చూడటానికి స్పోర్ట్స్ షూలా కనిపిస్తుంది గాని, నిజానికి ఇది పర్సనల్ కంప్యూటర్. మామూలు కంప్యూటర్ సీపీయూలో ఉండే మదర్‌బోర్డ్, ప్రాసెసర్, హార్డ్‌డిస్క్, ర్యామ్ వంటి భాగాలన్నీ ఇందులోనూ ఉంటాయి.
దీనిని మానిటర్‌కు అనుసంధానించుకుని, చక్కగా పనిచేసుకోవచ్చు. ఇందులో 2టీబీ హార్డ్‌డిస్క్, 32జీబీ ర్యామ్, ఎన్విడియా ఆర్టీఎక్స్ 4070 జీపీయూ, ఇంటెల్‌కోర్ ఐ7 ప్రాసెసర్‌తో పనిచేసే 13700 సీపీయూ, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటాయి.
అమెరికన్ కంపెనీ కూల్‌మాస్టర్ తన ముప్పయ్యో వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల స్పోర్ట్స్ షూ ఆకారంలో ఉండే ఈ పీసీని ‘సీఎంఓడీఎస్’ బ్రాండ్ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర 6000 డాలర్లు (రూ.4.99 లక్షలు).
Comments
Please login to add a commentAdd a comment