
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా తమ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో కొత్త వెర్షన్ విండోస్ 11ను ఆవిష్కరించింది. మరింత సరళతరమైన డిజైన్‌తో రూపొందించిన ఈ ఓఎస్.. ఈ ఏడాది ఆఖరు నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఇందులో ఈసారి ఆండ్రాయిడ్ యాప్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. విండోస్‌కి సంబంధించి ఇది కొత్త శకమని, రాబోయే దశాబ్దం .. అంతకు మించిన కాలానికి ఉపయోగపడేలా దీన్ని రూపొందించినట్లు వర్చువల్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు.
చదవండి: బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ డేటా చైనా సర్వర్లలోకి!