డీఎంకే చీఫ్ కరుణానిధికి అస్వస్థత | DMK chief M Karunanidhi unwell | Sakshi
Sakshi News home page

డీఎంకే చీఫ్ కరుణానిధికి అస్వస్థత

Published Tue, Oct 25 2016 3:31 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

డీఎంకే చీఫ్ కరుణానిధికి అస్వస్థత

డీఎంకే చీఫ్ కరుణానిధికి అస్వస్థత

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో నెలరోజులకుపైగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆమె రాజకీయ ప్రత్యర్థి, డీఎంకే నేత ఎం కరుణానిధి కూడా అస్వస్థతకు గురయ్యారు. రోజు తీసుకునే మెడిసిన్స్ వల్ల అలర్జీ కావడంతో కరుణానిధి అస్వస్థతకు గురైనట్టు మంగళవారం డీఎంకే ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది.

కరుణానిధి విశ్రాంతి తీసుకుంటున్నారని, సందర్శకులను కలవబోరని డీఎంకే పేర్కొంది. కరుణానిధికి పరామర్శించేందుకు వచ్చి ఆయనకు ఇబ్బంది కలగించవద్దని విజ్ఞప్తి చేసింది. కరుణానిధి అస్వస్థతకు గురయ్యారని తెలియడంతో డీఎంకే కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో గత నెల 22న చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె పరిస్థతి విషమంగా ఉందంటూ వదంతులు వచ్చాయి. అయితే జయలలిత కోలుకుంటున్నారని, త్వరలో డిశ్చార్జి చేస్తామని అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement