ఆస్పత్రి నుంచి కరుణానిధి డిశ్చార్జ్
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి పూర్తిగా కోలుకున్నారు. శుక్రవారం చెన్నైలోని కావేరి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కరుణానిధి తన నివాసానికి వెళ్లారు. మరికొన్ని రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు.
గొంతు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ ఈ నెల 15న కరుణానిధి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, తమిళనాడు మంత్రులు, పలువురు ప్రముఖులు కావేరి ఆస్పత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. కరుణ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కావడంతో డీఎంకే కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి వద్ద బాణసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొన్నారు.