Google Chrome Users High Risk Warning గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యూజర్లూ బీ అలర్ట్. గూగుల్ క్రోమ్ వర్షన్ అప్ డేట్ చేసుకోకపోతే మీ కీలక సమాచారం చోరీ అయ్యే ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం తాజాగా హెచ్చరించింది. అప్‌డేట్ చేసుకోకపోతే సెక్యూరిటీ పరమైన సమస్యలు తప్పవంటూ యూజర్లకు హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. భారతదేశంలో కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) తాజాగా గుర్తించిన లోపాలను హై-రిస్క్‌గా వర్గీకరించింది.
ముఖ్యంగా WebPలో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో ఎర్రర్, కస్టమ్ ట్యాబ్‌లు, ప్రాంప్ట్‌లు, ఇన్‌పుట్, ఇంటెంట్‌లు, పిక్చర్ ఇన్ పిక్చర్, ఇంటర్‌స్టీషియల్స్ లోపాలను గుర్తించినట్టు తెలిపింది. అలాగే డౌన్‌లోడ్‌లు, ఆటోఫిల్‌లో వాటిల్లో పాలసీ సరిగ్గా అమలు కాలేదని తెలిపింది. గూగుల్ క్రోమ్ ఈ లోపాలను బాధితుడి సిస్టమ్‌కు అనధికారిక యాక్సెస్‌ని అందించేలా సైబర్ నేరగాళ్లకు అవకాశం ఉంటుందని CERT-In వెల్లడించింది. ఈ నేపథ్యంలో గూగుల్ క్రోమ్ వినియోగదారులు తమ సిస్టమ్ ప్రొటెక్షన్ కోసం అప్‌డేట్ చేసుకోవడంఉత్తతమని సూచించింది.
Google Chromeఅప్‌డేట్ చేసుకోవడం ఎలా?
Chrome విండోను ఓపెన్ చేసి కుడి ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కల చిహ్నంపై క్లిక్ చేయాలి.
డ్రాప్‌డౌన్ మెను నుండి, హెల్ప్ ఆప్షన్ ఎంచుకోవాలి.
" About Google Chrome"పై క్లిక్ చేయండి.
అప్‌డేట్‌పై క్లిక్ చేసి, బ్రౌజర్‌ని రీస్టార్ట్ చేస్తే చాలు.
Comments
Please login to add a commentAdd a comment