
సాక్షి, చెన్నై : మూత్రనాళ ఇన్ఫెక్షన్‌కు చికిత్స పొందుతున్న ద్రవిడ మున్నేత్ర కగజం(డీఎంకే) పార్టీ అధినేత కరుణానిధిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరిలు పరామర్శించారు. కరుణానిధి రాజకీయాల్లో అపర చాణక్యుడని, ఆయన ఎన్నో సంస్కరణలకు ఆద్యుడని సీతారాం ఏచూరి అన్నారు. కరుణ ఆరోగ్యంపై స్టాలిన్‌ను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు.
ఆయన త్వరలోనే సంపూర్ణం ఆరోగ్యంతో ముందుకు రావాలని ఆకాంక్షించారు. కాగా, శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కరుణానిధికి రక్తపోటు ఒక్కసారిగా తగ్గింది. దీంతో ఆయన్ని చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్సచేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రక్తపోటు నియంత్రణలోకి వచ్చిందని శనివారం రాత్రి ఆసుపత్రి వర్గాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment