హైదరాబాద్: రాజకీయ పార్టీల జోక్యం వల్లే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. రోహిత్ ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
బుధవారం హైదరాబాద్‌లో సీతారం ఏచూరీ మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ రాజీనామ చేయాలన్నారు. హెచ్‌సీయూ వైస్ చాన్సలర్ అప్పారావును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ కోసం సమగ్ర కమిటీని వేయాలని సీతారం ఏచూరి కోరారు.
'రాజకీయ పార్టీల జోక్యం వల్లే రోహిత్ ఆత్మహత్య'
Published Wed, Jan 20 2016 10:35 AM | Last Updated on Mon, Oct 22 2018 2:09 PM
Advertisement