మీకు బాగా ఇష్టమైన సెలబ్రిటీలు ఏం చేస్తున్నారో సరిగ్గా తెలియడంలేదా? వాళ్ల ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియాలను ఫాలో కావడం కష్టంగా ఉందా? అయితే.. మీ కోసం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సరికొత్త యాప్ ఒకదాన్ని తయారుచేసింది. 'స్నిప్3టి' అనే ఈ యాప్ ద్వారా సెలబ్రిటీల పేజీలకు సబ్స్క్రైబ్ చేసుకుని, వాల్లు ఏం చేస్తున్నారో అన్ని విషయాలూ తెలుసుకోవచ్చు.
సెలబ్రిటీల ప్రొఫైల్ మీద ఒక్కసారి ట్యాప్ చేస్తే చాలు.. వాళ్ల మొత్తం ప్రొఫైల్ కనిపించడంతో పాటు వాళ్ల గురించి కథనాలు కూడా చదవొచ్చని, అలాగే దానికి సంబంధించిన అన్ని కథనాలు, ఫొటో గ్యాలరీలు, వీడియోలు, సోషల్ మీడియా విశేషాలు కూడా ఒకేచోట లభిస్తాయని ఆ యాప్ గురించి వివరించారు. అయితే.. ప్రస్తుతానికి ఇది కేవలం యాపిల్ ఐఫోన్లకు మాత్రమే పనికొస్తుంది. ఈ యాప్ను ఐఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఫేస్బుక్తో పర్సనలైజ్ చేసుకోవాలని అది అడుగుతుంది. ఆ తర్వాత మరింతమంది సెలబ్రిటీలను ఫాలో అయ్యేందుకు ఆప్షన్లు లభిస్తాయి. అయితే, కేవలం ఐఫోన్తో మాత్రమే సరిపెట్టి విండోస్, ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ యాప్ను ఎందుకు రూపొందించలేదన్న విషయం మాత్రం తెలియదు.
మైక్రోసాఫ్ట్ నుంచి సరికొత్త సెలబ్రిటీ యాప్
Published Mon, Aug 11 2014 12:27 PM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM
Advertisement
Advertisement