
విజయవాడ: నేడు డేటా వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. దీంతో అధిక సామర్థ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల (పీసీలు) అవసరం ఏర్పడింది. ఇప్పటికే ఉన్న పీసీల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఎక్కువ మంది చూస్తున్నారు. ఇటువంటి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘వెస్టర్న్ డిజిటల్’ సంస్థ.. డబ్ల్యూడీ బ్లూ ఎస్‌ఎన్ 570 పేరుతో ఎస్‌ఎస్‌డీని తీసుకొచ్చింది.
ఇది ఎంతో స్లిమ్‌గా చేతిలోనే పట్టే సైజుతో ఉంటుంది. 250జీబీ, 500జీబీ, 1టీబీ, 2టీబీ కెపాసీటీతో వీటిని విడుదల చేసింది. వీటి ధరలు రూ.2,750 నుంచి మొదలై రూ.20,999 వరకు ఉంటాయని కంపెనీ తెలిపింది. ఐదేళ్ల వారంటీని ఆఫర్ చే స్తోంది. ఈ సంస్థ శాన్‌డిస్క్, డబ్ల్యూడీ పేరుతో ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment