కోచి: ఆండ్రాయిడ్, విండోస్ మొబైల్ ఫోన్ యూజర్ల కోసం ప్రభుత్వరంగ మొబైల్ కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త యాప్.. ‘మై బీఎస్‌ఎన్‌ఎల్’ను సోమవారం ప్రారంభించింది. ఈ యాప్‌తో వినియోగదారులు పోస్ట్ పెయిడ్ బిల్స్‌ను, ప్రి-పెయిడ్ టాపప్‌లను ఏ సమయంలోనైనా, ఎక్కడ నుంచైనా చెల్లించవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. గూగుల్ ప్లేస్టోర్/విండోస్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించింది. ఈ యాప్‌తో యూజర్లు తమ ప్రస్తుత బిల్లు ఎంతో తెలుసుకోవచ్చని, బిల్లులు చెల్లించవచ్చని, చెల్లింపులకు రశీదులు పొందవచ్చని, ఎప్పుడెప్పుడు ఎంతెంత చెల్లించారో తెలుసుకోవచ్చని, ప్రి పెయిడ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చని, నెట్‌బ్యాకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డ్ వంటి వివిధ రకాల చెల్లింపుల ఆప్షన్స్‌ను కూడా పొందవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ వివరించింది.