microsoft app
-
ఐఫోన్ యూజర్లకు కొత్త యాప్..
ఐఫోన్ (iPhone) యూజర్లకు కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఐఫోన్లను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. యాపిల్ యాప్ స్టోర్‌లో మైక్రోసాఫ్ట్ ఫోన్ లింక్ (Microsoft Phone Link) యాప్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ యాప్‌తో ఐఫోన్ యూజర్లు నేరుగా విండోస్ (Windows) పీసీకి స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు.మ ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె! ఇంతకుముందు ఐఫోన్‌ను మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్‌తో మాత్రమే కనెక్ట్ చేసుకునే వీలు ఉండేది. ఈ కొత్త అప్డేట్తో ఐఫోన్ యూజర్లు తమ ఫోన్లను విండోస్ పీసీలకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. iOS కోసం కొత్త ఫోన్ లింక్ యాప్ 85 మార్కెట్లలో 39 భాషల్లో విడుదల చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ ఏడాది మొదట్లో ఈ ఫీచర్‌ను ప్రకటించారు. విండోస్ 11 యూజర్లందరూ మే నెల మధ్య నాటికి ఫోన్ లింక్‌లో ఐఫోన్ సపోర్ట్‌కు యాక్సెస్ పొందుతారని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్‌లో మైక్రోసాఫ్ట్ ఫోన్ లింక్ యాప్ అందుబాటులోకి వచ్చినా విండోస్ పీసీలలో ఐఫోన్‌తో కనెక్షన్‌కు సపోర్ట్ చేయడం లేదు. దీన్ని సరిచేయడానికి మైక్రోసాఫ్ట్ కొత్త యాప్ లేదా సిస్టమ్ అప్డేట్ను విడుదల చేయవచ్చు. అయితే ఈ సమస్య యూజర్లందరికీ లేదు. ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ ఈ-పాస్‌బుక్ డౌన్లోడ్ కావడం లేదా? బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే.. విండోస్ 11 పీసీలో ఒకవేళ iOS ఫోన్ లింక్ యాప్‌కి సపోర్ట్ చేసి ఎనేబుల్ చేసుకుంటే తమ ఐఫోన్‌ను పీసీకి కనెక్ట్ చేసుకుని కాల్స్, సందేశాలు, కాంటాక్టలను యాక్సెస్ చేసుకునేందుకు iOS సపోర్ట్ చేస్తుందని మైక్రోసాఫ్ట్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. ఇలా కనెక్ట్ చేసుకోండి.. విండోస్ పీసీలో ఫోన్ లింక్ యాప్ iOSతో కనెక్షన్‌కు సపోర్ట్ చేస్తే ఐఫోన్‌ను పీసీకి కనెక్ట్ చేసుకోవడం చాలా సులభం. ఐఫోన్లో యాపిల్ స్టోర్ Microsoft Phone Link యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత 'iPhone'ని ఎంచుకుని, QR కోడ్‌తో సెటప్‌ను పూర్తి చేయండి. అనంతరం నోటిఫికేషన్ ప్రాధాన్యతలను సెట్ చేసుకోండి. తర్వాత ఐఫోన్లో ఫోన్ లింక్ యాప్‌ను ఓపెన్ చేయండి లేదా విండోస్ 11 పీసీ టాస్క్‌బార్‌లో ‘ఫోన్ లింక్’ కోసం సెర్చ్ చేయండి. ఇప్పుడు ఐఫోన్‌ను విండోస్ పీసీకి కనెక్ట్ చేసుకోండి. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
గుడ్ న్యూస్: ఉచితంగా మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్వేర్
మీరు పీడీఎఫ్ ఫైల్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారా? అయితే మీకు గుడ్ న్యూస్. రూ.2,724 విలువైన మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అందిస్తున్న ఆఫర్ ఇది. ఈ మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్వేర్ జూలై 3 వరకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత కొనాలంటే మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్వేర్ కోసం రూ.2,724(36.56 డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల మైక్రోసాఫ్ట్ యూజర్లు జూలై 3 వరకు పీడీఎఫ్ మేనేజర్ ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆఫర్ మరో రెండు రోజులు మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులకు భాగ ఉపయోగపడుతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌తో పీడీఎఫ్ ఫైల్స్‌ని మెర్జ్, రీఆర్డర్, స్ప్లిట్, ఎడిటింగ్ చేయొచ్చు. మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ టూల్ ఉపయోగించి ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. రొటేట్, డిలిట్ కూడా చేయొచ్చు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఎలా డౌన్లోడ్ ఇప్పుడు తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ ఎలా? మీ మైక్రోసాఫ్ట్ ఖాతా ద్వారా మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసి పీడీఎఫ్ మేనేజర్ అని టైపు చేయండి. ఇప్పడు మీకు కనిపించే పీడీఎఫ్ మేనేజర్ బ్లూ గెట్ బటన్ మీద క్లిక్ చేయండి మీ వివరాలు ఎంటర్ చేసి సాఫ్ట్వేర్ మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయాలి. మీరు ఏ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఆ డివైజ్ నుంచే లాగిన్ కావాలి. చదవండి: గ్లోబల్ సైబర్ సెక్యూరిటీలో చైనాను దాటేసిన భారత్ -
మైక్రోసాఫ్ట్ నుంచి సరికొత్త సెలబ్రిటీ యాప్
మీకు బాగా ఇష్టమైన సెలబ్రిటీలు ఏం చేస్తున్నారో సరిగ్గా తెలియడంలేదా? వాళ్ల ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియాలను ఫాలో కావడం కష్టంగా ఉందా? అయితే.. మీ కోసం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సరికొత్త యాప్ ఒకదాన్ని తయారుచేసింది. 'స్నిప్3టి' అనే ఈ యాప్ ద్వారా సెలబ్రిటీల పేజీలకు సబ్‌స్క్రైబ్ చేసుకుని, వాల్లు ఏం చేస్తున్నారో అన్ని విషయాలూ తెలుసుకోవచ్చు. సెలబ్రిటీల ప్రొఫైల్ మీద ఒక్కసారి ట్యాప్ చేస్తే చాలు.. వాళ్ల మొత్తం ప్రొఫైల్ కనిపించడంతో పాటు వాళ్ల గురించి కథనాలు కూడా చదవొచ్చని, అలాగే దానికి సంబంధించిన అన్ని కథనాలు, ఫొటో గ్యాలరీలు, వీడియోలు, సోషల్ మీడియా విశేషాలు కూడా ఒకేచోట లభిస్తాయని ఆ యాప్ గురించి వివరించారు. అయితే.. ప్రస్తుతానికి ఇది కేవలం యాపిల్ ఐఫోన్లకు మాత్రమే పనికొస్తుంది. ఈ యాప్‌ను ఐఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఫేస్‌బుక్‌తో పర్సనలైజ్ చేసుకోవాలని అది అడుగుతుంది. ఆ తర్వాత మరింతమంది సెలబ్రిటీలను ఫాలో అయ్యేందుకు ఆప్షన్లు లభిస్తాయి. అయితే, కేవలం ఐఫోన్‌తో మాత్రమే సరిపెట్టి విండోస్, ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ యాప్‌ను ఎందుకు రూపొందించలేదన్న విషయం మాత్రం తెలియదు.