
సాక్షి, చెన్నై : వాసన్ ఐ కేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏఎం అరుణ్ (51) ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. అరుణ్ మరణవార్తను చెన్నైలోని కావేరి ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఒమాండురార్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. కాగా అరుణ్ దేశవ్యాప్తంగా వాసన్ ఐ కేర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment