PC
-
టీవీలు కంప్యూటర్లుగా మారిపోతే.. జియో కొత్త టెక్నాలజీ
రిలయన్స్ జియో మరో కొత్త టెక్నాలజీకి నాంది పలుకుతోంది. ఇంట్లోని స్మార్ట్ టీవీలను తక్కువ ఖర్చుతో సులభంగా కంప్యూటర్లుగా మార్చే సాంకేతికతను ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024లో ప్రదర్శించింది. జియో క్లౌడ్ పీసీ (Jio Cloud PC) అని పిలిచే ఈ టెక్నాలజీ కేవలం కొన్ని వందల రూపాయలకే టీవీని కంప్యూటర్‌గా మారుస్తుంది.ఇందుకోసం ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ టీవీ, టైపింగ్ కీబోర్డ్, మౌస్, జియో క్లౌడ్ పీసీ యాప్ మాత్రం ఉంటే చాలు. స్మార్ట్ టీవీలే కాకుండా సాధారణ టీవీలను సైతం జియోఫైబర్ లేదా జియోఎయిర్‌ఫైబర్‌తో వచ్చే సెట్-టాప్ బాక్స్ ద్వారా కంప్యూటర్లుగా మార్చుకోవచ్చు. జియో క్లౌడ్ పీసీ అనేది ఇంటర్నెట్ ద్వారా ఏదైనా టీవీని క్లౌడ్ కంప్యూటింగ్‌కు కనెక్ట్ చేసే సాంకేతికత.జియో క్లౌడ్ పీసీ టెక్నాలజీని ఉపయోగించడం చాలా సులభం. యూజర్ యాప్‌లోకి లాగిన్ అయితే చాలు. క్లౌడ్‌లో స్టోర్ అయిన డేటా మొత్తం టీవీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. సాధారణంగా కంప్యూటర్లో చేసే ఈమెయిల్, మెసేజింగ్, సోషల్ నెట్వర్కింగ్, ఇంటర్నెట్ సర్ఫింగ్, స్కూల్ ప్రాజెక్ట్‌లు, ఆఫీసు ప్రెజెంటేషన్ల వంటి పనులన్నింటినీ ఇప్పుడు టీవీలో చేయవచ్చు.ఖరీదైన కంప్యూటర్లను కొనుక్కోలేని దేశంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఈ సాంకేతికత ఒక వరం లాంటిది. క్లౌడ్ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు కాబట్టి, సాధారణ కంప్యూటర్‌తో పోలిస్తే ఇది సురక్షితంగా ఉండటమే కాకుండా డేటా రికవరీని చాలా సులభతరం చేస్తుంది. ఇది టీవీలతో పాటు మొబైల్ పరికరాలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ యాప్‌కు సంబంధించిన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, రాబోయే నెలల్లో దీనిని మార్కెట్లో విడుదల చేయవచ్చు. -
భారత్‌లో ట్యాబ్లెట్ పీసీల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్యాబ్లెట్ పీసీల అమ్మకాలు భారత్‌లో జోరుగా సాగుతున్నాయి. 2024 ఏప్రిల్–జూన్‌లో దేశవ్యాప్తంగా 18.4 లక్షల యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. గతేడాది 2023 ఏప్రిల్–జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో అమ్మకాలు రెండింతలకుపైగా పెరిగి 129 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. మార్కెట్ రిసర్చ్ కంపెనీ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ప్రకారం.. క్యూ2లో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ట్యాబ్లెట్ పీసీలను కొనుగోలు చేయడం, అలాగే గతేడాది ఏప్రిల్–జూన్‌లో అమ్మకాలు తక్కువగా ఉండడం 2024 జూన్ త్రైమాసికంలో అధిక వృద్ధి రేటుకు కారణం అయింది. 2023 ఏప్రిల్–జూన్‌లో 8 లక్షల ట్యాబ్లెట్ పీసీలు అమ్ముడయ్యాయి. ముందంజలో సామ్సంగ్..ట్యాబ్లెట్ పీసీల విపణిలో జూన్ క్వార్టర్లో 48.7 శాతం వాటాతో సామ్సంగ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కమర్షియల్ సెగ్మెంట్లో 54.1, కంజ్యూమర్ విభాగంలో 38 శాతం వాటాను సామ్సంగ్ సాధించింది. ఈ కంపెనీ విక్రయాలు ఏకంగా మూడింతలై 9,01,000 యూనిట్లకు చేరుకున్నాయి. ఏసర్ 23.6 శాతం, యాపిల్ 9.5, లెనోవో 6.9, షావొమీ 4.7 శాతం వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. ఏసర్ అమ్మకాలు 27,000 నుంచి 4,37,000 యూనిట్లకు ఎగశాయి. యాపిల్ 12.3 శాతం వృద్ధితో 1,76,000 యూనిట్ల సేల్స్ సాధించింది. లెనోవో విక్రయాలు 2.8 శాతం క్షీణించగా, షావొమీ 85.8 శాతం దూసుకెళ్లింది. స్లేట్ ట్యాబ్లెట్ విభాగం గతేడాదితో పోలిస్తే 178.1 శాతం పెరిగింది. డిటాచేబుల్ ట్యాబ్లెట్స్ సెగ్మెంట్ 23.6 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది.ఇదీ చదవండి: దేశీ స్టార్టప్ పిక్సెల్కు నాసా కాంట్రాక్టు ఈ ఏడాది 20 శాతం వృద్ధి..భారత ట్యాబ్లెట్స్ మార్కెట్ 2023తో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం 20 శాతం వృద్ధితో 50,76,000 యూనిట్లు నమోదు చేస్తుందని గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్ అనలిస్ట్ కంపెనీ కెనాలిస్ అంచనా వేస్తోంది. 2025లో వృద్ధి 8 శాతానికి పరిమితం అవుతుందని జోస్యం చెబుతోంది. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా ట్యాబ్లెట్స్ విక్రయాలు 54,79,000 యూనిట్లను తాకుతుందని ధీమాగా ఉంది. 2024 జనవరి–మార్చిలో 13,47,000 యూనిట్ల ట్యాబ్లెట్స్ అమ్ముడయ్యాయని కెనాలిస్ వెల్లడించింది. 2023 మార్చి త్రైమాసికంతో పోలిస్తే 37 శాతం వృద్ధి నమోదైంది. పర్సనల్ కంప్యూటర్స్, ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ ఈ ఏడాది భారత్‌లో 11 శాతం, 2025లో 15 శాతం దూసుకెళుతుందని కెనాలిస్ అంచనా వేస్తోంది. డెస్క్‌టాప్స్, నోట్‌బుక్స్, ట్యాబ్లెట్ పీసీలు దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి–మార్చిలో 43 లక్షల యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. -
అలా తీసి ఇలా పట్టుకెళ్లిపోవచ్చు.. ధర ఎంతంటే?
అమెరికన్ కంప్యూటర్స్ తయారీ సంస్థ 'హెచ్‌పీ' ఇటీవల భారతీయ మార్కెట్లో కొత్త 'ఎన్వీ మూవ్' (Envy Move) ఆల్ ఇన్ వన్ పీసీ లాంచ్ చేసింది. ఈ పీసీను మనతోపాటు తీసుకెళ్లడానికి అనుగుణంగా ఉండేందుకు కంపెనీ హ్యాండిల్, ఫీట్ వంటి వాటిని అందించింది. దీంతో మనం ఒక బ్రీఫ్‌కేస్ మాదిరిగా తీసుకెళ్లవచ్చు. కొత్త హెచ్‌పీ ఎన్వీ మూవ్ ప్రారంభ ధర రూ.124990. 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 అయిన ఈ కంప్యూటర్ టచ్ నావిగేషన్‌కు సపోర్ట్ చేసే 23.8 ఇంచెస్ క్యూహెచ్డీ డిస్ప్లే పొందుతుంది. ఆడియో కోసం బ్యాంగ్ & ఒలుఫ్సెన్ మేకర్స్ ఆడియో సిస్టమ్స్ పొందుపరిచారు. ఈ లేటెస్ట్ పర్సనల్ కంప్యూటర్ ఓన్ వైడ్ విజన్ టెక్నాలజీతో అడ్జస్టబుల్ 5 మెగా పిక్సెల్ కెమెరా పొందుతుంది. ఈ కంప్యూటర్ భద్రతను లేదా సేఫ్టీకి దృష్టిలో ఉంచుకుని సంస్థ మాన్యువల్ ప్రైవేట్ షట్టర్, వాక్ అవే లాక్ వంటి మరిన్ని ఫీచర్స్ అందిస్తోంది. డిస్ప్లే: 23.8 ఇంచెస్ QHD IPS డిస్ప్లే, టచ్, 300 నిట్స్ బ్రైట్నెస్ ప్రాసెసర్: 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5 గ్రాఫిక్స్: ఇంటెల్ UHD గ్రాఫిక్స్ ర్యామ్: 16జీబీ LPDDR5 వరకు స్టోరేజ్: 1 టీబీ PCIe NVMe M.2 SSD కెమెరా: హెచ్‌పీ వైడ్ విజన్ 5ఎంపీ ఓఎస్: విండోస్ 11 హోమ్ పోర్ట్స్: 1 యూఎస్బీ టైప్-ఏ, 1 యూఎస్బీ టైప్-సీ, 1 HDMI పోర్ట్ కనెక్టివిటీ: Wi-Fi 6E, బ్లూటూత్ v5.3 ఛార్జింగ్: 90W బరువు: 4.1 కేజీలు హెచ్‌పీ కంపెనీ లాంచ్ చేసిన 'ఎన్వీ మూవ్' లాంటి కంప్యూటర్లు బహుశా ఇండియన్ మార్కెట్లో లేదనే చెప్పాలి, ఎందుకంటే పర్సనల్ కంప్యూటర్ మనతోపాటు తీసుకెళ్లడం అంటే కొంత కష్టమే, అయితే దీనికి హ్యాండిల్ ఉండటం వల్ల బ్రీఫ్‌కేస్ మాదిరిగా తీసుకెళ్లిపోవచ్చు. కాబట్టి ఇలాంటి కంప్యూటర్ దేశంలో ఇదే మొదటిదై ఉంటుందని భావిస్తున్నాము. అయితే ఎన్వీ మూవ్ కంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్న PCలు చాలానే అందుబాటులో ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. -
షూ కాదిది, కంప్యూటర్!, ధర ఎంతంటే?
చూడటానికి స్పోర్ట్స్ షూలా కనిపిస్తుంది గాని, నిజానికి ఇది పర్సనల్ కంప్యూటర్. మామూలు కంప్యూటర్ సీపీయూలో ఉండే మదర్బోర్డ్, ప్రాసెసర్, హార్డ్‌డిస్క్, ర్యామ్ వంటి భాగాలన్నీ ఇందులోనూ ఉంటాయి. దీనిని మానిటర్‌కు అనుసంధానించుకుని, చక్కగా పనిచేసుకోవచ్చు. ఇందులో 2టీబీ హార్డ్‌డిస్క్, 32జీబీ ర్యామ్, ఎన్విడియా ఆర్టీఎక్స్ 4070 జీపీయూ, ఇంటెల్‌కోర్ ఐ7 ప్రాసెసర్‌తో పనిచేసే 13700 సీపీయూ, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటాయి. అమెరికన్ కంపెనీ కూల్‌మాస్టర్ తన ముప్పయ్యో వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల స్పోర్ట్స్ షూ ఆకారంలో ఉండే ఈ పీసీని ‘సీఎంఓడీఎస్’ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 6000 డాలర్లు (రూ.4.99 లక్షలు). -
తొలి కంప్యూటర్ అందించిన టెక్ దిగ్గజం, బిలియనీర్ ఎవరో తెలుసా?
పారిశ్రామికవేత్త టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు, దాత శివ్ నాడార్ (జూలై 14) 78వ పడిలోకి అడుగుపెట్టారు. సెల్ఫ్-మేడ్ ఇండియన్ బిలియనీర్ శివ నాడార్ తన దూరదృష్టి , మార్గదర్శక నిర్ణయాలతో దేశీయంగా తొలి వ్యక్తిగత కంప్యూటర్ను అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో భారతదేశం అగ్రగామిగా ఎదగడానికి సహాయం చేసినవారిలో శివ నాడార్ ప్రముఖుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు విద్యా, గ్రామీణాభివృద్ధిపై శివ నాడార్ ఫౌండేషన్, ఇతర అనేక స్వచ్ఛంద సంస్థలద్వారా భూరి విరాళాలిచ్చే గొప్ప పరోపకారి కూడా. ఎక్కడ పుట్టారు? తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలోని తిరుచందూర్ దగ్గర్లోని మూలైపోజి అనే పల్లెటూర్లో పుట్టారు శివనాడార్. కోయంబత్తూర్‌లోని పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత, నాడార్ 1967లో పూణేలోని వాల్చంద్ గ్రూప్ కూపర్ ఇంజనీరింగ్‌లో కరియర్ ప్రారంభించారు. అనంతరం ఢిల్లీ క్లాత్ మిల్స్ డిజిటల్ ఉత్పత్తుల విభాగంలో ఉద్యోగానికి మారారు. (జయహో! రాకెట్ వుమన్ ఆఫ్ ఇండియా రీతు కరిధాల్) 1975లో హెచ్‌సీఎల్ ఆవిర్భావం ఆ తర్వాత 1975లో, తన స్నేహితులు, సహోద్యోగులతో కలిసి మైక్రోకాంప్ లిమిటెడ్ అనే పేరుతో తన సొంత వెంచర్‌ను ప్రారంభించాడు. కంపెనీలో అతిపెద్ద వాటాదారు అయిన నాడార్‌తో సహా 8 మంది భాగస్వాములు ఉన్నారు. కంపెనీ తొలుత టెలి-డిజిటల్ కాలిక్యులేటర్లను విక్రయించడంపై దృష్టి సారించింది. 1976లో ఐబీఎం ఇండియా నుంచి వెళ్లిపోవడంతో నాడార్ భారతదేశంలోని కంప్యూటర్ మార్కెట్ అవకాశాలపై దృష్టి పెట్టారు. కేవలం 18,700 రూపాయల ప్రారంభ పెట్టుబడితో హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) ఆవిష్కరించారు. హెచ్సీఎల్ను మొదటి పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పిపిపి)గా మార్చే కంపెనీలో 26 శాతం వాటాకు బదులుగా రూ. 20 లక్షల అదనపు గ్రాంట్‌తో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మద్దతిచ్చింది. 1999లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో హెచ్‌సీఎల్‌టెక్ లిస్ట్ అయింది. తొలి పీసీ, ఐటీ రంగంపై అంచనాలు ఐబీఎం, యాపిల్ కంటే ముందే దేశంలో తొలి హెచ్‌సీఎల్ 8సీ తొలి పీసీ 1978లో అందించిన ఘనత శివ నాడార్ దక్కించుకున్నారు. సొంత యాజమాన్య హార్డ్‌వేర్‌తో హార్డ్‌వేర్ కంపెనీగా ప్రారంభమై పర్సనల్ కంప్యూటర్ కంపెనీగా రూపాంతరం చెందింది. తొలి ఏడాదిలోనే రూ. 10 లక్షల అమ్మకాలతో 1979 నాటికి రూ. 3 కోట్ల విలువైన కంపెనీగా నిలిచింది. అంతేనా ఐటీ రంగం, ఐటీ సేవలను ప్రాధాన్యతను అప్పట్లోనే పసిగట్టి, ఇందుకోసం సింగపూర్‌కు మారారు. అంతర్జాతీయంగా తన వ్యాపారాన్ని విస్తరించారు. (ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్) బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, 2022లో, సంస్థ 11.5 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని సాధించింది.బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, శివ్ నాడార్ నికర విలువ సుమారు 25.9 బిలియన్ల డాలర్లు అని అంచనా. 2020లో దేశంలో మూడో అతి పెద్ద ఐటీ కంపనీ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఛైర్మన్‌గా తన బాధ్యతలనుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఏకైక కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. శివసుబ్రమణ్య నాడార్ పేరుతో పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపిస్తే శివ నాడార్ స్థాపించారు. 1994లో నాడార్ తన దాతృత్వ సంస్థ శివ్ నాడార్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. తండ్రికి తగ్గ కూతురిగా రోషిణి నాడార్ తన తండ్రి శివ నాడార్ పేరిట "శివనాడార్ విశ్వవిద్యాలయం" స్థాపించడం విశేషం. ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రఫీ జాబితాలో -2022 జాబితాలో శివ్ నాడార్ టాప్‌లో నిలిచారు. 2021-22 మధ్య ఆయన ఏకంగా రూ.1,161 కోట్లు విరాళం ఇచ్చారు. అంటే సగటున రోజుకు శివ్ నాడార్ రూ.3 కోట్లు విరాళం గొప్ప పరోపకారిగా నిలిచారు. -
ఐఫోన్ యూజర్లకు కొత్త యాప్..
ఐఫోన్ (iPhone) యూజర్లకు కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఐఫోన్లను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. యాపిల్ యాప్ స్టోర్‌లో మైక్రోసాఫ్ట్ ఫోన్ లింక్ (Microsoft Phone Link) యాప్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ యాప్‌తో ఐఫోన్ యూజర్లు నేరుగా విండోస్ (Windows) పీసీకి స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు.మ ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె! ఇంతకుముందు ఐఫోన్‌ను మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్‌తో మాత్రమే కనెక్ట్ చేసుకునే వీలు ఉండేది. ఈ కొత్త అప్డేట్తో ఐఫోన్ యూజర్లు తమ ఫోన్లను విండోస్ పీసీలకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. iOS కోసం కొత్త ఫోన్ లింక్ యాప్ 85 మార్కెట్లలో 39 భాషల్లో విడుదల చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ ఏడాది మొదట్లో ఈ ఫీచర్‌ను ప్రకటించారు. విండోస్ 11 యూజర్లందరూ మే నెల మధ్య నాటికి ఫోన్ లింక్‌లో ఐఫోన్ సపోర్ట్‌కు యాక్సెస్ పొందుతారని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్‌లో మైక్రోసాఫ్ట్ ఫోన్ లింక్ యాప్ అందుబాటులోకి వచ్చినా విండోస్ పీసీలలో ఐఫోన్‌తో కనెక్షన్‌కు సపోర్ట్ చేయడం లేదు. దీన్ని సరిచేయడానికి మైక్రోసాఫ్ట్ కొత్త యాప్ లేదా సిస్టమ్ అప్డేట్ను విడుదల చేయవచ్చు. అయితే ఈ సమస్య యూజర్లందరికీ లేదు. ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ ఈ-పాస్‌బుక్ డౌన్లోడ్ కావడం లేదా? బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే.. విండోస్ 11 పీసీలో ఒకవేళ iOS ఫోన్ లింక్ యాప్‌కి సపోర్ట్ చేసి ఎనేబుల్ చేసుకుంటే తమ ఐఫోన్‌ను పీసీకి కనెక్ట్ చేసుకుని కాల్స్, సందేశాలు, కాంటాక్టలను యాక్సెస్ చేసుకునేందుకు iOS సపోర్ట్ చేస్తుందని మైక్రోసాఫ్ట్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. ఇలా కనెక్ట్ చేసుకోండి.. విండోస్ పీసీలో ఫోన్ లింక్ యాప్ iOSతో కనెక్షన్‌కు సపోర్ట్ చేస్తే ఐఫోన్‌ను పీసీకి కనెక్ట్ చేసుకోవడం చాలా సులభం. ఐఫోన్లో యాపిల్ స్టోర్ Microsoft Phone Link యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత 'iPhone'ని ఎంచుకుని, QR కోడ్‌తో సెటప్‌ను పూర్తి చేయండి. అనంతరం నోటిఫికేషన్ ప్రాధాన్యతలను సెట్ చేసుకోండి. తర్వాత ఐఫోన్లో ఫోన్ లింక్ యాప్‌ను ఓపెన్ చేయండి లేదా విండోస్ 11 పీసీ టాస్క్‌బార్‌లో ‘ఫోన్ లింక్’ కోసం సెర్చ్ చేయండి. ఇప్పుడు ఐఫోన్‌ను విండోస్ పీసీకి కనెక్ట్ చేసుకోండి. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
అరచేతిలో ఇమిడిపోయే పర్సనల్ కంప్యూటర్.. ధర ఎంతంటే?
పర్సనల్ కంప్యూటర్లలో కీలక భాగం సీపీయూ (సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్). మానిటర్, కీబోర్డ్, మౌస్ వంటివన్నీ పీసీకి సాధనాలు మాత్రమే! సాధారణంగా పర్సనల్ కంప్యూటర్ బరువు దాదాపు ఐదు కిలోల నుంచి పది కిలోల వరకు ఉంటుంది. ఇటీవల ఒక అమెరికన్ కంపెనీ ‘ఫ్యూజన్5 ఎఫ్ఎంపీ4’ బ్రాండ్ పేరుతో మినీ పీసీని అందుబాటులోకి తెచ్చింది. ఇది అరచేతిలో ఇట్టే ఇమిడిపోతుంది. దీని బరువు 140 గ్రాములు మాత్రమే! సాధారణ పీసీకి ఉన్నట్లే దీనికి కూడా యూఎస్బీ పోర్టులు, హెచ్డీఎంఐ పోర్టు, హెడ్‌ఫోన్ జాక్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ వంటివన్నీ ఉంటాయి. ‘క్వాడ్‌కోర్ ఇంటెల్ ఎన్4120 ప్రాసెసర్’ అమర్చిన ఈ పీసీ ‘విండోస్–11’ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. డ్యూయల్ బాండ్ వైఫై కనెక్టివిటీ కూడా ఉండటంతో దీంట్లో ఇంటర్నెట్ వాడుకోవడం కూడా తేలికే! దీని ధర 249.99 డాలర్లు (రూ.20,622) మాత్రమే! -
Tech layoffs మరో టాప్ కంపెనీ నుంచి 6650 ఉద్యోగులు ఔట్!
సాక్షి,ముంబై: టెక్ ఉద్యోగులకు మరో చేదు వార్త. గ్లోబల్ ఆర్థిక మాంద్యం భయాలు, ఆదాయాల క్షీణత పలు టెక్ కంపెనీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. దీంతో ఖర్చుల నియంత్రలో భాగంగావేలాది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కంప్యూటర్ల సంస్థ డెల్ నిలిచింది. పీసీ అమ్మకాలు పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,650 ఉద్యోగాలను తొలగించనుంది. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించింది. బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం మొత్తం సిబ్బందిలో 5 శాతం ఉద్యోగులను ఉద్వాసన పలుకుతోంది. కంపెనీ మార్కెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందనీ ఈ అనిశ్చితి భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని కో-చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లార్క్ ఉద్యోగులకు తెలిపారు. కోవిడ్ సంక్షోభం తరువాత, కంప్యూటర్లు ఇతర హార్డ్‌వేర్ ఉత్పత్తుల డిమాండ్ పెరిగి నప్పటికీ 2022 నాల్గవ త్రైమాసికంలో వ్యక్తిగత కంప్యూటర్ షిప్మెంట్లు బాగా పడిపోయాయని పరిశ్రమ విశ్లేషకులు అంటున్నారు. ప్రధానంగా డెల్ కంపెనీ అమ్మకాలు భారీ క్షీణించాయని ఐడీసీ పేర్కొంది. తొలగింపుల తర్వాత, డెల్ ఉద్యోగుల సంఖ్య కనీసం ఆరేళ్లలో కనిష్టంగా 1,26,300గా ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. కాగా 2021లో ఇదే కాలంతో పోలిస్తే డెల్ తన పర్సనల్ కంప్యూటర్ షిప్మెంట్లలో 37 శాతంతో అతిపెద్ద క్షీణతను నమోదు చేసింది. డెల్ ఆదాయం దాదాపు 55 శాతం పీసీల నుంచే వస్తుంది. -
పీసీ అప్‌గ్రేడ్ కోసం ‘డబ్ల్యూడీ ఎస్ఎన్ 570’
విజయవాడ: నేడు డేటా వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. దీంతో అధిక సామర్థ్యం కలిగిన స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల (పీసీలు) అవసరం ఏర్పడింది. ఇప్పటికే ఉన్న పీసీల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఎక్కువ మంది చూస్తున్నారు. ఇటువంటి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘వెస్టర్న్ డిజిటల్’ సంస్థ.. డబ్ల్యూడీ బ్లూ ఎస్ఎన్ 570 పేరుతో ఎస్ఎస్డీని తీసుకొచ్చింది. ఇది ఎంతో స్లిమ్‌గా చేతిలోనే పట్టే సైజుతో ఉంటుంది. 250జీబీ, 500జీబీ, 1టీబీ, 2టీబీ కెపాసీటీతో వీటిని విడుదల చేసింది. వీటి ధరలు రూ.2,750 నుంచి మొదలై రూ.20,999 వరకు ఉంటాయని కంపెనీ తెలిపింది. ఐదేళ్ల వారంటీని ఆఫర్ చే స్తోంది. ఈ సంస్థ శాన్డిస్క్, డబ్ల్యూడీ పేరుతో ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తుంటుంది. -
గేమింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సైబర్‌పంక్ 2077 గేమ్ డిసెంబర్ 10 విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ ఈ గేమ్ విడుదల అనేది మీరు నివసించే ప్రాంతం, మీరు ఆడే ప్లాట్‌ఫామ్ బట్టి మార్పు ఉంటుంది. ఇంతక ముందు తెలిపిన గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఊహించిన దాని కంటే ముందే ఆడవచ్చు. ఈ గేమ్ అన్ని దేశాల కంటే ముందు లాస్ ఏంజెల్స్ లో డిసెంబర్ 9 సాయంత్రం గంటలకు విడుదల అవ్వగా. చివరగా న్యూజిలాండ్ రాజదాని వెల్లింగ్టన్ లో డిసెంబర్ 10 మధ్యాహ్నం 1కి విడుదల అవుతుంది. వచ్చే వారం విడుదల అయ్యే సైబర్‌పంక్ 2077 మీ పిసిలో డిసెంబర్ 7 నుండి ఆటను ప్రీలోడ్ చేసుకోవచ్చు. ప్రీలోడ్‌లు జీఓజిలో 12పీఎం వద్ద మరియు ఎపిక్ గేమ్స్ స్టోర్‌లో 5పీఎం వద్ద ప్రారంభమవుతాయి. ఎక్స్ బాక్స్ వన్, ఎక్స్ బాక్స్ సిరీస్ కన్సోల్‌లలో ఇప్పటికే ఆటను ప్రీలోడ్ చేయవచ్చు. ప్లేస్టేషన్ 4 మరియు ప్లేస్టేషన్ 5లలో ప్రీలోడ్‌లు “విడుదల తేదీకి రెండు రోజుల ముందు” ప్రారంభమవుతాయి. (చదవండి: గూగుల్ మాప్స్‌లో సరికొత్త ఫీచర్) విడుడలకు సిద్ధంగా ఉన్న సైబర్‌పంక్ 2077 గేమ్ ప్రపంచ వ్యాప్తంగా మరింత ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు ఈ గేమ్ మన దేశంలో కూడా మరింత ఆసక్తి రేపుతోంది. గేమింగ్ లవర్స్ దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు సైబర్‌పంక్ 2077 భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన పిసి గేమ్‌గా నిలిచింది అని అంచనా. సైబర్‌పంక్ 2077 ఇప్పటికే జీవితకాల అమ్మకాలలో విట్చర్ 3 గేమ్ ను దాటిందని డెవలపర్ ఇంతకుముందే ప్రకటించారు. ఇది చిన్న విషయం కాదు, విట్చర్ 3 చాలా ప్రజాదరణ పొందిన గేమ్. భారతదేశంలో ఇంతకుముందు పిసి గేమింగ్ అనేది అత్యంత ఖరీదైన భావించేవారు. "సైబర్‌పంక్ 2077 భారతదేశంలో అని కన్సోల్ వెర్షన్ల కంటే పిసి గేమ్ ని ఆరు నుండి ఎనిమిది రెట్లు ఎక్కువ అమ్ముతున్నారని దేశవ్యాప్తంగా ఉన్న బహుళ రిటైలర్లు" తెలిపారని సంస్థ పేర్కొంది. కన్సోల్ వెర్షన్లతో పోల్చితే రిటైల్ ధర తక్కువగా ఉండటంతో పాటు డెస్క్‌టాప్ పిసిలకు డిమాండ్ పెరగడం ఈ పిసి గేమ్ సేల్ స్పైక్‌కు కారణమని నిపుణుడు అల్వానీ పేర్కొన్నారు. -
రంగం సిద్ధమైంది
‘రోడ్ మ్యాప్’ అంటే ఏమిటి? భారత సైన్యంలోని మహిళా ఆర్మీ అధికారుల్ని ‘పర్మినెంట్ కమిషన్’లోకి తీసుకోడానికి రోడ్ మ్యాప్ రెడీ అయిందని గురువారం ఆర్మీ చీఫ్ నరవణె అన్నారు కదా. రోడ్ మ్యాప్ అంటే ఒక ప్రణాళిక. ఒక పనికి విధి విధానాలు ఏర్పాటు చేసుకోవడం. ఆర్మీలోని ‘పర్మినెంట్ కమిషన్’ (పి.సి) లోకి ఆర్మీలోని ‘షార్ట్–సర్వీస్ కమిషన్’(ఎస్.ఎస్.సి.)లో ఉన్న మహిళా ఆర్మీ అధికారులను తీసుకోవాలని గత సోమవారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆ పనికి రోడ్ మ్యాప్ తయారైంది. తక్షణం ఎవరికి ప్రయోజం? సుప్రీంకోర్టు ఇచ్చిన గడుపు మేరకు మూడు నెలల్లో.. ఎస్.ఎస్.సి.లో ఏ విభాగంలోనైనా పదేళ్ల సర్వీసు పూర్తి చేసిన మహిళా ఆర్మీ అధికారులందరికీ ప్రయోజనమే. పి.సి.లోకి వారికి పదోన్నతి లభిస్తుంది. ఎస్.ఎస్.సి.లో పదేళ్లు పూర్తయిన వారంతా కచ్చితంగా పి.సి.లో చేరాల్సిందేనా? కచ్చితంగా ఏం లేదు. ఇష్టం ఉన్నవారు చేరవచ్చు. ఇష్టం లేనివాళ్లు పదేళ్ల సర్వీసు తర్వాత మరో నాలుగేళ్లు ఎస్.ఎస్.సి.లోనే ఉండొచ్చు. ఆ తర్వాత వారికి ఉద్యోగ విరమణే. రోడ్‌మ్యాప్ తయారైంది. తర్వాతేమిటి? ప్రస్తుతం ఆర్మీలో 1653 మంది మహిళా ఆర్మీ అధికారులు ఉన్నారు. వారిలో పదేళ్ల సర్వీసు పూర్తయిన వారు 600 మంది ఉన్నారు. ఇక ఇప్పుడు వీళ్లందరికీ లెటర్లు పంపుతారు. పర్మినెంట్ కమిషన్‌లోకి వెళ్లడం సమ్మతమేనా అని. సమ్మతం అయినవారు 60 ఏళ్ల వయసు వచ్చేవరకు పి.సి. అధికారిగా ఉండొచ్చు. ఆర్మీలోని వివిధ విభాగాలలో (పోరాట విధులు సహా) అత్యున్నత హోదాలకు చేరుకోవచ్చు. ఇప్పటి వరకు షార్ట్ సర్వీస్ కమిషన్‌లో ఉన్న పురుషులకు మాత్రమే పర్మినెంట్ కమిషన్‌లోకి వెళ్లేందుకు వీలుండేది. భారత సైన్యంలో ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? అన్ని విభాగాల్లోని స్త్రీ పురుషులందరూ కలిపి 13 లక్షల మంది ఉన్నారు. వారిలో 41 వేల మంది పురుష ఆఫీసర్లు. (మహిళా అధికారుల సంఖ్య.. పై సమాధానంలో ఉంది చూడండి). గత ఏడాది రిపబ్లిక్ పరేడ్‌లో తొలిసారి పురుష సైనిక దళానికి సారథ్యం వహించిన ఆర్మీ అధికారి లెఫ్ట్‌నెంట్ భావనా కస్తూరి (27) -
సెక్షన్ 69 బాంబు : మండిపడుతున్న ప్రతిపక్షాలు
సాక్షి, న్యూఢిల్లీ: కంప్యూటర్లు వాడే భారతీయులకు షాకింగ్ న్యూస్. మన కంప్యూటర్లలోని ప్రయివేటు మెసేజ్‌లుకు, ఈమెయిల్స్ ఇక నిఘా నీడలోకి వెళ్లబోతున్నాయి. హోం శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం దేశంలో ప్రతీ ఒక్కరు వాడే కంప్యూటర్ల పై భారత ప్రభుత్వం డేగ కన్ను వేయనుంది. ఈ మేరకు 'సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ' డివిజన్ గురువారం రాత్రి 10 సెంట్రల్ ఏజన్సీలకు అనుమతినిచ్చేశారు హోం శాఖ సెక్రటరీ రాజీవ్ గుబాబా. అంటే అనుమతి లేకుండానే కంప్యూటర్ వ్యవస్థలోకి చొరబడి మొత్తం సమాచారాన్ని పరిశీలించేందుకు,అవసరమైతే అడ్డుకునేందుకు పూర్తి అధికారాన్ని కల్పించిందన్నమాట. ఇందుకు ఇంటెలిజెన్స్ బ్యూరోతో సహా 10 దర్యాప్తు సంస్థలకు అనుమతి అంశంపై కేంద్ర హోం శాఖ స్పందించింది. “కంప్యూటర్ లలో ఉన్న సమాచారంతో పాటు సెండ్ చేసిన, రిసీవ్ చేసుకున్న సమాచారంపై నిఘా ఉంటుందని స్పష్టం చేసింది. అవసరమైతే సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు అడ్డుకుంటాయని కూడా హోంశాఖ తెలిపింది. ఐటీ చట్టం 2000 సెక్షన్ 69 కింద ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెప్పింది. ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సీబీఐ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్, క్యాబినెట్ సెక్రటేరియేట్, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్, డైరక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్( జమ్ము అండ్ కశ్మీర్, నార్త్ ఈస్ట్, అసోం) , ఢిల్లీ పోలీస్ తదితర సంస్థలు ఉన్నాయి. విచారణ ఎదుర్కొనే వారు దర్యాప్తు సంస్థలకు అన్ని విధాల సహరించాల్సి ఉంటుంది. సహకరించకపోతే 7 సంవత్సరాల జైలుశిక్షతో పాటు జరిమానాను, ఎదుర్కోవాల్సి ఉంటుంది. మండిపడుతున్న ప్రతిపక్షాలు ప్రభుత్వం చర్యను కాంగ్రెస్, సీసీఎం, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదల్, తృణమూల్ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి, ఇది రాజ్యాంగ విరుద్ధమైన, అప్రజాస్వామికమైన ప్రాథమిక హక్కులపై దాడి అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ ప్రాథమిక హక్కు అయిన గోప్యతా హక్కుకు వ్యతిరేకం అని విమర్శించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల తరుణంలో ఇలాంటి ఎత్తుగడలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. Why is every Indian being treated like a criminal? This order by a govt wanting to snoop on every citizen is unconstitutional and in breach of the telephone tapping guidelines, the Privacy Judgement and the Aadhaar judgement. https://t.co/vJXs6aycP0 — Sitaram Yechury (@SitaramYechury) December 21, 2018 The sweeping powers given to central agencies to snoop phone calls and computers without any checks is extremely dangerous. This step is a direct assault on civil liberties in general and fundamental right to privacy of citizens in particular, guaranteed by Indian constitution. — N Chandrababu Naidu (@ncbn) December 21, 2018 India has been under undeclared emergency since May 2014, now in its last couple of months Modi govt is crossing all limits by seeking control of even the citizens computers. Can such curtailment of fundamental rights be tolerated in world's largest democracy? — Arvind Kejriwal (@ArvindKejriwal) December 21, 2018 మరోవైపు ఆయా ఏజెన్సీలకు డాటా ఎన్క్రిప్షన్ అధికారం గతంనుచీ ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమర్ధించుకున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోని యూపీఏ ప్రభుత్వం రూపొందించిన నియమాల ప్రకారమే ఉందని చెప్పుకొచ్చారు. తాము కొత్తగా జారీ చేసిన ఆదేశాలేవీ లేవని, 2009 నుంచే ఇవి ఉన్నాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు. -
పీసీ, మొబైల్స్ విక్రయాలు తగ్గుతాయ్..
• ఫీచర్ ఫోన్ల అమ్మకాలు 25% డౌన్ • స్మార్ట్ఫోన్ల విక్రయాలు 17.5% తగ్గుదల • మూడో త్రైమాసికంలో నోట్ల రద్దు ప్రభావంపై ఐడీసీ అంచనా • ఎలక్ట్రికల్ వాహన రంగానికీ దెబ్బే న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం పర్సనల్ కంప్యూటర్లు (పీసీ), మొబైల్స్ విక్రయాలు, ఎలక్ట్రికల్ వాహన రంగాలపై పెను ప్రభావమే చూపనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో పీసీ, మొబైల్స్ విక్రయాలు గణనీయంగా తగ్గిపోతాయని మార్కెట్ పరిశోధనా సంస్థ ‘ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్’ (ఐడీసీ) తెలిపింది. మరీ ముఖ్యంగా నగదుపై ఎక్కువగా కొనుగోళ్లు జరిగే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువే ఉంటుందని వివరించింది. దుకాణాల్లోనే కాకుండా ఆన్‌లైన్‌లోనూ పీసీ, మొబైల్స్ విక్రయాల డిమాండ్ బాగానే తగ్గుతుందని ఈ సంస్థ పేర్కొంది. ఆన్లైన్ విభాగంలో క్యాష్ ఆన్ డెలివరీ లావాదేవీలు ఎక్కువగా ఉన్న విషయాన్ని ఈ సంస్థ గుర్తు చేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఫీచర్ ఫోన్ల విక్రయాలు 3.99 కోట్లు, స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లు 3.23 కోట్లుగా ఉండగా... డిసెంబర్ త్రైమాసికంలో ఫీచర్ ఫోన్ల అమ్మకాలు 25 శాతం, స్మార్ట్ఫోన్ల అమ్మకాలు 17.5 శాతం తగ్గుతాయని ఐడీసీ ఇండియా మార్కెట్ అనలిస్ట్ జైపాల్‌సింగ్ తెలిపారు. ట్యాబ్లెట్ల విక్రయాలు క్రితం త్రైమాసికంలో 10 లక్షలు ఉండగా, డిసెంబర్ త్రైమాసికంలో 23 శాతం క్షీణించనున్నట్టు ఈ సంస్థ అంచనా వేసింది. ‘‘రిటైల్, ఎక్స్‌క్లూజివ్ దుకాణాల్లో కంప్యూటర్ల కొనుగోళ్లు సగానికిపైగా నగదు రూపంలో జరుగుతారుు. నోట్ల రద్దు నేపథ్యంలో ఈ మార్కెట్ డిసెంబర్ త్రైమాసికంలో 33 శాతం క్షీణిస్తుందని అంచనా వేస్తున్నట్టు’’ ఐడీసీ ఇండియా రీసెర్చ్ మేనేజర్ మనీష్ యాదవ్ తెలిపారు. పండుగల సీజన్ అనంతరం సాధారణంగానే విక్రయాలు తగ్గుతాయని, నోట్ల రద్దు చర్యతో ఇది మరింత ఎక్కువగా ఉంటుందని ఐడీసీ వివరించింది. వచ్చే త్రైమాసికం మధ్య కాలం నుంచి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనరంగంపై దెబ్బ డీమోనటైజేషన్ ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఈ రంగం ఆందోళన వ్యక్తం చేసింది. రుణ సదుపాయం లేకుండా ఈ వాహనాలను నగదుపైనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నందున నోట్ల రద్దు ప్రభావం గణనీయంగా ఉంటుందని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల సొసైటీ (ఎస్ఎంఈవీ) స్పందిస్తూ... ఈ రంగం ప్రారంభస్థారుు వాహనాలను ఎక్కువగా తయారు చేస్తోందని, వీటిని ప్రజలు నగదుపై కొనుగోలు చేస్తున్నారని, వారికి ఎటువంటి బ్యాంకు రుణ సదుపాయం లేదని పేర్కొంది. ప్రభుత్వ చర్యతో విక్రయాలు బాగా తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. అరుుతే, నోట్ల రద్దు అనేది మంచి చర్య అని, నల్లధనం నియంత్రణ దిశగా ఇదో అడుగు అని ఎస్ఎంఈవీ పేర్కొంది. -
లాభాల్లో దూసుకుపోయిన లెనోవో
ప్రపంచంలో అతిపెద్ద వ్యక్తిగత కంప్యూటర్ (పీసీ) మేకర్, చైనాకు చెందిన లెనోవా గ్రూప్ లిమిటెడ్ ఫలితాల్లో అదరగొట్టింది. గురువారం ప్రకటించిన మొదటి త్రైమాసికంలో భారీ నికర లాభాలను ఆర్జించింది. ప్రధానంగా పీసీ అమ్మకాల్లో మ్మకాలు గోరువెచ్చని మార్కెట్ అంచనాలు ఓడించింది. బీజింగ్-ఆధారిత లెనోవా 64 శాతం నికర లాభాలను నమోదు చేసింది. గత ఏడాది క్రితం ఇదే కాలంలో 105 మిలియన్ డాలర్లతో పోలిస్తే జూన్ తో ముగిసిన త్రైమాసికంలో 173 మిలియన్ డాలర్లకు కు పెరిగింది. అయితే ఆదాయంలో 6 శాతం క్షీణతతో 10.5 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. పీసీ మార్కెట్ కారణంగా ఎనలిస్టులు ఊహించిన దాని కంటే కాస్త మెరుగ్గా ఉన్నామని సంస్థ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యాంగ్ యువాన్ జింగ్ తెలిపారు. చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తమకు పోటీ చాలా ఆసక్తిగా ఉందని కానీ, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా డిమాండ్ తగ్గిందని స్టాక్ మార్కెట్ ఫైలింగ్ లో తెలిపారు. కాగా ట్రెండ్ ఫోర్స్ అంచనాల ప్రకారం, లెనోవా ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 4.5 శాతం వాటాను కలిగి ఉంది. ఏప్రిల్-జూన్ మాసంలో స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో లిమిటెడ్ 24 శాతం, ఆపిల్15 శాతం షేర్ ను సొంతం చేసకున్నాయి. -
10 లక్షల మంది విద్యార్థుల వద్దకు డెల్ ఆరంభ్
♦ పీసీ ఆవశ్యకతపై అవగాహన ♦ డెల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణకుమార్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ డెల్ ఆరంభ్ పేరుతో భారీ కార్యక్రమానికి భారత్‌లో శ్రీకారం చుట్టింది. పర్సనల్ కంప్యూటర్ (పీసీ) వాడకం వల్ల విద్యార్థులకు ఒనగూరే ప్రయోజనాలను తెలియజేయడమే ఈ కార్యక్రమ ఉద్ధేశం. ఇందులో భాగంగా 2016లో దేశవ్యాప్తంగా 75 చిన్న పట్టణాల్లోని 5,000 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 లక్ష మంది ఉపాధ్యాయులు, 2 లక్షల మంది తల్లిదండ్రులకు డెల్ అవగాహన కల్పిస్తుంది. ఆరంభ్ ద్వారా 10 లక్షల మంది విద్యార్థులను చేరుకోవాలన్నది సంస్థ లక్ష్యం. పీసీ ద్వారా మరింత ఉత్తమంగా బోధన ఎలా చేయవచ్చో ఉపాధ్యాయులకు కంపెనీ శిక్షణ ఇస్తుంది. వీరు పిల్లల తల్లిదండ్రులకు పీసీ వాడకం, ఉపయోగాలపై అవగాహన కల్పిస్తారని డెల్ ఇండియా కంజ్యూమర్, స్మాల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ పి.కృష్ణకుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు. రెండేళ్లలో 14 శాతానికి.. పీసీ విస్తరణ భారత్‌లో ప్రస్తుతం 9-10 శాతానికే పరిమితమైంది. అదే బ్రెజిల్లో 60 శాతం, చైనాలో 40 శాతం, పొరుగున ఉన్న చిన్న దేశమైన శ్రీలంకలో 12 శాతం గృహాల్లో పీసీలు ఉన్నాయి. భారత్‌లో అధిక జనాభా ఉన్నప్పటికీ పీసీల వాడకం చాలా తక్కువగా ఉందని కృష్ణకుమార్ వ్యాఖ్యానించారు. నెట్వర్క్/బ్రాడ్‌బ్యాండ్ పరిమితంగా ఉంది. ఇది పూర్తి స్థాయిలో విస్తరిస్తే పీసీ వినియోగం అధికమవుతుంది. ఇంటర్నెట్ను తొలిసారిగా మొబైల్లోనే ఆస్వాదిస్తున్నారు. అయితే కంటెంట్ సృష్టించాలంటే మాత్రం పీసీ ఉండాల్సిందే. జనాభాలో 43 శాతం విద్యార్థులున్నారు. పీసీ ప్రయోజనాలను వీరికి వివరిస్తాం. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ప్రత్యేక వాయిదా స్కీమ్ ద్వారా పీసీలను విక్రయిస్తామని ఆయన చెప్పారు. -
అసలు ఈ పీసీలకు ఏమైంది...?
ప్రపంచ చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ ప్రతి పదిమంది ఉద్యోగుల్లో ఒకరిని తొలగిస్తామని ఎందుకు ప్రకటించింది. 2017 మధ్య వరకు ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలలో పనిచేసే 12 వేల మంది ఉద్యోగులను ఎందుకు ఇంటికి పంపేస్తోంది? వీటన్నింటికీ సంస్థ చెప్పే సమాధానం ఒక్కటే.. పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) పరిశ్రమ పడిపోవడమని. అసలు మార్కెట్లో పీసీ అమ్మకాలకు ఏమైంది. ఈ అమ్మకాలు అంతలా పడిపోవడానికి కారణమేమిటి.. ఎప్పటి నుంచి అమ్మకాల క్షీణత ప్రారంభమైంది.. ఓసారి చూద్దాం. పీసీల ఎదుగుదల, తగ్గుదల 2011 వరకూ పీసీ పరిశ్రమకు ఫుల్ క్రేజ్ ఉండేది. ఎవరిని చూసినా ల్యాప్ టాప్ కొనాలని అనుకునేవాళ్లు. సాప్ట్ వేర్ ప్రొఫెషనల్స్, సాధారణ ఉద్యోగుల నుంచి అటు చదువుకునే పిల్లల వరకు అంతా ల్యాప్‌టాప్‌ల వైపే ఎక్కువగా మొగ్గు చూపేవారు. కాస్త ధర ఎక్కువైనా ఫర్వాలేదు గానీ, వాడుకోడానికి సులభంగా ఉంటుందని, ఎక్కడికైనా తీసుకెళ్లచ్చని అనుకునేవారు. అయితే 2016 సంవత్సరం మొదటి త్రైమాసికంలో నమోదైన ఫలితాల్లో పీసీల అమ్మకాలు ఒక్కసారిగా 10 శాతం పడిపోయాయి. కేవలం 6 కోట్ల పీసీలే అమ్ముడుపోయినట్టు గణాంకాలు చూపించాయి. ఇక అప్పటినుంచి మొదలైన అమ్మకాల క్షీణత, 2014లో కొంచెం ఫర్వాలేదు అనిపించినా, తర్వాత మళ్లీ పడిపోయింది. ప్రస్తుతం పీసీల పరిశ్రమల నేలచూపులే చూస్తోంది. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొత్త వినియోగదారులను చేరుకోలేకపోవడం, వినియోగదారులు కూడా చాలావరకు ట్యాబ్లెట్ పీసీలు, స్మార్ట్ ఫోన్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం పీసీల డిమాండ్ పడిపోవడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. స్మార్ట్ బూమ్ టెక్నాలజీ క్రమేపీ అభివృద్ధి చెంది స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి ప్రవేశించడంతో పీసీల డిమాండ్ దారుణంగా పడిపోయింది. 2016 నుంచి స్మార్ట్ ఫోన్ల బూమ్ మరీ ఎక్కువ కావడంతో పీసీల ఇండస్ట్రీ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. మొదట్లో స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ తక్కువగానే ఉన్నా.. తర్వాత ధర తగ్గడం, ఎక్కువ మోడళ్లు అందుబాటులోకి రావడంతో క్రమంగా ప్రపంచమే స్మార్ట్ ఫోన్ లోకంగా మారింది. గతేడాది స్మార్ట్ ఫోన్ల రవాణా 150 కోట్లకు ఎగబాకింది. మరోవైపు పీసీలకు ప్రత్యామ్నాయంగా వస్తున్న టాబ్లెట్లు సైతం పీసీల అమ్మకాలకు గండి కొడుతున్నాయి. పీసీ కొనుకోవాలనుకునేవారిలో చాలామంది టాబ్లెట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. పీసీలు ఆఫర్ చేసే ప్రతి ఫీచర్లను టాబ్లెట్లు అందుబాటులోకి తేవడమే వీటి డిమాండ్‌కు ప్రధాన కారణం అవుతోంది. 2010లో టాబ్లెట్ల రవాణా 5శాతం ఉంటే, 2014లో అది కాస్తా 40 శాతానికి పెరిగింది. -
చేతిలో పీసీ.. ఈ ఐడియాస్టిక్
ఇంట్లో అవసరాల కోసం ఓ కంప్యూటర్.. ఆఫీసులో మరోటి.. చేతిలో ఇంకోటి. ఈ రోజుల్లో ఇదంతా మామూలే అంటారా? నిజమేకానీ... ఇదంతా లెనవూ ఐడియాస్టిక్ అందుబాటులోకి రానంత వరకే. ఎందుకంటే.. పూర్తిస్థాయి పీసీ మొత్తాన్ని ఇది అరచేతిలో ఇమిడిపోయే సైజుకు తగ్గించేసింది మరి. హెచ్డీఎంఐ సామర్థ్యమున్న ఏ టెలివిజన్ స్క్రీన్కు దీన్ని తగిలించినా.. అది కాస్తా కంప్యూటర్‌గా మారిపోతుంది. ఇలాటివి చాలానే వచ్చాయిగానీ.. దీని ప్రత్యేకత ఏమిటంటారా? ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్‌తో పనిచేయడం ఒకటైతే... రెండు గిగాబైట్ల ర్యామ్, 32 గిగాబైట్ల ఇంటర్నల్ మెమరీ రెండోది. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయగలగడం మరోటి. కేవలం 15 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉండే ఈ బుల్లి పీసీ ఖరీదు దాదాపు ఎనిమిది వేలు మాత్రమే! -
పీసీతో ఇలా... చకచకా!
ఇంట్లో ఓ పీసీ, దానికో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మనం చేయలేని పనంటూ లేదంటే అతిశయోక్తి కాదు. ఈమెయిళ్లు, చాటింగ్‌లు, ఆఫీసు పనులను పక్కనబెడితే... ఏ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకోకుండా కూడా ఎన్నో సరదా, సీరియస్ పనులను చక్కబెట్టుకోవచ్చు. కేవలం గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, మొజిల్లా ఫైర్ఫాక్స్ వంటి బ్రౌజర్లతో మాత్రమే ఎలాంటి విషయాలు తెలుసుకోవచ్చు... ఏయే పనులు చేయవచ్చో మచ్చుకు చూద్దామా.... జీమెయిల్ కోసం రెండు ఆప్స్... జీమెయిల్లో మెసేజ్ టైప్ చేసి... మెయిల్ ఫలానా టైమ్‌కు, ఫలానా వారికి పంపితే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే బూమరాంగ్ మీకోసమే. www.boomeranggmail.com/వెబ్సైట్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు. మీ మెయిళ్లను మీరు అనుకున్న సమయానికి పంపేందుకు వీలు ఏర్పడుతుంది. అయితే ఇది పూర్తిగా ఫ్రీ సర్వీస్ కాకపోవడం గుర్తుంచుకోవాలి. బేసిక్ అకౌంట్ ద్వారా నెలకు 10 మెయిళ్లను ఉచితంగా షెడ్యూల్ చేసి పంపవచ్చు. అంతకంటే ఎక్కువ మెయిళ్లను పంపాల్సిన పరిస్థితి ఉంటే మాత్రం సర్వీసులకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీకు ఒకటికంటే ఎక్కువ జీమెయిల్ అకౌంట్స్ ఉంటే... వాటిని ఒకేచోట చూసుకునేందుకు వీలు కల్పిస్తుంది చెకర్ ప్లస్ ఫర్ జీమెయిల్. క్రోమ్ వెబ్‌స్టోర్ ద్వారా లభించే ఈ ఎక్స్టెన్షన్లో ఒక డ్రాప్‌డౌన్ మెనూ ఉంటుంది. దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకున్న జీమెయిల్ అకౌంట్లలో చదవని మెయిళ్లు, వాటి ప్రివ్యూలు కనిపిస్తూంటాయి. ఫొటోలకు రంగులు అద్దండి... స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత ఫోటోలు తీయడం బాగా పెరిగిపోయింది. అయితే ఈ ఫొటోలకు సరదాగా రంగులద్దాలనుకుంటే? లేదా స్పెషల్ ఎఫెక్ట్స్ జోడించాలను కుంటే సైకోపెయింట్ అవకాశం కల్పిస్తుంది. రకరకాల పెయింట్ శైలుల నుంచి ఆన్లైన్లోనే మీ ఫోటోలకు రంగులు అద్దవచ్చు. లేదంటే సిద్ధంగా ఉన్న కొన్ని టూల్స్‌ను వాడుకోవచ్చు కూడా. మీకు పెయింటింగ్‌తో పరిచయముంటే కొత్తకొత్త డిజిటల్ కళాఖండాలను తయారు చేసేందుకు ఈ వెబ్సైట్లో బోలెడు రకాల బ్రష్‌లు, పెయింట్ ఎఫెక్ట్లు ఇచ్చే ఫిల్టర్లు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం psykopaint.comవెబ్సైట్ చూడండి. ఐఫోన్ అప్లికేషన్గానూ సైకోపెయింట్ లభిస్తోంది. ఫోటోల ఎడిటింగ్... ఫోటోలకు పెయింట్ లక్షణాలను చేర్చేందుకు సైకోపెయింట్ ఉపయోగపడితే... సైజును సరిచేయడం, రంగులు నియంత్రించడం, వెలుతురును అడ్జస్ట్ చేయడం వంటి పనులకు పిక్స్‌లర్ దారి చూపుతుంది. పూర్తిస్థాయి ఫొటో ఎడిటింగ్ కోసం పిక్స్‌లర్ ఎడిటర్, ఎఫెక్ట్‌లను చేర్చేందుకు పిక్స్‌లర్ ఓ మాటిక్, వేగంగా కొన్ని అంశాలను మాత్రమే సరిచేయాలనుకుంటే పిక్స్‌లర్ ఎక్స్‌ప్రెస్.. ఇలా మూడు లేయర్లలో ఈ వెబ్సైట్ సేవలు పనిచేస్తాయి. ఒక్కో లేయర్లో ఫొటోల నాణ్యతను పెంచేందుకు కొన్ని టూల్స్ ఏర్పాటు చేశారు. ఎడిటింగ్ మొత్తం పూర్తయ్యాక మీ ఫోటోలను మళ్లీ కంప్యూటర్‌పై సేవ్ చేసుకోవచ్చు. వెబ్సైట్: Pixlr.com ఈసెల్.ఎల్వై... వెయ్యి మాటల్లో చెప్పలేని విషయాన్ని ఒక ఫొటో ద్వారా చెప్పవచ్చు. అలాంటి ఫోటోలకు అంకెలు, గ్రాఫ్‌లు కూడా కలిశాయనుకోండి... విషయాన్ని సూటిగా, వివరించవచ్చు. అచ్చంగా ఈ పనులన్నింటికీ ఉపయోగపడే వెబ్సైట్ ఈసెల్.ఎల్వై. దాదాపు 300కుపైగా ఉన్న లేఔట్లను ఉచితంగా వాడుకునే అవకాశముంది. ఆ లేఔట్లపై రకరకాల ఫొటోలు, చిత్రాలను చేర్చుకునే సౌలభ్యం ఉంది దీంట్లో. పూర్తయిన తరువాత ఇన్ఫోగ్రాఫిక్ను జెపీఈజీ, పీడీఎఫ్ ఫార్మాట్లలో సేవ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ : www.easel.ly డెస్క్టాప్పై నోటీస్‌బోర్డు... ఏరోజుకు ఆరోజు మీరు చేయాల్సిన పనులను గుర్తు పెట్టుకునేందుకు ప్యాడ్లెట్ బాగా ఉపయోగపడుతుంది. www.padlet.comవెబ్సైట్లో ఒకసారి ఫ్రీఅకౌంట్ను క్రియేట్ చేసుకుంటే చాలు. డెస్క్టాప్పై ఒక బ్లాంక్ నోటీస్‌బోర్డు ప్రత్యక్షమవుతుంది. మౌస్తో డబుల్‌ట్యాప్ చేయడం ద్వారా మీరు అందులో నోట్లు ఉంచుకోవచ్చు. టెక్ట్స్‌తోపాటు వెబ్‌లింక్‌లు, ఫైళ్లు, వెబ్‌క్యామ్‌తో తీసిన ఫొటోలను కూడా ఉంచుకోవచ్చు. ఇతరులతో షేర్ చేసుకునేందుకు అవకాశముంది. బ్లాంక్‌గా ఉండటం బోరు కొట్టిస్తూంటే అందమైన వాల్పేపర్లతో అలంకరించుకోవచ్చు. రకరకాల లేఔట్లతో తీర్చిదిద్దుకోవచ్చు కూడా. -
విప్రో బాటలోనే HCL టెక్నాలజీస్