ఐఫోన్ (iPhone) యూజర్లకు కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఐఫోన్‌లను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. యాపిల్ యాప్ స్టోర్‌లో మైక్రోసాఫ్ట్ ఫోన్ లింక్ (Microsoft Phone Link) యాప్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ యాప్‌తో ఐఫోన్ యూజర్లు నేరుగా విండోస్ (Windows) పీసీకి స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు.మ
ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె!
ఇంతకుముందు ఐఫోన్‌ను మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్‌తో మాత్రమే కనెక్ట్ చేసుకునే వీలు ఉండేది. ఈ కొత్త అప్‌డేట్‌తో ఐఫోన్ యూజర్లు తమ ఫోన్‌లను విండోస్ పీసీలకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. iOS కోసం కొత్త ఫోన్ లింక్ యాప్ 85 మార్కెట్‌లలో 39 భాషల్లో విడుదల చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ ఏడాది మొదట్లో ఈ ఫీచర్‌ను ప్రకటించారు. విండోస్ 11 యూజర్లందరూ మే నెల మధ్య నాటికి ఫోన్ లింక్‌లో ఐఫోన్ సపోర్ట్‌కు యాక్సెస్ పొందుతారని కంపెనీ పేర్కొంది.
ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్‌లో మైక్రోసాఫ్ట్ ఫోన్ లింక్ యాప్ అందుబాటులోకి వచ్చినా విండోస్ పీసీలలో ఐఫోన్‌తో కనెక్షన్‌కు సపోర్ట్ చేయడం లేదు. దీన్ని సరిచేయడానికి మైక్రోసాఫ్ట్ కొత్త యాప్ లేదా సిస్టమ్ అప్‌డేట్‌ను విడుదల చేయవచ్చు. అయితే ఈ సమస్య యూజర్లందరికీ లేదు.
ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ ఈ-పాస్‌బుక్ డౌన్‌లోడ్ కావడం లేదా? బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే..
విండోస్ 11 పీసీలో ఒకవేళ iOS ఫోన్ లింక్ యాప్‌కి సపోర్ట్ చేసి ఎనేబుల్ చేసుకుంటే తమ ఐఫోన్‌ను పీసీకి కనెక్ట్ చేసుకుని కాల్స్, సందేశాలు, కాంటాక్టలను యాక్సెస్ చేసుకునేందుకు iOS సపోర్ట్ చేస్తుందని మైక్రోసాఫ్ట్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.
ఇలా కనెక్ట్ చేసుకోండి..
- విండోస్ పీసీలో ఫోన్ లింక్ యాప్ iOSతో కనెక్షన్‌కు సపోర్ట్ చేస్తే ఐఫోన్‌ను పీసీకి కనెక్ట్ చేసుకోవడం చాలా సులభం.
- ఐఫోన్‌లో యాపిల్ స్టోర్ Microsoft Phone Link యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
- తర్వాత 'iPhone'ని ఎంచుకుని, QR కోడ్‌తో సెటప్‌ను పూర్తి చేయండి.
- అనంతరం నోటిఫికేషన్ ప్రాధాన్యతలను సెట్ చేసుకోండి.
- తర్వాత ఐఫోన్‌లో ఫోన్ లింక్ యాప్‌ను ఓపెన్ చేయండి లేదా విండోస్ 11 పీసీ టాస్క్‌బార్‌లో ‘ఫోన్ లింక్’ కోసం సెర్చ్ చేయండి.
- ఇప్పుడు ఐఫోన్‌ను విండోస్ పీసీకి కనెక్ట్ చేసుకోండి.
ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్!
Comments
Please login to add a commentAdd a comment