ఆ టీవీ షోతో ప్రయోజనం లేదు : ఏచూరి | Sitaram Yechury Slams Narendra Modi In New Delhi | Sakshi
Sakshi News home page

ఆ టీవీ షోతో ప్రయోజనం లేదు : ఏచూరి

Published Wed, Aug 14 2019 6:46 PM | Last Updated on Wed, Aug 14 2019 7:03 PM

Sitaram Yechury Slams Narendra Modi In New Delhi - Sakshi

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై  సీపీఎం జనరల్‌ సెక్రటరీ సీతారాం ఏచూరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జిమ్‌ కార్పెట్‌ నేషనల్‌ పార్క్‌లో డిస్కవరీ చానెల్‌ నిర్వహించిన మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ కార్యక్రమంలో మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొనడంపై ఏచూరి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. మోదీ పాల్గొన్న టీవీ షో ఆహ్లాదానికి పనికొస్తుందే కానీ భారత ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి దోహదపడదని విమర్శించారు.   

2014 నుంచి దేశ పరిస్థితి క్షీణిస్తుంటే.. మోదీ ప్రభుత్వం ఎలాంటి నివారణ ప్రణాళికలు రూపొందించడం లేదని ఆరోపించారు. రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థ మరింతగా కుదేలవుతుందని, అన్ని రంగాలు సంక్షోభాలు ఎదుర్కొంటాయని చెప్పారు. దేశ ప్రయోజనాలు కాపాడాల్సిన వారు టీవీ షో పేరిట కాలక్షేపం చేయడం విచారకరమని ఏచూరి ఆవేదన వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement