కోర్టుకు హాజరైన కరుణానిధి | DMK chief M Karunanidhi arrives in Chennai court for defamation case | Sakshi
Sakshi News home page

కోర్టుకు హాజరైన కరుణానిధి

Published Mon, Jan 18 2016 10:51 AM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM

కోర్టుకు హాజరైన కరుణానిధి

కోర్టుకు హాజరైన కరుణానిధి

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి (92) సోమవారం చెన్నై కోర్టుకు హాజరయ్యారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆయన కోర్టుకు వచ్చారు. కరుణానిధి వెంట ఆయన కూతురు కనిమొళి, చిన్న కొడుకు స్టాలిన్ ఉన్నారు.

ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు ఈ కేసు విచారణను మార్చి 10 వ తేదీకి వాయిదా వేసింది. డీఎంకే మేగజైన్లో ప్రచురించిన ఓ వ్యాసంలో తన పరువుకు భంగం కలిగేలా రాశారని ఆరోపిస్తూ గతేడాది జయలలిత పరువు నష్టం దావా వేశారు. కాగా జయ ఆరోపణలను కరుణానిధి ఖండించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement