కంప్యూటర్లు వినియోగంలోకి వచ్చాక, ప్రింటర్ల వినియోగం కూడా పెరిగింది. ఆఫీసుల్లో వాడే ప్రింటర్ల వల్ల ఎంతో కొంత కాగితం వృథా అవుతుండటం మామూలే. ప్రింటర్ల వల్ల కాగితం వృథాను అరికట్టే ఉద్దేశంతో దక్షిణ కొరియాకు చెందిన డిజైనర్ జిసాన్ చుంగ్ ప్రయోగాత్మకంగా ‘రోలర్‌జెట్ ప్రింటర్’కు రూపకల్పన చేశాడు.
పేపర్‌షీట్స్ బదులు పేపర్‌రోల్స్ వాడటానికి అనువుగా దీన్ని తీర్చిదిద్దాడు. ప్రింటింగ్ పూర్తయ్యాక, ప్రింట్ అయినంత మేరకు దీని నుంచి కాగితాన్ని కత్తిరించి తీసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం నమూనాగా రూపొందించిన ఈ ప్రింటర్ పనితీరు బాగున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పెద్దస్థాయిలో దీని తయారీ చేపడితే, ఇది మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment