Indian government
-
రూ 75 నాణెం విడుదల చేయనున్న కేంద్రం
-
గూగుల్ క్రోమ్ యూజర్లకు హైరిస్క్ వార్నింగ్! తేలిగ్గా తీసుకుంటే అంతే..
గూగుల్ క్రోమ్ యూజర్లకు భారత ప్రభుత్వం హైరిస్క్ వార్నింగ్ ఇచ్చింది. తేలిగ్గా తీసుకుంటే మీ బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చిరించింది. ఈ బ్రౌజర్లో వ్యక్తిగత సమాచారాన్ని హ్యాజర్లు సులువుగా హ్యాక్ చేస్తున్నారని తెలియజేసింది. మనలో చాలా మంది వాడే వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్. ఇంటర్నెట్ను ఉపయోగించేటప్పుడు మనకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇస్తుంటాం. ఒకవేళ మనం వాడే బ్రౌజర్ సురక్షితం కాకుంటే మన సమాచారమంతా హ్యాకర్ల చేతికి వెళ్తుంది. ఇలాంటి వాటిని అరికట్టేందుకు గూగుల్ క్రోమ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వర్షన్లను అప్డేట్ చేస్తుంటుంది. ఒకవేళ మీరు పాత వర్షన్ బ్రౌజర్లను వాడుతుంటే ప్రమాదంలో పడినట్లే. విండోస్ యూజర్లు 110.0.5481.77/.78 వర్షన్, మ్యాక్, లైనెక్స్ యూజర్లు 110.0.5481.77 వర్షన్ కంటే పాతవి ఉపయోగిస్తున్నవారికి భారత ప్రభుత్వం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో యూజర్ల సమాచారాన్ని హ్యాకర్లు ఎలా దొంగిలిస్తున్నారో ఇండియన్ కంప్యూటర్ ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఓ నివేదిక విడుదల చేసింది. వీళ్ల బారిన పడకూడదంటే గూగుల్ తెస్తున్న కొత్త వర్షన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. (ఇదీ చదవండి: బోయింగ్‌కు హైదరాబాద్ నుంచి తొలి ‘ఫిన్’ డెలివరీ) -
భారత్ సూచనతో చిరుధాన్యాల సంవత్సరం ప్రారంభం
రోమ్: అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం–2023 మంగళవారం అధికారికంగా ప్రారంభమైంది. ఇటలీలోని రోమ్‌లో ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎఫ్ఏవో ప్రధాన కార్యదర్శి క్యూ డోంగ్యు, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభతో పాటు ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వలిన్ హ్యుగ్స్ పాల్గొని ప్రత్యేక చిహ్నాన్ని ఆవిష్కరించారు. భారత్ ప్రతిపాదన మేరకు ఐరాస సర్వసభ్య సమావేశం 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన విషయం తెలిసిందే. వాతావరణ మార్పుల్ని దీటుగా ఎదుర్కొని పౌష్టికాహార, ఆరోగ్య భద్రతను కలిగించే శక్తి చిరుధాన్యాలకు ఉందని.. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంలో వినియోగదారులు, రైతులు, పాలకులను చైతన్యపరిచి కార్యోన్ముఖుల్ని చేయటమే తమ లక్ష్యమని ఎఫ్ఏవో ప్రధాన కార్యదర్శి క్యూ డోంగ్యు ఈ సందర్భంగా అన్నారు. చిరుధాన్యాలు తరతరాలుగా భారతీయ సమాజానికి ఆహార భద్రతను కల్పిస్తున్నాయని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. మోదీ సందేశాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ చదివి వినిపించారు. ఇదీ చదవండి: పని ప్రదేశాల్లో వేధింపులు ఎక్కువే: ఐక్యరాజ్యసమితి -
చైనా సరిహద్దులకు మరిన్ని బలగాలు
న్యూఢిల్లీ: చైనాతో ఉన్న సరిహద్దుల వెంబడి అదనంగా మరో 35 వేల మందిని నియమించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. తూర్పు లద్దాఖ్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో చైనా తరచూ సరిహద్దు వివాదాలు సృష్టిస్తూండటం, ఇటీవల గల్వాన్ లోయలో పొరుగుదేశపు సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు వీరమరణం పొందడం ఈ నిర్ణయానికి కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. గల్వాన్ ఘటన తరువాత ఇరుదేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఇప్పట్లో ఫలితమిచ్చే అవకాశం లేకపోవడం ఇంకో కారణం. భారత్ చైనా సరిహద్దులు 3,488 కిలోమీటర్ల పొడవు ఉండగా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దులను కాపాడుకునేందుకు భారత్ ఇప్పటికే భారీగా ఖర్చు పెడుతోంది. ‘‘వాస్తవాధీన రేఖ వెంబడి మరీ ముఖ్యంగా లద్దాఖ్ ప్రాంతంలో పూర్తిగా మారిపోయింది. రెండువైపులా అదనపు బలగాలను మోహరిస్తున్నారు. అత్యున్నత స్థాయి రాజకీయ నిర్ణయం జరిగితే మినహా ఏ పక్షమూ తన బలగాలను వెనక్కు తీసుకోదు’’అని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ‘ద యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్’డైరెక్టర్ విశ్రాంత మేజర్ జనరల్ బి.కె.శర్మ తెలిపారు. సరిహద్దు సమస్యపై కమాండర్ల స్థాయిలో ఇంకోసారి చర్చలు జరగనున్నాయని, సమస్య పరిష్కారానికి భారత్ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ వ్యాఖ్యానించారు. సైన్యం ఉపసంహరణ పూర్తి కాలేదు తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా దళాల ఉపసంహరణ ఇంకా పూర్తి కాలేదని భారత్ గురువారం స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. దళాల ఉపసంహరణ అన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి దాదాపు పూర్తయిందని చైనా రెండు రోజుల క్రితం ప్రకటించిన నేపథ్యంలో భారత్ ఈ స్పష్టత ఇచ్చింది. ‘బలగాల ఉపసంహరణకు సంబంధించి కొంత పురోగతి ఉంది. కానీ, పూర్తిగా ఉపసంహరణ జరగలేదు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంట ఘర్షణ కేంద్రాల్లో పూర్తి స్థాయి బలగాల ఉపసంహరణ, సరిహద్దుల్లో శాంతి.. విషయాల్లో చైనా నిజాయతీగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. రెండు దేశాల మధ్య మరో విడత మిలటరీ కమాండర్ స్థాయి చర్చలు మరో రెండు రోజుల్లో జరగనున్నాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. స్మారకంపై గల్వాన్ అమరులు తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా సైన్యంతో పోరాడి, వీరమరణం పొందిన 20 మంది అమరజవాన్ల పేర్లను ఢిల్లీలోని నేషనల్ వార్‌మెమొరియల్‌పై లిఖించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పేర్లు చేర్చడానికి కొద్ది నెలల సమయం పట్టనున్నట్టు తెలిపారు. ఐదు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా జూన్ 15వ తేదీన గల్వాన్ లోయలో చైనా సైనికులతో భీకర పోరాటం జరిగింది. ఈ పోరాటంలో 16 బిహార్ రెజిమెంట్‌కి చెందిన కల్నల్ బి.సంతోష్ బాబుతో పాటు, 20 మంది సైనికులు అసువులు బాశారు. చైనా వైపు ఈ ఘర్షణలో ఎంత మంది చనిపోయారనేది ప్రకటించలేదు. అమెరికా నిఘా వర్గాల ప్రకారం 35 మంది చైనా సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది. -
పట్టుకోండి.. ఎక్కడికీ పారిపోనీకండి!
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు కోట్లాది రూపాయల రుణం ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మోహుల్ ఛోక్సీని అష్టదిగ్బంధనం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. తాను పారిపోలేదని ఆటింగ్వా పౌరసత్వం తీసుకున్నానంటూ ప్రకటించిన చోక్సీకి షాకిచ్చేలా భారత ప్రభుత్వం కదులుతోంది. చోక్సీని నిర్బంధించాల్సిందిగా ఆంటిగ్వా, బర్బుడా ప్రభుత్వాలను కేంద్రం కోరింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. త్వరలోనే భారత రాయబారి ఆటింగ్వాలోని బర్బుడా ప్రభుత్వ ధికారులను కలవనున్నారు. ఆంటిగ్వాలో మెహుల్ చోక్సీ వ్యవహారంపై అక్కడి ప్రభుత్వం స్పందించిన వెంటనే జార్జిటౌన్‌లోని భారత హై కమిషన్ అధికారులు ఆంటిగ్వా , బార్బుడా ప్రభుత్వాలకు లేఖలు రాశారు. చోక్సీ కదలికల గురించి నిఘా పెట్టి.. ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, అతన్నివెంటనే అదుపులోకి తీసుకోవాలని కోరారు. భూ, వాయు లేదా సముద్ర మార్గాల్లో పారిపోకుండా అడ్డుకోవాలని కోరినట్టు ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ స్కాం రూ.13వేల కోట్ల పీఎన్బీ కుంభకోణం కేసులో కీలక నిందితులు, డైమండ్ వ్యాపారులు నీరవ్ మోదీ, చోక్సీని భారత్ రప్పించే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే భారత ప్రభుత్వం వీరి పాస్‌పోర్టులను రద్దు చేసింది. అలాగే పలు ఆస్తులను ఎటాచ్ చేసిన దర్యాప్తు బృందాలు ఈడీ, సీబీఐ దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నాయి. కాగా ద్రోహులకు తమ దేశంలో స్థానం లేదనీ, భారత ప్రభుత్వం కోరితే చోక్సీ అరెస్ట్‌కు తగిన చర్యలు తీసుకుంటామని, భారత ప్రభుత్వానికి సహకరిస్తామంటూ ఆంటిగ్వా విదేశాంగ మంత్రి స్పందించడంతో భారత ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. అయితే తన వ్యాపారాన్ని విస్తృతం చేసుకునేందుకు గతేడాది ఆంటిగ్వా పౌరసత్వం తీసుకున్నట్లు పీఎన్బీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గీతాంజలి సంస్థల అధిపతి మెహుల్ చోక్సీ గతవారం ప్రకటించాడు. తద్వారా 130 దేశాలకు ఎటువంటి వీసా లేకపోయినా ప్రయాణించే అనుమతి ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
భారత్‌కు మళ్లీ అమెరికా సుద్దులు!
వాషింగ్టన్: భారత్‌లో అసహనం, హింస పెరిగిపోతున్నాయంటూ వస్తున్న కథనాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులను కాపాడేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని, దాడులకు పాల్పడుతున్న వారిని చట్టప్రకారం శిక్షించాలని సూచించింది. గొడ్డుమాంసాన్ని తింటున్నవారిపై దాడులు జరగడం, బీఫ్ తరలిస్తున్నారని మధ్యప్రదేశ్‌లో ఇద్దరు ముస్లిం మహిళలను కొట్టడం వంటి ఘటనలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ స్పందించారు. మతస్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలోనూ, అసహనాన్ని ఎదుర్కోవడంలోనూ మేం భారత ప్రజలకు, ప్రభుత్వానికి అండగా ఉంటాం. అసహనం, హింస పెరిగిపోతున్నాయని వస్తున్న వార్తలపై మేం ఆందోళన చెందుతున్నాం. ప్రస్తుతం ఈ సమస్యను ప్రపంచమంతా ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో పౌరులను అండగా ఉంటూ.. దాడులకు కారణమైన వారిని చట్టప్రకారం శిక్షించాలని మేం ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.