భారత్‌కు మళ్లీ అమెరికా సుద్దులు!
వాషింగ్టన్: భారత్‌లో అసహనం, హింస పెరిగిపోతున్నాయంటూ వస్తున్న కథనాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులను కాపాడేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని, దాడులకు పాల్పడుతున్న వారిని చట్టప్రకారం శిక్షించాలని సూచించింది.
గొడ్డుమాంసాన్ని తింటున్నవారిపై దాడులు జరగడం, బీఫ్ తరలిస్తున్నారని మధ్యప్రదేశ్‌లో ఇద్దరు ముస్లిం మహిళలను కొట్టడం వంటి ఘటనలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ స్పందించారు. మతస్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలోనూ, అసహనాన్ని ఎదుర్కోవడంలోనూ మేం భారత ప్రజలకు, ప్రభుత్వానికి అండగా ఉంటాం. అసహనం, హింస పెరిగిపోతున్నాయని వస్తున్న వార్తలపై మేం ఆందోళన చెందుతున్నాం. ప్రస్తుతం ఈ సమస్యను ప్రపంచమంతా ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో పౌరులను అండగా ఉంటూ.. దాడులకు కారణమైన వారిని చట్టప్రకారం శిక్షించాలని మేం ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.