదు గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. దాదాపు మూడు లక్షల మంది ఈ మహాసభకు హాజరయ్యే అవకాశం ఉందని తమ్మినేని పేర్కొన్నారు. -
కారత్ X ఏచూరి!
సాక్షి, హైదరాబాద్ : రాజకీయ విధానాల విషయంగా సీపీఎంలో జరుగుతున్న పరిణామాలు, కీలక నేతల మధ్య విభేదాలు సంచలనానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న పార్టీ 22వ జాతీయ మహాసభల్లో ఆమోదించాల్సిన రాజకీయ తీర్మానం విషయంలో పార్టీ అగ్రనేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్‌ల మధ్య భేదాభిప్రాయాలు తారస్థాయికి చేరాయని సమాచారం. కాంగ్రెస్‌తో సీపీఎం రాజకీయ సంబంధాల అంశంలో రాజకీయ తీర్మానంపై ఓటింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఓటింగ్‌లో తన ప్రతిపాదన వీగిపోతే ఏచూరి సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకుంటారన్న ప్రచారం నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఏమిటీ విభేదాలు? రాజకీయంగా అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలను ఖరారు చేసుకునేందుకు సీపీఎం మూడేళ్లకోసారి జరిగే జాతీయ మహాసభల్లో రాజకీయ తీర్మానం చేసుకుంటుంది. ఆ తీర్మానంపై రెండు రోజుల పాటు చర్చలు జరిపి, అవసరమైన సవరణలు చేసుకుని ఆమోదించుకుంటుంది. అయితే తాజాగా 22వ జాతీయ మహాసభల్లో ప్రవేశపెట్టిన రాజకీయ ముసాయిదా తీర్మానం పార్టీ అగ్రనేతల మధ్య విభేదాలకు దారితీసింది. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని, అదే సందర్భంలో కాంగ్రెస్‌తోనూ ఎలాంటి రాజకీయ సంబంధాలు పెట్టుకోవద్దని సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ బుధవారం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంతకుముందు ఈ తీర్మానంపై కేంద్ర కమిటీలో కూడా చర్చించారు. కానీ కాంగ్రెస్‌తో రాజకీయ సంబంధాలు వద్దన్న అంశంపై పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విభేదిస్తున్నారు. కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు ఉండాలని తాను కోరుకోవడం లేదని.. కానీ బీజేపీని గద్దె దించే క్రమంలో వామపక్ష, ప్రజాస్వామిక శక్తుల కలయిక అవసరమని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్‌తో రాజకీయ సంబంధాలు అవసరమైతే కొనసాగించాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు తీర్మానంలోని కాంగ్రెస్‌తో రాజకీయ సంబంధాలు వద్దనే వాక్యానికి సవరణలు చేయాలని పట్టుపడుతున్నారు. ఈ అంశంపై కేంద్ర కమిటీలో చర్చ జరిగినప్పుడు కూడా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో కారత్ ఆలోచన ప్రకారం కేంద్ర కమిటీ ఆమోదించిన ముసాయిదా తీర్మానాన్ని మహాసభలో పెట్టాలని.. దాంతోపాటు మైనార్టీ అభిప్రాయం కింద ఏచూరి ప్రతిపాదనను కూడా ప్రవేశపెట్టి ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుని, తుది తీర్మానాన్ని ఆమోదించాలని నిర్ణయించారు. ఇలా తొలిసారిగా మహాసభల్లో రాజకీయ తీర్మానాన్ని విభేదిస్తూ.. మైనార్టీ అభిప్రాయాన్ని కూడా చర్చించాలంటూ తీర్మానం పెట్టడంపై పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. మెజార్టీ మద్దతు కారత్‌కే.. మహాసభల్లో రాజకీయ ముసాయిదా తీర్మానంతో పాటు ఏచూరి ప్రవేశపెట్టిన మైనార్టీ అభిప్రాయంపైనా గురువారం వాడివేడి చర్చ జరిగింది. 12 రాష్ట్రాలకు చెందిన 13 మంది ప్రతినిధులు తమ అభిప్రాయాలు చెప్పారు. మెజార్టీ సభ్యులు కారత్ ప్రతిపాదన ప్రకారం కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని సూచించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడిన ప్రతినిధి కూడా కారత్ ప్రతిపాదననే బలపర్చినట్టు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం వరకు మరికొందరు ప్రతినిధులు రాజకీయ తీర్మానంపై తమ రాష్ట్రాల అభిప్రాయాలను తెలియజేసి సవరణలు సూచించనున్నారు. మొత్తంగా కారత్ ప్రవేశపెట్టిన తీర్మానానికే మద్దతు లభించే అవకాశాలు కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. వీగిపోతే.. తప్పుకొంటారా? రాజకీయ తీర్మానంపై ఓటింగ్‌లో తన ప్రతిపాదన వీగిపోతే.. ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఏచూరి ఉన్నట్టు సీపీఎం వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండు నెలల క్రితం రాజకీయ ముసాయిదా తీర్మానం రూపొందించినప్పుడు కూడా కేంద్ర కమిటీలో ఓటింగ్ జరగ్గా.. ఏచూరి ప్రతిపాదన వీగిపోయింది. అప్పుడే ఆయన ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకొనేందుకు సిద్ధపడ్డారని.. కానీ మహాసభల వరకు కొనసాగాలని, మహాసభల్లో కొత్త కమిటీని ఎన్నుకునే సమయంలో ఆలోచిద్దామని చెప్పడంతో ఆ యోచన విరమించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తన ప్రతిపాదనకు ప్రతినిధుల మద్దతు కూడా లభించకపోతే.. ప్రధాన కార్యదర్శి పదవిలో తాను కొనసాగడం నైతికం కాదనే అభిప్రాయంతో ఏచూరి ఉన్నారని, ప్రతిపాదన వీగిపోతే తప్పుకొంటారనే చర్చ జరుగుతోంది. అయితే ఏచూరి ప్రతిపాదన వీగిపోయినా.. తిరిగి ఆయననే ప్రధాన కార్యదర్శిగా కొనసాగాలని ప్రతిపాదించే యోచనలోనే పార్టీ పొలిట్‌బ్యూరో ఉన్నట్టు సమాచారం. అయినా పదవిలో కొనసాగడానికి ఏచూరి విముఖత చూపితే మార్పు అనివార్యం కానుంది. అదే జరిగితే త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్‌కు పార్టీ పగ్గాలు దక్కుతాయని అంటున్నారు. మరో సీనియర్ నేత బృందా కారత్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఓటింగ్ జరుగుతుందా? తాను ప్రతిపాదించిన సవరణను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని, లేదంటే ఓటింగ్ నిర్వహించాలని కోరే అవకాశం మహాసభకు హాజరైన ప్రతి సభ్యుడికీ ఉంటుంది. ఈ నేపథ్యంలో తాను ప్రవేశపెట్టిన మైనార్టీ అభిప్రాయంపై సీతారాం ఏచూరి కూడా ఓటింగ్‌కు పట్టుపట్టే అవకాశాలున్నాయి. అయితే పార్టీ మహాసభల్లో ఇప్పటివరకూ రహస్య ఓటింగ్ జరగలేదు. ఈసారి కూడా చేతులు ఎత్తే విధానం ద్వారానే ఓటింగ్ జరగనుంది. ఇదే జరిగితే కారత్ ప్రతిపాదించిన తీర్మానానికే ఆమోదం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. -
కాంగ్రెస్ విషయంలో విభేదాలేమీ లేవు
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్‌తో రాజకీయ అవగాహన, ఎన్నికల పొత్తుల విషయంలో తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. తాము 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికైనా, 2004లో యూపీఏ ప్రభుత్వానికైనా బయటి నుంచే మద్దతిచ్చామని.. పొత్తుల కోసం ఫ్రంట్లలో చేరే చరిత్ర తమది కాదని పేర్కొన్నారు. పార్టీ జాతీయ మహాసభల సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో సీపీఎం అనుసరించాల్సిన రాజకీయ విధానాన్ని నిర్ణయించుకునేందుకు మహాసభల్లో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. రాజకీయ విధానం విషయంలో తాము చాలా స్పష్టంగా ఉన్నామని, దేశంలో రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయగలిగేది వామపక్షాలేనని, ఆ క్రమంలో వామపక్ష, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత అనివార్యమన్నారు. అది జరగాలంటే పెద్ద వామపక్ష పార్టీగా సీపీఎం బలపడాల్సి ఉంటుందని, ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ విషయంగా మాత్రమే.. బీజేపీని ఎలా గద్దె దింపాలన్న అంశంలో మాత్రం పార్టీలో భేదాభిప్రాయాలు వచ్చాయని ఏచూరి పేర్కొన్నారు. అందువల్లే ప్రకాశ్ కారత్ ప్రవేశపెట్టిన తీర్మానంపై తాను మైనార్టీ అభిప్రాయాన్ని సభ ముందు ఉంచానని చెప్పారు. రాజకీయ తీర్మానంతో పాటు మైనార్టీ అభిప్రాయంపై కూడా మహాసభ ప్రతినిధులు చర్చించాక.. అందరి సూచనల మేరకు సవరణలు చేసుకుని తుది తీర్మానాన్ని ఆమోదించుకుంటామని తెలిపారు. అయితే మైనార్టీ అభిప్రాయాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. రాజకీయ తీర్మానం ఆమోదంపై ఓటింగ్ జరుగుతుందా.. లేదా అన్నది తాను ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు. ఓటింగ్ జరగాల్సి వస్తే జరుగుతుందని.. అయితే ఇప్పటివరకు పార్టీలో రహస్య ఓటింగ్ జరగలేదని చెప్పారు. ఊహాగానాలు వద్దు.. ‘మీ ప్రతిపాదన వీగిపోతే పార్టీ చీలిపోతుందా.. ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తారా..’అని మీడియా ప్రశ్నించగా... ఊహాగా నాలు చేయవద్దంటూ ఏచూరి సమాధానాన్ని దాటవేశారు. పార్టీలో ప్రతి సభ్యుడికి సవరణలు ప్రతిపాదించే హక్కు ఉంటుందని, మహాసభలో పాల్గొన్న ప్రతినిధులెవరైనా తన ప్రతిపాదనపై ఓటింగ్ జరపాలని కోరే అవకాశముందని వెల్లడించారు. రాజకీయ తీర్మానాన్ని ప్రధాన కార్యదర్శి మాత్రమే ప్రవేశపెట్టాలన్న నిబంధన తమ పార్టీలో లేదని.. గతంలో బి.టి.రణదివే, హరికిషన్‌సింగ్ సూర్జిత్లు కూడా ప్రధాన కార్యదర్శులు కాకుండానే రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. అయితే ప్రధాన కార్యదర్శి హోదాలో మైనార్టీ అభిప్రాయాన్ని ప్రవేశపెట్టవచ్చా అని ప్రశ్నించగా... జ్యోతిబసు ప్రధాని అభ్యర్థిత్వం విషయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే, మహాసభ మరో అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. రాజకీయ తీర్మానం అనంతరం కార్యదర్శి నివేదిక ప్రవేశపెడతామని, తర్వాత సెంట్రల్ కమిషన్ నివేదిక ఉంటుందని చెప్పారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.వెంకట్, రాష్ట్ర కమిటీ సభ్యులు టి.సాగర్, ఎస్.రమ తదితరులు పాల్గొన్నారు. చాలా ఫ్రంట్లు వస్తాయి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌లో సీపీఎం చేరే అవకాశంపై విలేకరులు ప్రశ్నించగా.. అలాంటి ఫ్రంట్ల చర్చలు చాలా వస్తాయని ఏచూరి వ్యాఖ్యానించారు. మూసీ నదిలో చాలా నీళ్లు వచ్చినట్టు ఎన్నికలు వచ్చే నాటికి చాలా ఫ్రంట్లు వస్తాయని వ్యాఖ్యానించారు. విభజన, హోదాలపై తీర్మానాలు చేస్తాం ఉమ్మడి రాష్ట్ర విభజన హామీలు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై మహాసభల్లో తీర్మానం చేస్తామని ఏచూరి చెప్పారు. హోంవర్క్ చేయకుండా హామీలిస్తున్నారని ప్రత్యేక హోదా ప్రకటించినప్పుడే తాను రాజ్యసభలో స్పష్టం చేశానని తెలిపారు. అయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కచ్చితంగా ఇచ్చి తీరుతామని అప్పుడు వెంకయ్యనాయుడు చెప్పారని గుర్తుచేశారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా అమలు చేయడం లేదని విమర్శించారు. -
పోరాటాలకు సిద్ధంకండి
నల్లగొండ: దేశంలో జరుగుతున్న ఆర్థిక దోపిడీ, సామాజిక దౌర్జన్యం, కుల ద్వేషాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ఆ దిశగా మహాసభల్లో చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఆదివారం నల్లగొండలో సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఏర్పాటైన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) దేశానికి దిక్సూచి కావాలని ఆకాంక్షించారు. సామాజిక, కుల, వర్గ పోరాటాలను బీఎల్ఎఫ్ ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఎరుపు–నీలం రంగులు కలిసొచ్చి పోరాడటం అభినందనీయమన్నారు. ‘నల్లగొండ అంటే ఎర్రకొండ’అని.. ఈ ప్రాంతం నుంచి ఆరంభమైన వర్గ పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ‘కార్పొరేట్’కు కేంద్రం దాసోహం కార్పొరేట్ శక్తులు, ధనికులకు మేలు జరిగేలా కేంద్ర బడ్జెట్ ఉందని, పేదలపై మరింత పన్నుల భారం పడనుందని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. రుణ భారంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. ఆ దిశగా నిర్ణయాలు తీసుకోకపోగా కార్పొరేట్‌కు సంబంధించి రూ.2 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారని విమర్శించారు. ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకునేందుకే ప్రధాని మోదీ అసెంబ్లీ, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే కొత్త ఎత్తుగడ వేస్తున్నారని, ఈ విధానాన్ని సీపీఎం వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం ఆకాంక్ష నెరవేరాలంటే బీజేపీ నుంచి దేశానికి విముక్తి కల్పించాలని అన్నారు. మైనార్టీలు, దళితులు, బీసీలపై బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు దాడులు చేస్తున్నాయని విమర్శించారు. టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా వామపక్షాలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయమే బీఎల్ఎఫ్ ఎజెండా: తమ్మినేని సామాజిక న్యాయమే ఎజెండాగా బీఎల్ఎఫ్ కార్యాచరణ ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. సామాజికంగా, ఆర్థికంగా దోపిడీకి గురవుతున్న వారిలో 98 శాతం మంది బహుజనులేనని.. వారు ఉమ్మేస్తే ఆ సునామీలో ఇతర పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు. బంగారు తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని.. అయితే ‘బహుజన తెలంగాణ’బీఎల్ఎఫ్ అంతిమ లక్ష్య మని స్పష్టం చేశారు. అంతకుముందు మేకల అభినవ్ స్టేడియం నుంచి సభాప్రాంగణం వరకు రెడ్‌షర్ట్ వలంటీర్ల ర్యాలీ నిర్వహించారు. -
ఎన్నికల బాండ్స్‌పై సుప్రీంకోర్టుకు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన 'ఎలక్టోరల్ బాండ్స్' విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. 'ఆర్ధిక బిల్లు 2017'గా పేర్కొంటూ.. ఎలక్టోరల్ బాండ్స్ విధానానికి కేంద్రం తెరలేపిందని ఆయన విమర్శించారు. ఇందుకోసం జనవరి 2, 2018న కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. రాజకీయ పార్టీలకు విదేశీ కార్పొరేట్ కంపెనీలు అందిస్తున్న విరాళాలపై ఈమేరకు సీపీఎం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దేశంలో రాజకీయ అవినీతి పెరుగుతుందని, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని, కార్పొరేట్లను కాపాడేందుకు 'ఎలక్టోరల్ బాండ్స్' విధానాన్ని కేంద్రం తీసుకొచ్చిందని సీపీఎం తన పిటీషన్లో పేర్కొంది. ఈ విషయమై సుప్రీంకోర్టు కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ పై సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని, ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సీపీఎం తన పిటిషన్లో పేర్కొంది. కార్పొరేట్ కంపెనీలు అధికారంలోకి వచ్చే పార్టీలకు డబ్బిచ్చి.. తమ పనులు చేయించుకుంటాయని తెలిపింది. ఈ వ్యవహారంలో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే ప్రయత్నం జరుగుతుందని పేర్కొంది. రాజకీయ పార్టీలకు విరాళాల కేటాయింపుపై జాతీయ స్థాయిలో ఓ విధానం ఉండాలని, కేంద్ర ఎన్నికల సంఘం నేతృత్వంలో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు పారదర్శకతతో విరాళాలు ఇచ్చే విధానం ఉండాలని తెలిపింది. ఎలక్టోరల్ బాండ్స్ విధానం ద్వారా రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందని విమర్శించింది. విదేశీ కంపెనీలు రాజకీయ పార్టీలకు ఎంత నిధులిస్తున్నాయో తెలియకుండా ఉండేలా చట్టం చేస్తున్నారని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ,19 (1ఏ) సమాచార హక్కు చట్టానికి విఘాతం కలిగేలా ఎలక్టోరల్ బాండ్స్ విధానం ఉందని పేర్కొంది. గతంలో మనీబిల్లుగా పార్లమెంటులో బీజేపీ తీసుకువస్తే రాజ్యసభలో ఐదు సవరణలు చేశామని, రాజ్యసభ సవరణలకు ఆమోదం తెలిపినప్పటికీ, లోక్‌సభలో బీజేపీ తనకున్న మెజారిటీతో ఆ సవరణలను తిరస్కరించిందని తెలిపింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, విదేశీ కార్పొరేట్ల నుంచి వచ్చిన మొత్తం విరాళాలలో 89 శాతం నిధులు అధికార పార్టీకే వచ్చాయని, 2004-5 ఆర్ధిక సంవత్సరం నుంచే విదేశీ కంపెనీలు కాంగ్రెస్, బీజేపీలకు కోట్లరూపాయల విరాళాలు ఇస్తున్నాయని, అవినీతి విషయంలో కాంగ్రెస్, బిజెపి రెండూ ఒకటేనని సీపీఎం నేత ఏచూరి విమర్శించారు. -
బీజేపీని ఎదుర్కొనే శక్తి మాకే ఉంది: ఏచూరి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కొనే శక్తి సీపీఎంకే ఉందని, ఆ విషయం తెలిసే బీజేపీ తమపై దాడులకు పాల్పడుతోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశవ్యాప్తంగా సీపీఎం కార్యాలయాల ముందు బీజేపీ ధర్నాలకు పిలుపునివ్వడానికి ప్రతిచర్యగా సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి ర్యాలీ చేపట్టారు. వీపీ హౌస్ నుంచి ప్రారంభించిన ఈ ర్యాలీని బీజేపీ కార్యాలయం ఉన్న అశోకా రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏచూరి మీడియాతో మాట్లాడుతూ.. కేరళ, త్రిపురలో వామపక్షాలు బలంగా ఉన్నాయి కాబట్టే బీజేపీ తమపై దాడులు చేస్తోందని విమర్శించారు. -
అణు రియాక్టర్లతో ఏపీని ప్రమాదంలో పడేస్తారా?
ఢిల్లీ: గుజరాత్‌ను సేఫ్‌గా ఉంచి అణు రియాక్టర్లతో ఆంధ్రప్రదేశ్‌ని ప్రమాదం పడేస్తారా? అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గుజరాత్‌లోని అణురియాక్టర్లను కొవ్వాడకు మార్చడంలో కుట్ర దాగి ఉందంటూ ఆరోపించారు. గుజరాత్లో ఉన్న అణురియాక్టర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్చడంలో ఆంతర్యమేమిటి అని సూటిగా ప్రశ్నించారు. అన్ని న్యూక్లియర్ రియాక్టర్లను ఒకే చోట పెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అమెరికా ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌ను పావుగా మారుస్తున్నారని విమర్శించారు. ఏకపక్షంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం సరికాదని సీతారాం ఏచూరి తెలిపారు. -
'రాజకీయ పార్టీల జోక్యం వల్లే రోహిత్ ఆత్మహత్య'
హైదరాబాద్: రాజకీయ పార్టీల జోక్యం వల్లే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. రోహిత్ ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో సీతారం ఏచూరీ మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ రాజీనామ చేయాలన్నారు. హెచ్‌సీయూ వైస్ చాన్సలర్ అప్పారావును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ కోసం సమగ్ర కమిటీని వేయాలని సీతారం ఏచూరి కోరారు.