
సాక్షి చెన్నై: తమిళనాడులోరానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే నాయకులపై వరుస ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అల్లుడి నివాసం ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. స్టాలిన్ అల్లుడి శబరీశన్‌కు చెందిన నాలుగు ప్రదేశాల్లో శుక్రవారనం ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. నీలంగరైలో ఉన్న ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. స్టాలిన్ కూతురు సెంతమారై తన భర్త శబరీశన్‌తో పాటు అక్కడే నివసిస్తున్నారు.
కాగా ఏప్రిల్ 6 న జరిగనున్న ఎన్నికలకు ముందు డీఎంకే నేతలు, పార్టీతో సంబంధం ఉన్న వారిపై జరిపిన దాడుల్లో ఇది రెండోసారి. ఇళ్లపై ఐటీ దాడులు జరగడం ఇది రెండవసారి.గత నెలలో డీఎంకే నేత ఈ వేలూ నివాసంతోపాటు 10 కి పైగా చోట్ల ఐటీశాఖ సోదాలు చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలను బెదిరించేందుకు బీజేపీతో జతకలిసిన కూటమి పన్నిన పన్నాగమని, ఇది రాజకీయ కుట్ర అంటూ డీఎంకే నేతలు ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment