DMK chief
-
సోమవారం చెన్నైలో విపక్షాల భేటీ
న్యూఢిల్లీ: దేశంలో సామాజిక న్యాయం అమలు తీరుతెన్నులపై చర్చించడానికి కాంగ్రెస్‌తోపాటు 20 ప్రతిపక్ష పార్టీల నేతలు సోమవారం తమిళనాడు రాజధాని చెన్నైలో భేటీ కానున్నారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ ఈ సమావేశం నిర్వహించనున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) చీఫ్ హేమంత్ సోరెన్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, బీఆర్ఎస్ నాయకుడు కె.కేశవరావు, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నాయకుడు డి.రాజా, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యనేత సంజయ్ సింగ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి డెరెక్ ఓ బ్రియన్ తదితరులు పాల్గొంటారు. మరికొన్ని పార్టీల నుంచి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయ సమావేశం కాదని, సామాజిక అంశంపై చర్చించడానికి జరుగుతున్న భేటీ అని విపక్ష నేతలు వెల్లడించారు. -
బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలి
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ వైఖరిని వ్యతిరేకించే కాంగ్రెస్, వామపక్ష, ప్రాంతీయ పార్టీలన్నీ సమైక్యఫ్రంట్‌గా ఏర్పడాలని డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రాజకీయ స్వార్థాలను విడిచిపెట్టి దేశాన్ని రక్షించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో డీఎంకేతో మైత్రి మాదిరిగానే దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా సూత్రప్రాయమైన మైత్రిని ఏర్పర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీకి ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో శుక్రవారం ఎంకే స్టాలిన్ పీటీఐకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘భారతదేశం భిన్నత్వాన్ని, సమాఖ్య విధానం, లౌకికత, ప్రజాస్వామ్యం, సౌభ్రాతృత్వం, రాష్ట్రాల హక్కులు, విద్యారంగ హక్కులను పరిరక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రాజకీయ స్వార్థాన్ని పక్కనబెట్టి ఏకం కావాలి. ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి దేశాన్ని కాపాడుకోవాలి’అని ఆయన అన్నారు. బీజేపీ పట్ల తమది వ్యక్తిగత ద్వేషం కాదన్నారు. అంశాల ప్రాతిపదికగానే బీజేపీ విధానాలను తాము విమర్శిస్తున్నామని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో డీఎంకే ఎప్పుడూ కీలకభూమిక పోషిస్తూనే ఉందన్నారు. పార్లమెంట్లో డీఎంకే మూడో అతిపెద్ద పార్టీ అని చెప్పారు. ‘రాష్ట్రాల రాజకీయాలన్నీ కలిస్తేనే జాతీయ రాజకీయాలు. అంతే తప్ప, జాతీయ, రాష్ట్ర రాజకీయం అంటూ వేర్వేరుగా ఉండవు’అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బలహీనంగా మారినందున బీజేపీకి వ్యతిరేకంగా సాగే పోరాటంలో ప్రాంతీయ పార్టీలే కీలకంగా ఉండా లంటూ వస్తున్న వాదనపై ఆయన స్పందిస్తూ.. ఈ విధానం కొన్ని రాష్ట్రాల్లో సరైంది కావచ్చు. కానీ, చాలా రాష్ట్రాల విషయంలో ఈ వైఖరి సరిపోదు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకం కావాలి. మా రాష్ట్రంలో బీజేపీతో విభేదించే పార్టీలతో కూటమిగా ఏర్పడి, లౌకిక శక్తులను ఏకం చేశాం. కాంగ్రెస్ పార్టీ కూడా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఇదే మైత్రితో వ్యవహరించాలని స్టాలిన్ అన్నారు -
ఎన్నికల వేళ, డీఎంకేకు ఐటీ వరుస షాక్స్
సాక్షి చెన్నై: తమిళనాడులోరానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే నాయకులపై వరుస ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అల్లుడి నివాసం ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. స్టాలిన్ అల్లుడి శబరీశన్‌కు చెందిన నాలుగు ప్రదేశాల్లో శుక్రవారనం ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. నీలంగరైలో ఉన్న ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. స్టాలిన్ కూతురు సెంతమారై తన భర్త శబరీశన్‌తో పాటు అక్కడే నివసిస్తున్నారు. కాగా ఏప్రిల్ 6 న జరిగనున్న ఎన్నికలకు ముందు డీఎంకే నేతలు, పార్టీతో సంబంధం ఉన్న వారిపై జరిపిన దాడుల్లో ఇది రెండోసారి. ఇళ్లపై ఐటీ దాడులు జరగడం ఇది రెండవసారి.గత నెలలో డీఎంకే నేత ఈ వేలూ నివాసంతోపాటు 10 కి పైగా చోట్ల ఐటీశాఖ సోదాలు చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలను బెదిరించేందుకు బీజేపీతో జతకలిసిన కూటమి పన్నిన పన్నాగమని, ఇది రాజకీయ కుట్ర అంటూ డీఎంకే నేతలు ఖండించారు. -
కశ్మీర్ అంశం, చిదంబరం అరెస్ట్ రహస్యమిదే!
సాక్షి, చెన్నై: దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై డీఎంకే తీవ్రంగా స్పందించింది. దేశ జీడీపీ 5శాతానికి పడిపోవడంపై ఎన్డీఏ సర్కార్‌ను డీఎంకే తీవ్రంగా దుయ్యబట్టింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 5 శాతానికి పడిపోవడం చాలా ఆందోళనకరమైందని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ బుధవారం విమర్శించారు. గత 27 ఏళ్లలో ఇంత బలహీనమైన జీడీపీ వృద్ధి గణాంకాలను చూడలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘భయంకరమైన' ఆర్థిక మందగమనాన్ని దాచిపెట్టడానికే కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం అరెస్ట్‌లాంటి అంశాలను కేంద్రం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఆర్థిక మందగమనాన్ని కప్పిపుచ్చే ప్రణాళికలో భాగంగానే ఇదంతా జరుగుతోందన్నారు. అయితే దీనికి సంబంధించి మీడియాలో వార్తలు రాకుండా నిరోధించినప్పటికీ, ఆర్థిక పరిస్థితిపై సోషల్ మీడియాలో విరివిగా వార్తలొచ్చాయని స్టాలిన్ పేర్కొన్నారు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మంత్రుల మూడు దేశాల పర్యటనపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఇది టూరింగ్ కేబినెట్ అనివ్యాఖ్యానించారు. 2015, 2019 సంవత్సరాలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌ను ఏఐడీఎంకే ప్రభుత్వం నిర్వహించిందని గుర్తుచేసిన ఆయన పెట్టుబడులు, ఉద్యోగాలపై పళని ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా పెట్టుబడులను ఆకర్షించేందుకు పళని స్వామి బృందం ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 10 వరకు అమెరికా, బ్రిటన్ సహా మూడుదేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. -
నాకెవ్వరూ పోటీ కాదు: స్టాలిన్
చెన్నై: కేంద్రంలో బీజేపీని మళ్లీ గద్దెనెక్కకుండా చేయడం, రాష్ట్రంలో అన్నాడీఎంకేను ఓడించడమే తమ లక్ష్యమని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గురువారం మీడియాకు తెలిపారు. టీటీవీ దినకరన్ ఆధ్వర్యంలో అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) దక్షిణ చెన్నై సెక్రెటరీగా వ్యవహరిస్తున్న వీపీ కళైరాజన్ ఈ రోజు మధ్యాహ్నం డీఎంకేలో చేరారు. తిరుచ్చిలో జరిగిన ఒక సభలో కళైరాజన్‌ను పార్టీలోకి ఆహ్వానించిన స్టాలిన్ మాట్లాడుతూ బీజేపీ, అన్నాడీఎంకే ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఏఎంఎంకేతోపాటు వివిధ పార్టీలకు చెందిన చాలామంది నాయకులు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని.. బీజేపీ, అన్నాడీఎంకేలను ఎదుర్కోవడం తమతోనే సాధ్యమని మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. పార్టీలో చేరిన కళైరాజన్ మాట్లాడుతూ ‘తమిళనాడును కాపాడే సత్తా, ద్రవిడ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే తెగువ స్టాలిన్‌కే ఉన్నాయన్నారు. కళైరాజన్‌ను ఏఎంఎంకే నుంచి దినకరన్ బుధవారం బహిష్కరించారు. వీ సెంథిల్ తర్వాత ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రెండో నేత కళైరాజన్. -
భావి ప్రధాని రాహుల్: తృణమూల్ అభ్యంతరం
సాక్షి, న్యూఢిల్లీ : భావి ప్రధానిగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రతిపాదించడం పట్ల తృణమూల్ కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని అభ్యర్ధి పేరును వెల్లడించడం విపక్ష పార్టీల ఐక్యతను దెబ్బతీస్తుందని హెచ్చరించింది. స్టాలిన్ ప్రతిపాదనను తాము తీవ్రంగా తీసుకున్నామని, ప్రధాని పదవికి ఏ ఒక్కరి పేరు వెల్లడించడం స్వాగతించదగినది కాదని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతే ప్రధాని ఎవరనేది నిర్ణయించాలని తాము గతంలోనే స్పష్టం చేశామని తృణమూల్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ సైతం ఎవరి పేర్లనూ ప్రస్తావించని క్రమంలో ఇతర పార్టీలు ఎందుకు ఆ పనికి పూనుకుంటున్నాయని ప్రశ్నించింది. కరుణానిధి విగ్రహావిష్కరణ సందర్భంగా శనివారం చెన్నైలో భావి ప్రధాని రాహుల్ పేరును డీఎంకే చీఫ్ స్టాలిన్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ విజయాల నేపథ్యంలో ప్రధాని రేసులో రాహుల్ పేరును స్టాలిన్ ప్రకటించడం గమనార్హం. ఈ దేశాన్ని కాపాడేందుకు మోదీని ఓడించే సత్తా కలిగిన రాహుల్ గాంధీని తాను ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తున్నానని స్టాలిన్ పేర్కొన్నారు. సమాజ్‌వాది పార్టీ సైతం రాహుల్ అభ్యర్ధిత్వాన్ని ముందుకు తేవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశ ప్రధాని ఎవరనేది ప్రజల తీర్పు ద్వారానే వెల్లడవుతుందని ఆ పార్టీ నేత ఘన్‌శ్యామ్ తివారీ చెప్పుకొచ్చారు. తృణమూల్‌తో పాటు ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీలు సైతం స్టాలిన్ ప్రకటనతో విభేదించాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆయా పార్టీలు పేర్కొన్నాయి. -
డీఎంకే చీఫ్‌గా ఎన్నికైన స్టాలిన్
సాక్షి, చెన్నై : తమిళనాడులో ప్రధాన విపక్షం ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ ఎన్నికయ్యారని మంగళవారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు.స్టాలిన్ (65) ఇప్పటివరకూ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వ్యవహరించారు. తన తండ్రి, పార్టీ అధ్యక్షుడు ఎం కరుణానిధి ఈనెల 7న మరణించడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. పార్టీ అధ్యక్ష పదవికి 65 మంది జిల్లా కార్యదర్శులు ప్రతిపాదించగా స్టాలిన్ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు తనను పార్టీలోకి తిరిగి తీసుకోని పక్షంలో పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని కరుణానిధిచే డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన స్టాలిన్ సోదరుడు ఎంకే అళగిరి హెచ్చరించారు. పార్టీని నడిపించే సమర్ధత స్టాలిన్‌కు లేదని విమర్శించారు. తన తండ్రికి శ్రద్ధాంజలి ఘటించేందుకు అళగిరి సెప్టెంబర్ 5న మౌన ర్యాలీ చేపట్టనున్నారు. కరుణానిధి మరణం నేపథ్యంలో పార్టీ శ్రేణుల నుంచి తిరుగులేని మద్దతుతో తాను అధ్యక్ష పగ్గాలు చేపడుతున్నానని అళగిరి వ్యాఖ్యలకు స్టాలిన్ దీటుగా బదులిచ్చారు. -
డీఎంకె అధినేత కరుణానిధి కన్నుమూత
-
ఆస్పత్రి నుంచి కరుణానిధి డిశ్చార్జ్
-
ఆస్పత్రి నుంచి కరుణానిధి డిశ్చార్జ్
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి పూర్తిగా కోలుకున్నారు. శుక్రవారం చెన్నైలోని కావేరి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కరుణానిధి తన నివాసానికి వెళ్లారు. మరికొన్ని రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఈ నెల 15న కరుణానిధి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, తమిళనాడు మంత్రులు, పలువురు ప్రముఖులు కావేరి ఆస్పత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. కరుణ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కావడంతో డీఎంకే కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి వద్ద బాణసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొన్నారు. -
కోలుకున్న కరుణానిధి
-
కోలుకున్న కరుణానిధి
డీఎంకే అధినేత ఎం. కరుణానిధి కోలుకున్నారు. అనారోగ్యంతో ఈనెల 15వ తేదీన కావేరి ఆస్పత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని చెబుతున్నారు. ఆళ్వార్‌పేటలోని కావేరి ఆస్పత్రిలో ఆయన పూర్తిగా కోలుకుని, కుర్చీలో కూర్చుని టీవీ చూస్తున్న ఫొటోను ఆస్పత్రివర్గాలు విడుదల చేశాయి. యాంటీబయాటిక్స్ కోర్సు పూర్తయిన తర్వాత ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని చెప్పాయి. ఇక కరుణానిధి గురువారమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని ఆయన కుమార్తె, రాజ్యసభ ఎంపీ కనిమొళి తెలిపారు. ట్రాకొస్టమీ జరిగినందువల్ల ఆయన ప్రస్తుతం మాట్లాడే పరిస్థితిలో లేరని, అది తప్ప ఆయన ఆరోగ్యం అంతా బాగానే ఉందని ఆమె చెప్పారు. గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆయన ఈనెల 15న చెన్నై కావేరి ఆస్పత్రిలో చేరారు. శ్వాసకోశ సమస్యలు కూడా ఆయనకు ఉన్నట్లు అప్పట్లో చెప్పారు. -
డీఎంకే చీఫ్ కరుణానిధికి అస్వస్థత
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో నెలరోజులకుపైగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆమె రాజకీయ ప్రత్యర్థి, డీఎంకే నేత ఎం కరుణానిధి కూడా అస్వస్థతకు గురయ్యారు. రోజు తీసుకునే మెడిసిన్స్ వల్ల అలర్జీ కావడంతో కరుణానిధి అస్వస్థతకు గురైనట్టు మంగళవారం డీఎంకే ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. కరుణానిధి విశ్రాంతి తీసుకుంటున్నారని, సందర్శకులను కలవబోరని డీఎంకే పేర్కొంది. కరుణానిధికి పరామర్శించేందుకు వచ్చి ఆయనకు ఇబ్బంది కలగించవద్దని విజ్ఞప్తి చేసింది. కరుణానిధి అస్వస్థతకు గురయ్యారని తెలియడంతో డీఎంకే కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో గత నెల 22న చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె పరిస్థతి విషమంగా ఉందంటూ వదంతులు వచ్చాయి. అయితే జయలలిత కోలుకుంటున్నారని, త్వరలో డిశ్చార్జి చేస్తామని అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. -
తమిళనాడులో వారసుడు వచ్చేశాడు
-
తమిళనాడులో వారసుడు వచ్చేశాడు
తమిళనాడులో ఇన్నాళ్లుగా నలుగుతున్న వారసత్వ పోరు ఓ కొలిక్కి వచ్చింది. తన తర్వాత రాజకీయ వారసుడిగా ఎంకే స్టాలిన్ (63) ఉంటాడని డీఎంకే అధినేత కరుణానిధి (92) ప్రకటించారు. అయితే తాను మాత్రం ఇప్పట్లో రాజకీయాల నుంచి రిటైరయ్యే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. దాంతో ఇన్నాళ్లుగా సోదరులు అళగిరి, స్టాలిన్ మధ్య ఉందనుకున్న వారసత్వ పోరుకు తెరపడినట్లయింది. స్టాలినే తన రాజకీయ వారసుడని ఒక తమిళ వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరుణానిధి తెలిపారు. అయితే తాను అళగిరిని మాత్రం మిస్ కావడం లేదని కూడా స్పష్టం చేశారు. కరుణానిధి తర్వాత డీఎంకే ఆధిపత్యం కోసం అళగిరి, స్టాలిన్ మధ్య చాలాకాలంగా పోరు ఉంది. కరుణానిధి మద్దతు స్టాలిన్‌కే ఉందని తెలియడంతో.. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో.. డీఎంకే తరఫున ప్రచారం చేయకూడదని కూడా అళగిరి నిర్ణయించుకున్నారు. రిటైర్మెంట్ గురించి కరుణను ప్రశ్నించగా.. ''కరుణానిధి రిటైర్మెంట్ ఇస్తారని చెప్పి విషయాలను సంక్లిష్టం చేయొద్దు. నేను ఇప్పటికిప్పుడే రిటైరైపోయి.. పగ్గాలను స్టాలిన్‌కు ఇచ్చే సమస్య లేదు'' అని చెప్పారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో స్టాలిన్ తనకు చాలా సహాయంగా ఉంటున్నాడని, అతడు యువకుడిగా ఉన్నప్పుడు కూడా గోపాలపురం యూత్ సెంటర్‌ను ఏర్పాటుచేసి.. బాగా కష్టపడ్డాడని, మీసా చట్టం కింద అరెస్టయినప్పుడు చిత్రహింసలకు గురయ్యాడని కరుణానిధి తెలిపారు. అతడి కృషివల్లే ఇప్పుడు అధ్యక్ష పదవి వచ్చిందని అన్నారు. స్టాలిన్‌కు పగ్గాలు ఇవ్వడం పట్ల డీఎంకే సీనియర్ నాయకుడు టీకేఎస్ ఇళంగోవన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. అతడికి అధికార దాహం ఏమీ లేదని.. తన సొంత కృషితో పార్టీలో ఈ స్థానానికి చేరుకున్నాడని ఆయన తెలిపారు. -
ఈసీపై కస్సుమన్న కరుణానిధి
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై డీఎంకే అధినేత ఎం. కరుణానిధి స్పందించారు. ఎన్నికల సంఘం(ఈసీ)పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికార అన్నాడీఎంకేకు ఈసీ.. లొంగిపోయిందని, అనుకూలంగా పనిచేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో రూ. 570 కోట్లు పట్టుబడితే ఈసీ నుంచి ఎటువంటి సమాధానం లేదని వాపోయారు. అవరకురిచ్చి, తంజావూరు అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల వాయిదాకు కారణమైన బీజేపీ, పీఎంకే ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు స్థానాల్లో ఎన్నికలు వాయిదా ఎన్ని సీట్లు గెలుస్తారని ఆయన ప్రశ్నించారు. మరోసారి వాయిదా వేస్తే ఆందోళనకు దిగుతానని కరుణానిధి హెచ్చరించారు. అధికారంలోకి వస్తామని భావించిన కరుణానిధికి ఆశాభంగం ఎదురైంది. తమిళనాడు అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని డీఎంకే కూటమి 98 స్థానాలు గెల్చుకుంది. జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకే 134 సీట్లలో విజయం సాధించి అధికారం నిలబెట్టుకుంది. -
కోర్టుకు హాజరైన కరుణానిధి
-
కోర్టుకు హాజరైన కరుణానిధి
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి (92) సోమవారం చెన్నై కోర్టుకు హాజరయ్యారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆయన కోర్టుకు వచ్చారు. కరుణానిధి వెంట ఆయన కూతురు కనిమొళి, చిన్న కొడుకు స్టాలిన్ ఉన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు ఈ కేసు విచారణను మార్చి 10 వ తేదీకి వాయిదా వేసింది. డీఎంకే మేగజైన్లో ప్రచురించిన ఓ వ్యాసంలో తన పరువుకు భంగం కలిగేలా రాశారని ఆరోపిస్తూ గతేడాది జయలలిత పరువు నష్టం దావా వేశారు. కాగా జయ ఆరోపణలను కరుణానిధి ఖండించారు. -
విజయకాంత్‌కి ఆహ్వానం
విజయకాంత్‌కు కరుణ ఆహ్వానం ఎన్నికల మేనిఫెస్టో కసరత్తు చెన్నై : డీఎంకేతో దోస్తికి ముందుకు రావాలని డీఎండీకే అధినేత విజయకాంత్‌కు ఆ పార్టీ అధినేత ఎం కరుణానిధి స్వయంగా ఆహ్వానం పలికారు. ఎన్నికల మేనిఫెస్టో కసరత్తుకు డీఎంకే శ్రీకారం చుట్టింది. డీఎండీకేను తమ వైపునకు తిప్పుకునేందుకు డీఎంకే విశ్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, విజయకాంత్ వారికి చిక్కకుండా ముందుకు సాగుతున్నారు. ఇన్నాళ్లు డీఎంకే దూతలు విజయకాంత్‌తో మంతనాలు సాగిస్తే, తాజాగా ప్రజా కూటమి రంగంలోకి దిగడంతో డీఎంకే అధినేత ఎం కరుణానిధి సైతం మెట్టుదిగినట్టు ఉన్నారు. విజయకాంత్‌కు స్వయంగా కరుణానిధి ఆహ్వానం పలకడం విశేషం. బుధవారం డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో ఎన్నికల మేనిఫెస్టో కసరత్తులకు కరుణానిధి శ్రీకారం చుట్టారు. మేనిఫెస్టో కమిటీతో భేటీ అయ్యారు. తదుపరి మీడియా ముందుకు వచ్చిన కరుణానిధి విజయకాంత్‌కు ఆహ్వానం పలికారు. డీఎంకేతో దోస్తికి విజయకాంత్ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజా కూటమి నాయకులు డీఎండీకే అధినేత విజయకాంత్‌తో భేటీ కావడం గురించి ప్రశ్నించగా, సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. -
ఉద్యమానికి సన్నద్ధం కండి!
సాక్షి, చెన్నై: తమిళ సమాజాభ్యున్నతిని కాంక్షిస్తూ మహోద్యమానికి ప్రజలు సన్నద్ధం కావాలని డీఎంకే అధినేత ఎం కరుణానిధి పిలుపునిచ్చారు. ప్రజాహితమే లక్ష్యంగా, వారిలో చైతన్యం తీసుకురావడం ధ్యేయంగా ముందుకు సాగుదామన్నారు. నగరంలో గురువారం జరిగిన ఓ వివాహ వేడుకలో కరుణానిధి ప్రసంగిం చారు. సమాజంలో, సంప్రదాయాల్లో వస్తున్న మార్పుల గురించి ఇక్కడ ప్రసంగించిన వాళ్లందరూ ఆవేదన వ్యక్తం చేశారని తన ప్రసంగంలో కరుణానిధి గుర్తు చేశారు. సమాజ హితాన్ని, తమిళ ప్రజా సంక్షేమాన్ని పరిరక్షించే రీతిలో ప్రతి ఒక్కరూ అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సమాజం ఎటు వెళ్తున్నదోనని అన్వేషించకుండా, వెళ్లకుండా అడ్డుకునే మార్గాల మీద దృష్టి పెట్టాలని సూచించారు. తమిళుడు తమిళుడుగానే జీవించాలని పిలుపునిచ్చారు. తమిళులందరూ ఒకే తాటిపై ఉంటే, ఏ శక్తీ అడ్డుకోలేదన్నారు. ఇందులో విజయం తమిళుడిదేనన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తమిళుల మీద మరొకరు ఆధిపత్యం చెలాయించే స్థాయికి పరిస్థితుల్ని తీసుకెళ్ల కూడదని, ఏకతాటిపై ఉంటే తమిళుడి సత్తా ఏమిటో తెలిసి వస్తుందంటూ పరోక్షంగా బీజేపీ వేస్తున్న రాజకీయ ఎత్తుగడల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ఇతర పార్టీలకు తన ఆహ్వానాన్ని పంపించే విధంగా ఆ వ్యాఖ్యల్ని కరుణానిధి అందుకున్నట్టుగా అక్కడే ఉన్న డీఎంకే వర్గాలు ఈ సమయంలో గుస గుసలాడటం విశేషం. తమిళుల కోసం డీఎంకే పడ్డ శ్రమ, చేసిన కృషిని ఎలుగెత్తి చాటే సమయం వచ్చిందని, ప్రతి ఒక్కరూ ఆ దిశగా పయనించాలని పిలుపునిచ్చారు. తమిళ సమాజం పరిరక్షణ, అభ్యున్నతే ధ్యేయంగా, తమిళ సమాజ వికాసం కోసం మహోద్యమానికి ప్రజల్ని సన్నద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని తమిళ సమాజాభ్యున్నతికి పాటుపడుదామని పిలుపు నిచ్చారు. మౌనంగా ఉంటే మంచిదే: తన ప్రసంగం అనంతరం వెలుపలకు వచ్చిన కరుణానిధి మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ముల్లై పెరియార్, కావేరి తీరంలో డ్యాం నిర్మాణం గురించి సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, రాజకీయాలు చేస్తున్న వాళ్లు చేస్తూనే ఉన్నారని పరోక్షంగా అధికార పక్షాన్ని ఉద్దేశించి విమర్శించారు. అసెంబ్లీకి, కేబినెట్ సమావేశానికి పిలుపునివ్వాలని డిమాండ్ చేస్తే, పట్టించుకున్న వారు లేరంటూ, ఇక ఆ డ్యాంల విషయంలో ఏ మేరకు శ్రద్ధ చూపుతారని విమర్శించారు. అన్నాడీఎంకే సర్కారు వ్యవహారంతో పప్పు, నూనె కొనుగోళ్లపై ఆరోపణలు వస్తున్నాయే..? అని ప్రశ్నించగా, అవినీతా, నష్టమా అన్నది తేల్చండి ముందు అని చమత్కరించారు. సీఎం పన్నీరు సెల్వం తమరిని ఉద్దేశించి మౌనంగా ఉంటే మంచిదని హితవు పలికారే...? అని ప్రశ్నించగా, సీఎం.. ఎవరో...వాళ్లు మౌనంగా ఉంటే ప్రపంచానికీ, తమిళనాడుకు మంచిదే, కాబట్టి వాళ్లు ముందు మౌనంగా ఉంటే మంచిదంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. -
డీఎంకే బృందం
స్టాలిన్ సహా ఐదుగురు సభ్యులు సీట్ల కేటాయింపుపై త్వరలో చర్చలు 15న తిరుచ్చిలో పార్టీ మహానాడు చెన్నై, సాక్షి ప్రతినిధి:లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి నడిచే పార్టీలకు, సొంత పార్టీ నేతలకు నియోజకవర్గాల కేటాయింపు పనులకు ఎన్నికల బృందం ఏర్పాటైంది. డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ శుక్రవారం ఎన్నికల బృందంలోని సభ్యుల పేర్లను ప్రకటించారు. రాష్ట్రంలోని 39, పుదుచ్చేరిలోని ఒకటి కలుపుకుని మొత్తం 40 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిర్ణయించే వ్యవహారానికి డీఎంకే సిద్ధమైంది. పొత్తుపెట్టుకున్న పార్టీలతో సుహృద్భావ వాతావరణంలో ముందుగా చర్చలు జరిపి అనంతరం సొంతపార్టీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఎన్నికల వేళ ఇటువంటి కీలకమైన బాధ్యతల భారాన్ని ప్రధానంగా ఐదుగురిపై పార్టీ మోపింది. డీఎంకే కోశాధికారి, కరుణ తనయుడు స్టాలిన్, సహాయ ప్రధాన కార్యదర్శులు దురైమురుగన్, వీపీ దురైస్వామి, న్యాయవిభాగం కార్యదర్శి పీఎస్ భారతి, పార్టీ నిర్వాహక కార్యదర్శి పీవీ కల్యాణ సుందరం ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు మరో కమిటీ సిద్ధమైంది. డీఎంకే పార్లమెంటరీ నాయకుడు, ఎంపీ టీఆర్ బాలుతోపాటూ పార్లమెంటు సభ్యులు కనిమొళి, ఏ రాజా, పార్టీ సహాయ ప్రధాన కార్యదర్శి సద్గుణ పాండియన్, నిర్వాహక కార్యదర్శి టీకేఎస్ ఇళంగోవన్లపై కరుణ మేనిఫెస్టో బాధ్యతలను కేటారుుంచారు. 15న తిరుచ్చిలో పార్టీ మహానాడు డీఎంకే 10వ మహానాడును ఈనెల 15, 16వ తేదీల్లో తిరుచ్చిరాపల్లిలో నిర్వహిస్తున్నారు. 200 ఎకరాల్లో సభను ఏర్పాటు చేసి 10 లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహానాడు విజయవంతానికి రెండు వేల యువ, మహిళా వలంటీర్లను సిద్దం చేశారు. డీఎంకే అధినేత కరుణానిధి మహానాడుకు హాజరై కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారు. గత 9 మహానాడుల కంటే భారీగా నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.