కోలుకున్న కరుణానిధి
డీఎంకే అధినేత ఎం. కరుణానిధి కోలుకున్నారు. అనారోగ్యంతో ఈనెల 15వ తేదీన కావేరి ఆస్పత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని చెబుతున్నారు. ఆళ్వార్‌పేటలోని కావేరి ఆస్పత్రిలో ఆయన పూర్తిగా కోలుకుని, కుర్చీలో కూర్చుని టీవీ చూస్తున్న ఫొటోను ఆస్పత్రివర్గాలు విడుదల చేశాయి. యాంటీబయాటిక్స్ కోర్సు పూర్తయిన తర్వాత ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని చెప్పాయి.
ఇక కరుణానిధి గురువారమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని ఆయన కుమార్తె, రాజ్యసభ ఎంపీ కనిమొళి తెలిపారు. ట్రాకొస్టమీ జరిగినందువల్ల ఆయన ప్రస్తుతం మాట్లాడే పరిస్థితిలో లేరని, అది తప్ప ఆయన ఆరోగ్యం అంతా బాగానే ఉందని ఆమె చెప్పారు. గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ఆయన ఈనెల 15న చెన్నై కావేరి ఆస్పత్రిలో చేరారు. శ్వాసకోశ సమస్యలు కూడా ఆయనకు ఉన్నట్లు అప్పట్లో చెప్పారు.