హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అల్యూమినియం డోర్స్, విండోస్ తయారీ కంపెనీ ఎన్‌కోర్–ఆల్కమ్ రూ.60 కోట్లతో గుజరాత్‌లోని సూరత్ వద్ద అత్యాధునిక ప్లాంటు నెలకొల్పుతోంది. అల్యూమినియం డోర్స్, విండోస్ విభాగంలో భారత్‌లో తొలి ఆటో రోబోటిక్ ఫెసిలిటీ ఇదేనని సంస్థ ఫౌండర్, సీఎండీ అవుతు శివకోటిరెడ్డి బుధవారం తెలిపారు.
‘1,80,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దేశంలో అతిపెద్ద కేంద్రం ఇదే. జర్మనీ సాంకేతికతతో రోజుకు 30,000 చదరపు అడుగుల తయారీ సామర్థ్యంతో మార్చికల్లా రెడీ అవుతుంది. ఇప్పటికే సూరత్‌లో అల్యూమినియం డోర్స్, విండోస్ ప్లాంటు ఉంది. కస్టమర్ కోరుకున్నట్టు ఆర్కిటెక్చరల్ ఉత్పాదనలు మా ప్రత్యేకత. 60 కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి.
హైదరాబాద్ సమీపంలోని మోకిల వద్ద ఫ్యాబ్రికేషన్ యూనిట్, ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ మార్చికల్లా ప్రారంభం అవుతాయి. ఎన్‌కోర్ ఇప్పటికే వుడ్ డోర్స్ తయారీలో ఉంది. దక్షిణాదిన ఎన్‌కోర్, ఉత్తరాదిన ఆల్కమ్ బ్రాండ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాం’ అని వివరించారు. హైటెక్స్‌లో జనవరి 19 నుంచి జరిగే ఏస్‌టెక్ ట్రేడ్ ఫెయిర్‌లో విభిన్న ఉత్పత్తులను ప్రదర్శిస్తామని ఆల్కమ్ డైరెక్టర్ జయంతి భాయ్ మనుభాయ్ తెలిపారు.
ఎన్‌కోర్–ఆల్కమ్ ఫౌండర్ అవుతు శివకోటిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment