న్యూఢిల్లీ: దేశంలో సామాజిక న్యాయం అమలు తీరుతెన్నులపై చర్చించడానికి కాంగ్రెస్‌తోపాటు 20 ప్రతిపక్ష పార్టీల నేతలు సోమవారం తమిళనాడు రాజధాని చెన్నైలో భేటీ కానున్నారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ ఈ సమావేశం నిర్వహించనున్నారు.
జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) చీఫ్ హేమంత్ సోరెన్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, బీఆర్‌ఎస్ నాయకుడు కె.కేశవరావు, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నాయకుడు డి.రాజా, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యనేత సంజయ్ సింగ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి డెరెక్ ఓ బ్రియన్ తదితరులు పాల్గొంటారు. మరికొన్ని పార్టీల నుంచి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయ సమావేశం కాదని, సామాజిక అంశంపై చర్చించడానికి జరుగుతున్న భేటీ అని విపక్ష నేతలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment