Microsoft PDF Manager For Free Till June 3rd: Check Complete Details Inside - Sakshi
Sakshi News home page

గుడ్ న్యూస్: ఉచితంగా మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్‌ సాఫ్ట్‌వేర్

Published Thu, Jul 1 2021 6:07 PM | Last Updated on Thu, Jul 1 2021 8:12 PM

Microsoft PDF Manager Worth RS 2724 Available Free Till June 3 - Sakshi

మీరు పీడీఎఫ్ ఫైల్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారా? అయితే మీకు గుడ్ న్యూస్. రూ.2,724 విలువైన మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్‌ సాఫ్ట్‌వేర్ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అందిస్తున్న ఆఫర్ ఇది. ఈ మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్‌ సాఫ్ట్‌వేర్ జూలై 3 వరకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత కొనాలంటే మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్‌వేర్ కోసం రూ.2,724(36.56 డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల మైక్రోసాఫ్ట్ యూజర్లు జూలై 3 వరకు పీడీఎఫ్ మేనేజర్ ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆఫర్ మరో రెండు రోజులు మాత్రమే ఉంటుంది.

ముఖ్యంగా ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విద్యార్థులకు భాగ ఉపయోగపడుతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌తో పీడీఎఫ్ ఫైల్స్‌ని మెర్జ్, రీఆర్డర్, స్ప్లిట్, ఎడిటింగ్ చేయొచ్చు. మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ టూల్ ఉపయోగించి ఫైల్స్ ఎక్స్‌ట్రాక్ట్ చేయొచ్చు. రొటేట్, డిలిట్ కూడా చేయొచ్చు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఎలా డౌన్‌లోడ్ ఇప్పుడు తెలుసుకుందాం.

మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్‌ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్  ఎలా?

  • మీ మైక్రోసాఫ్ట్ ఖాతా ద్వారా మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేయండి. 
  • ఇప్పుడు సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసి పీడీఎఫ్ మేనేజర్‌ అని టైపు చేయండి.
  • ఇప్పడు మీకు కనిపించే పీడీఎఫ్ మేనేజర్‌ బ్లూ గెట్ బటన్ మీద క్లిక్ చేయండి 
  • మీ వివరాలు ఎంటర్ చేసి సాఫ్ట్‌వేర్ మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. 
  • మీరు ఏ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో ఈ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే ఆ డివైజ్ నుంచే లాగిన్ కావాలి.

చదవండి:  గ్లోబల్‌ సైబర్‌ సెక్యూరిటీలో చైనాను దాటేసిన భారత్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement