Google Chrome Browsers
-
గూగుల్ క్రోమ్‌ను అమ్మాల్సిందే..!
వాషింగ్టన్: ఆన్లైన్ సెర్చ్‌లో గూగుల్ చట్టవిరుద్ధమైన గుత్తాధిపత్యాన్ని నిరోధించడానికి ఆ సంస్థ తన క్రోమ్ బ్రౌజర్‌ను విక్రయించాల్సిందేనంటూ అమెరికా న్యాయశాఖ స్పష్టం చేస్తోంది. ఈ మేరకు న్యాయశాఖ తన స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేసినట్లు అమెరికా డిస్ట్రిక్ట్ కోర్ట్ (ది డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా)లో దాఖలు చేసిన 28 పేజీల ఫైల్ స్పష్టం చేస్తోంది. గూగుల్ ‘‘గుత్తాధిపత్యం’’ చేస్తోందన్న ఇటీవలి కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ, టెక్ దిగ్గజాన్ని దాని ఆధిపత్య మార్కెట్ స్థానం నుండి తొలగించే చర్యలను అమెరికా న్యాయశాఖ సూచించింది. న్యాయశాఖ ప్రతిపాదనతో అమెరికా డిస్ట్రిక్ట్ కోర్ట్ (ది డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా) న్యాయమూర్తి మెహతా అంగీకరిస్తే, క్రోమ్‌ను గూగుల్ విక్రయించాల్సి రావచ్చన్నది నిపుణుల విశ్లేషణ. గూగుల్ చట్టవిరుద్ధ గుత్తాధిపత్య ధోరణులను అరికట్టడానికి ఉన్న మార్గాల్లో క్రోమ్ వెబ్ బ్రౌజర్‌ను విక్రయించడం ఒకటని అమెరికా న్యాయశాఖతో పాటు పలు రాష్ట్రాలూ ప్రతిపాదనలు పెట్టడం గమనార్హం. ‘‘గూగుల్ ఒక గుత్తాధిపత్య సంస్థ. దాని గుత్తాధిపత్యం కొనసాగడానికి ఈ గుత్తాధిపత్యమూ పనిచేసింది’’ అని ఈ ఏడాది ఆగస్టులో అమెరికా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ కొలంబియా న్యాయమూర్తి అమిత్ మెహతా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. జరిగేదేమిటి? జడ్జి మెహతా ప్రభుత్వ సిఫార్సులను ఆమోదిస్తే, తుది తీర్పు వెలువడిన ఆరు నెలల్లోపు గూగుల్ తన 16 ఏళ్ల క్రోమ్ బ్రౌజర్‌ను విక్రయించాల్సి వస్తుందని అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక పేర్కొంది. ‘‘కానీ కంపెనీ ఖచి్చతంగా అప్పీల్‌కు వెళుతుంది. ఇదే జరిగితే ఇప్పటికే నాలుగేళ్లుగా సాగిన ఈ వివాదం మరింతకాలం కొనసాగే అవకాశం ఉంది. పొడిగించే అవకాశం ఉంది. ఇది యూట్యూబ్ వంటి దాని స్వంత సేవలను విస్తృత పరచకుండా గూగుల్‌ను నిలువరిస్తుంది’’ అని కూడా ప్రెస్ నివేదిక వ్యాఖ్యానించింది. గూగుల్ మాతృ సంస్థ ఖండన కాగా తాజా పరిణామాలపై గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ చీఫ్ లీగల్ ఆఫీసర్ కెంట్ వాకర్ ఒక బ్లాగ్‌లో వ్యాఖ్యానిస్తూ, న్యాయశాఖ ప్రతిపాదనను ఒక సంస్థను ‘‘అస్థిరపరిచేది‘గా అలాగే ‘‘అనవసర జ్యోక్యం ఎజెండా‘ను ముందుకు తెచ్చేదిగా ఉందని పేర్కొన్నారు. న్యాయశాఖ విధానం ప్రభుత్వ విపరీత జోక్యానికి దారి తీస్తుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి ధోరణి అమెరికన్ వినియోగదారులకు, డెవలపర్లకు, చిన్న వ్యాపారాలకు హాని కలిగిస్తుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ప్రపంచ ఆర్థిక, సాంకేతిక నాయకత్వాన్ని అవసరమైన సమయంలో ప్రమాదంలో పడేసే విధానంగా విశ్లేషించారు. ఇతర టెక్ దిగ్గజాలపైనా ఇవే కేసులు ఇటీవలి సంవత్సరాలలో అమెజాన్, మెటా, గూగుల్ వంటి అనేక పెద్ద టెక్ కంపెనీలపై అమెరికా ప్రభుత్వ సంస్థలు ‘గుత్తాధిపత్యానికి సంబంధించి’ ఇదే తరహా కేసులు నమోదు చేశాయి. ఆయా సంస్థలు గుత్తాధిపత్యాన్ని సృష్టిస్తున్నాయని, మార్కెట్లోని ఇతర సంస్థల పోటీని అణిచివేస్తున్నాయని ఈ కేసుల సారాంశం. ఆపిల్, శామ్సంగ్ వంటి సంస్థలకు వాటి స్మార్ట్ఫోన్లు, వెబ్ బ్రౌజర్లపై ఆటోమేటిగ్గా తన సెర్చ్ ఇంజన్ లింక్ వచ్చే విధంగా గూగుల్ బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నట్లు 2020లోనే అమెరికా న్యాయశాఖ, కాలిఫోర్నియా, కొలరాడో, న్యూజెర్సీ మరియు న్యూయార్క్సహా పలు అమెరికా రాష్ట్రాలు కేసులు దాఖలు చేశాయి. గూగుల్ గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోందంటూ జడ్జి మెహతా ఆగస్టులో చేసిన వ్యాఖ్యలు ఈ అంశంపై తాజా పరిణామాలకు దారితీశాయి. సంస్థ గుత్తాధిపత్యాన్ని సరిదిద్దడాదనికి పరిష్కారాలను సమర్పించమని జడ్జి మెహతా న్యాయశాఖ అలాగే రాష్ట్రాలకు సూచించడం గమనార్హం. -
గూగుల్ క్రోమ్ యూజర్లూ తస్మాత్ జాగ్రత్త! కేంద్రం హై రిస్క్ వార్నింగ్
Google Chrome Users High Risk Warning గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యూజర్లూ బీ అలర్ట్. గూగుల్ క్రోమ్ వర్షన్ అప్ డేట్ చేసుకోకపోతే మీ కీలక సమాచారం చోరీ అయ్యే ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం తాజాగా హెచ్చరించింది. అప్డేట్ చేసుకోకపోతే సెక్యూరిటీ పరమైన సమస్యలు తప్పవంటూ యూజర్లకు హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. భారతదేశంలో కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) తాజాగా గుర్తించిన లోపాలను హై-రిస్క్‌గా వర్గీకరించింది. ముఖ్యంగా WebPలో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో ఎర్రర్, కస్టమ్ ట్యాబ్‌లు, ప్రాంప్ట్‌లు, ఇన్పుట్, ఇంటెంట్లు, పిక్చర్ ఇన్ పిక్చర్, ఇంటర్‌స్టీషియల్స్ లోపాలను గుర్తించినట్టు తెలిపింది. అలాగే డౌన్లోడ్లు, ఆటోఫిల్‌లో వాటిల్లో పాలసీ సరిగ్గా అమలు కాలేదని తెలిపింది. గూగుల్ క్రోమ్ ఈ లోపాలను బాధితుడి సిస్టమ్‌కు అనధికారిక యాక్సెస్‌ని అందించేలా సైబర్ నేరగాళ్లకు అవకాశం ఉంటుందని CERT-In వెల్లడించింది. ఈ నేపథ్యంలో గూగుల్ క్రోమ్ వినియోగదారులు తమ సిస్టమ్ ప్రొటెక్షన్ కోసం అప్డేట్ చేసుకోవడంఉత్తతమని సూచించింది. Google Chromeఅప్డేట్ చేసుకోవడం ఎలా? Chrome విండోను ఓపెన్ చేసి కుడి ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కల చిహ్నంపై క్లిక్ చేయాలి. డ్రాప్‌డౌన్ మెను నుండి, హెల్ప్ ఆప్షన్ ఎంచుకోవాలి. " About Google Chrome"పై క్లిక్ చేయండి. అప్డేట్పై క్లిక్ చేసి, బ్రౌజర్‌ని రీస్టార్ట్ చేస్తే చాలు. -
గూగుల్ క్రోమ్ అప్డేట్ చేసుకున్నారా? తక్షణమే చేయండి!
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? అయితో మీకో అలర్ట్. కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్ వినియోగదారులకు తాజాగా ఒక హెచ్చరిక జారీ చేసింది. డెస్క్ టాప్ కంప్యూటర్లు, లాప్‌టాప్‌ల్లో పాత క్రోమ్ బ్రౌజర్లు వినియోగిస్తున్న గూగుల్ క్రోమ్ యూజర్లు అలర్ట్‌గా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. తక్షణమే అప్డేట్ చేసుకోవాలని కోరింది. గూగుల్ క్రోమ్బ్రౌజర్లో పలు లోపాలను గుర్తించినట్టు తెలిపింది. దీంతో హ్యాకర్లు చొరబడి యూజర్ల పెర్సనల్ డేటా చోరీ చేసే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. CERT-In హైలైట్ చేసినవి CVE-2023-4427 CVE-2023-4428 CVE-2023-4429 CVE-2023-4430 CVE-2023-4431 ప్రభావిత సాఫ్ట్వేర్ గూగుల్ క్రోమ్ విండో వర్షన్ 116.0.5845.110/.111 మ్యాక్, లైనక్స్ వర్షన్ 116.0.5845.110 కంటే ముందు వర్షన్ బ్రౌజర్లలో లోపాలను గుర్తించామని, వీటిని యూజర్లకు ముప్పు పొంచి ఉందని సెర్ట్-ఇన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవాలని, అలాగే అనుమానాస్పద, నమ్మశక్యం కాగాని వెబ్సైట్ల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. Google Chromeని ఎలా అప్డేట్ చేసుకోవాలి కంప్యూటర్లో క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి కుడివైపున టాప్‌లో క్లిక్ మోర్మీద క్లిక్ చేయాలి చేయాలి. ‘హెల్ప్ అబౌట్ గూగులో క్రోమ్’ మీద క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ క్రోమ్ బటన్ కనిపించకపోతే మీ కంప్యూటర్ ఇప్పటికే అప్డేట్ అయినట్టు అర్థం. అపుడు రీలాంచ్ అనే బటన్‌మీద క్లిక్ చేయాలి. ఇప్పటికే కొన్నింటిని అప్డేట్ చేసింది.అయితే ఆటోమేటిక్‌గా అప్ డేట్ కానిపక్షంలో ‘క్రోమ్ ఈజ్ అప్ టూ డేట్’ అనే మెసేజ్ వస్తుంది. -
గూగుల్ క్రోమ్ యూజర్లకు షాక్.. ఆ కంప్యూటర్లకు సేవల నిలిపివేత
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ యూజర్లకు షాకిచ్చింది. జనవరి 10 నుంచి విండోస్ 7, 8, 8.1 విండోలతో పనిచేసే డెస్క్ ట్యాప్లలో గూగుల్ క్రోమ్ పనిచేయదు. గూగుల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ వెర్షన్లకు సపోర్ట్ చేయడాన్ని మైక్రోసాఫ్ట్ మూడేళ్ల క్రితమే నిలిపేసింది. ఇప్పుడు గూగుల్ వంతు వచ్చింది. క్రోమ్109 పైన నడుస్తున్న డెస్క్ టాప్లకు పైన పేర్కొన్న ఓఎస్ వెర్షన్లవే చిట్ట చివరివి అవుతాయి. మైక్రోసాఫ్ట్ బాటలో.. కొత్త ఓఎస్ వెర్షన్ల రాకతో, పాతవి, సమర్థవంతంగా లేని ఆపరేటింగ్ సిస్టమ్స్‌కు సపోర్టు చేయటం తగ్గిపోతోంది. ఇప్పుడు విండోస్ 7, 8, 8.1 కొత్తగా చేరుతున్నాయి.మైక్రోసాఫ్ట్ ఈ ఓఎస్ వెర్షన్లకు సపోర్ట్ చేయడం నుంచి వైదొలగడంతో, వాటిల్లో ఉండే క్రోమ్‌కు సెక్యూరిటీ సపోర్ట్ నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించుకుంది. వచ్చే నెలలో క్రోమ్ 110 వెర్షన్ క్రోమ్ కొత్త వెర్షన్ ‘క్రోమ్ 110’ ని గూగుల్ ప్రకటించింది. ఫిబ్రవరి 7, 2023లో కొత్తగా మార్కెట్లోకి విడుదల చేయనుంది. విండోస్ 10 దాని తర్వాత వెర్షన్ల వారికి ఉపయోగపడే మొట్టమొదటి క్రోమ్ వెర్షన్ ఇదే అవుతుంది. పాత వెర్షన్ విండోస్ .. అంటే విండోస్ 7, 8, 8.1 ఉన్న డెస్క్ టాప్ లకు ఈ బ్రౌజర్ ను పొందడం వీలుకాదు. క్రోమ్ 109 పనిచేస్తుంది.. కానీ విండోస్ 7, 8, 8.1 తో పనిచేసే డెస్క్ టాప్లకు క్రోమ్ 109 పనిచేస్తుంది. గూగుల్ నుంచి వాళ్లకి అప్ డేట్స్ రావు. దీనివల్ల కొత్త ఫీచర్లు అందుబాటులో ఉండవు. సెక్యూరిటీ రిస్క్, ఇతర సమస్యలు ఎక్కువ అవుతాయి. వీటిని ఎదుర్కోవటానికి ఉన్న ఏకైక మార్గం.. సపోర్టెడ్ విండో వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చుకోవటమే. వీలయినంత త్వరగా అప్ డేట్ చేసుకోవాలి కొత్తగా వచ్చే ‘క్రోమ్ 110’ బ్రౌజర్ వెర్షన్ ను అందుబాటులోకి తెచ్చుకోవాలనుకుంటే, మీ డెస్క్ టాప్‌ను విండోస్ 10కి వీలయినంత వేగంగా అందుబాటులోకి తెచ్చుకోవటమే. ► ‘విండోస్ అప్ డేట్’ సెట్టింగ్‌ను ఓపెన్ చేయండి. ‘అప్ డేట్ అండ్ సెక్యూరిటీ’ పై ట్యాప్ చేయాలి. ►అక్కడ ‘విండోస్ అప్ డేట్’ ఆప్షన్ పై క్లిక్ చేసి ‘చెక్ ఫర్ అప్ డేట్స్’ పై ట్యాప్ చేయండి ► మీ కంప్యూటర్ సపోర్ట్ చేస్తే ఆప్షన్ టు డౌన్ లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ‘డౌన్ లోడ్ అండ్ ఇన్ స్టాల్’ అనేదాని మీద ట్యాప్ చేయండి. లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ అవుతుంది. -
గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్, వెంటనే ఈ ఎక్స్‌టెన్షన్స్‌ను డిలీట్ చేయండి!
ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ (McAfee) గూగుల్ క్రోమ్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరస్తులు ఈ కామర్స్ సైట్‌లోని అఫిలియేషన్ లింక్స్‌ను అడ్డుపెట్టుకొని యూజర్లను ఫిషింగ్ సైట్లకు మళ్లిస్తున్నట్లు తెలిపింది. గూగుల్ క్రోమ్‌లో ఉన్న ఐదు ఎక్స్ టెన్షన్లను 1,400,000 కంటే ఎక్కువ మంది ఇన్ స్టాల్ చేసుకున్నారని, తద్వారా యూజర్ల డేటాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది. మెకాఫీ వెల్లడించిన ఎక్స్ టెన్షన్లలో నెట్ ఫ్లిక్స్ పార్టీ (800,000 యూజర్లు), నెట్ ఫ్లిక్స్ పార్టీ 2 (300,000 యూజర్లు), ఫ్లిప్ షోప్ ప్రైస్ ట్రాకర్ ఎక్స్ టెన్షన్ (80,000 యూజర్లు), ఫుల్ పేజీ స్క్రీన్ షాట్ క్యాప్చర్ స్క్రీన్ షాట్ (200,000 యూజర్లు), ఆటోబ్యూయ్ ఫ్లాష్ సేల్స్ (20,000 యూజర్లు) ఉన్నట్లు వెల్లడించింది. క్రోమ్ స్టోర్‌లో ఎక్స్ టెన్షన్ లు లభ్యం కావడం లేదు. అయితే యూజర్లు వాటిని తమ పర్సనల్ కంప్యూటర్లలలో ఇన్ స్టాల్ చేసుకున్నట్లయితే, వెంటనే డిలీట్ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఫిషింగ్ దాడులు తెలివి మీరిన సైబర్ నేరస్తులు యూజర్ నేమ్, పాస్ వర్డ్‌లను దొంగిలించేందుకు ఫిషింగ్ దాడులకు పాల్పడుతున్నారు. ఈ-కామర్స్ సైట్లు అందించే అఫిలియేట్ కమిషన్ లింక్స్‌ను క్లిక్ చేస్తే..వారికి అనుకూలమైన సైట్లకు మళ్లిస్తున్నారు. అనంతరం యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ డీటెయిల్స్‌ను కాజేస్తున్నారు. ఇదే విషయాన్ని మెకాఫీ గుర్తించింది. యూఆర్ఎల్ క్లిక్ చేస్తే అందులో అక్షర దోషాల్ని గుర్తించాలి. అక్షర దోషాలున్న లింక్స్‌ను క్లిక్ చేయోద్దంటూ సూచించింది. -
భయపెట్టిన 3 అంకెలు..! ఎట్టకేలకు సెంచరీ కొట్టిన గూగుల్ క్రోమ్..!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ రూపొందించిన ఇంటర్నెట్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ సెంచరీ కొట్టింది. నేటి నుంచి గూగుల్ క్రోమ్ వెర్షన్ మూడు అంకెలకు విస్తరించనుంది. విండోస్, మ్యాక్, లైనక్స్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో స్థిరమైన బిల్డ్‌తో గూగుల్ క్రోమ్ 100 వెర్షన్‌ను గూగుల్ లాంచ్ చేసింది. ఇక క్రోమ్ బ్రౌజర్ కోసం రిఫ్రెష్ చేసిన లోగోను కూడా గూగుల్ తీసుకువచ్చింది. 2014 తరువాత క్రోమ్ లోగోను అప్డేట్ చేయడం ఇదే మొదటిసారి. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్ క్రోమ్ తన 100 వెర్షన్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఇది గూగుల్ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలవనుంది. 2008లో ప్రారంభించినప్పటి నుంచి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేక యూజర్లను ఆకర్షించింది. ఇక ఈ క్రోమ్ 100 అప్డేట్ వెర్షన్లో కొత్త ఫీచర్లు ఏవీ లేవు. భయపెట్టిన మూడు అంకెలు..! ఒకనొక సమయంలో గూగుల్ క్రోమ్ 100 వెర్షన్ గూగుల్‌కు కంటిమీద కునుకులేకుండా చేసింది. ఈ మూడు అంకెల అప్డేట్తో అనేక వెబ్సైట్లను విచ్చిన్నం చేసే అవకాశం ఉందని గూగుల్ భావించింది. ఈ వెర్షన్ గతంలో సుమారు 200 కోట్ల క్రోమ్ యూజర్లపై ప్రభావం చూపనుందని గూగుల్ భయపడింది. గూగుల్ క్రోమ్ 100 వెర్షన్ బదులుగా మరిన్నీ ఫీచర్లతో ‘క్రోమ్ కానరీ’ ను లాంచ్ చేయాలని భావించింది. తాజా వెర్షన్ 100తో ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో గూగుల్ ఊపిరిపిల్చుకున్నట్లు సమాచారం. చదవండి: 200 కోట్ల యూజర్లకు పెను ప్రమాదం..! గూగుల్ హెచ్చరిక..! -
8 ఏళ్ల తర్వాత గూగుల్ మరో కీలక నిర్ణయం..!
ప్రముఖ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ విషయంలో టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. 2014 తర్వాత మొదటిసారిగా క్రోమ్ లోగోను స్వల్పంగా మారుస్తోంది. రీడిజైన్‌కు సంబంధించి గూగుల్ క్రోమ్ డిజైనర్ ఎల్విన్ హు తన ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ఈ మేరకు “ క్రోమ్ కొత్త ఐకాన్‌ను మీరు ఇవాళ గమనించే ఉంటారు. 8 ఏళ్ల తర్వాత క్రోమ్ బ్రాండ్ ఐకాన్‌ను రిఫ్రెష్ చేస్తున్నాం” అని వెల్లడించారు. పాత క్రోమ్ లోగో మాదిరి కొత్త బ్రాండ్ ఐకాన్‌లో షాడోలు లేవు. లోగోలో వినియోగించిన నాలుగు రంగులు మునుపటి కంటే చాలా మెరుస్తూ ఉన్నాయి. మధ్యలోని నీలిరంగు వృత్తం కొంచం పెద్దదిగా కనిపిస్తుంది. విండోస్‌తో సహా వివిధ ఆపరేటింగ్ సిస్టమ్‌ల కోసం ఈ లోగోను తయారు చేసినట్లు ఎల్విన్ హు పేర్కొన్నారు. రాబోయే కొద్దిరోజుల్లో డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల అందరికీ ఈ లోగోలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కాగా, 2008లో క్రోమ్ బ్రౌజర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత తొలుత 2011, 2014 ఏడాదిలో లోగోలో మార్పులు చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. Some of you might have noticed a new icon in Chrome’s Canary update today. Yes! we’re refreshing Chrome’s brand icons for the first time in 8 years. The new icons will start to appear across your devices soon. pic.twitter.com/aaaRRzFLI1 — Elvin 🌈 (@elvin_not_11) February 4, 2022 (చదవండి: హ్యుందాయ్ కంపెనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సోషల్ మీడియా యూజర్లు) -
200 కోట్ల యూజర్లకు పెను ప్రమాదం..! గూగుల్ హెచ్చరిక..!
Google Warns 2 Billion Users Of Update That Could Break Websites Worldwide: ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల క్రోమ్ యూజర్లకు పెనుప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని గూగుల్ హెచ్చరించింది. రాబోయే క్రోమ్ బ్రౌజర్ అప్డేట్ ప్రపంచవ్యాప్తంగా అనేక వెబ్సైట్లను విచ్ఛిన్నం చేసే అవకాశం ఉందని గూగుల్ యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. అంతుచక్కని సమస్య.! పరిష్కారమే లేదు..! టెక్ దిగ్గజం గూగుల్ తన క్రోమియంబగ్ ట్రాకర్ బ్లాగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. రాబోయే అనిశ్చితికి ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారమే లేకపోవచ్చునని గూగుల్ అభిప్రాయపడింది. కాగా తన వంతుగా సమస్యను పరిష్కరించేందుకు గూగుల్ ప్రయత్నాలను చేస్తోనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఏ వెబ్సైట్లకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయనే విషయం అస్పష్టంగా ఉంది. అలర్ట్‌గా ఉండడమే..! సమస్య పరిష్కారమయ్యేంత వరకు క్రోమ్ యూజర్లు ఇతర బ్రౌజర్స్‌ను వాడాలని ఫోర్బ్స్ తన నివేదికలో పేర్కొంది. క్రోమ్ యూజర్లు అలర్ట్‌గా ఉండడమే మంచిదని తెలిపింది. వచ్చే నెలలో క్రోమ్ యూజర్లకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెర్షన్స్‌తో సమస్య..! ఫోర్భ్స్ ప్రకారం...గూగుల్ క్రోమ్ వెర్షన్స్‌లో సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రోమ్ బ్రౌజర్ 96 వెర్షన్లో ఉంది. అయితే గూగుల్ మరిన్ని ఫీచర్స్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు ‘క్రోమ్ కానరీ’ బ్రౌజర్‌ను గూగుల్ టెస్ట్ చేస్తోంది. ఇది ప్రారంభ యాక్సెస్ డెవలపర్ బిల్డ్. ఇప్పుడు ఇది వెర్షన్ 99లో ఉంది. ఎప్పుడైతే బ్రౌజర్ వెర్షన్ 100కి చేరుకుంటే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ గ్లిచ్‌తో ప్రభావితమైన వెబ్సైట్లు స్పష్టంగా లోడ్ అవడం ఆగిపోతాయని ఫోర్బ్స్ పేర్కొంది. దీనికి కారణం ఈ వెబ్సైట్లు యూజర్లు సైట్‌ను సందర్శించే సమయంలో క్రోమ్ వెర్షన్‌ను తనిఖీ చేస్తాయి. అయితే ప్రోఫెషనల్ వెబ్సైట్ డిజైనర్ డూడా వంటి డిజైన్ సాఫ్ట్వేర్ మొదటి రెండు అంకెలను మాత్రమే తనిఖీ చేస్తుంది. ఈ సమయంలో క్రోమ్ బ్రౌజర్ వెర్షన్ 100కు యాక్సెస్ ఉండే అవకాశాలు తక్కువగా ఉండనున్నాయి. గూగుల్ ప్రయత్నాలు..! ఈ గ్లిచ్ ప్రభావాలను నివారించడానికి హ్యాకింగ్ వంటి ప్రక్రియలతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ ప్రయత్నాలను చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఆయా వెబ్సైట్లను సందర్శించేటప్పడు వెర్షన్ 100 స్థానంలో రెండంకెల వెర్షన్ పొందేలా గూగుల్ ప్రయోగాలు చేస్తోంది. చదవండి: అమెరికా టెక్ దిగ్గజాలకు చుక్కలు చూపిస్తున్న రష్యా..! -
ఇక వాట్స్‌యాప్ @ డెస్క్‌టాప్
గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో అందుబాటులోకి శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచవ్యాప్తంగా పేరొందిన మొబైల్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్స్‌యాప్... డెస్క్‌టాప్, పర్సనల్ కంప్యూటర్లలోనూ గురువారం నుంచి తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. తద్వారా యూజర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకునే వ్యూహాలకు కంపెనీ తెరతీసింది.గతేడాది సుమారు 19 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని వెచ్చించి వాట్స్‌యాప్‌ను కొనుగోలు చేసిన ఫేస్బుక్... ఈ కొత్త వెబ్ బ్రౌజర్ వెర్షన్ సర్వీసును ప్రారంభించింది. అయితే, ప్రస్తుతానికి దీన్ని గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ నుంచి అదీ ఆండ్రాయిడ్ మొబైల్స్‌కు మాత్రమే వినియోగించుకునే వీలుంటుంది. ఐఫోన్లో వాట్స్‌యాప్ వాడుతున్న యూజర్లకు యాపిల్ కంపెనీ ప్లాట్‌ఫామ్ పరిమితుల కారణంగా ఈ వెబ్ సేవలు లభించవని వాట్స్‌యాప్ బ్లాగ్‌లో వెల్లడించింది. మొబైల్‌తో అనుసంధానం... యూజర్ తన ఫోన్లోని వాట్స్‌యాప్ అకౌంట్‌నే కంప్యూటర్లోని వెబ్ బ్రౌజర్ ద్వారా ఉపయోగించుకునేలా(మిర్రర్) ఈ సర్వీసు వీలుకల్పిస్తుందని వాట్స్‌యాప్ సంస్థ బ్లాగ్‌లో వెల్లడించింది. అంటే మొబైల్లోని వాట్స్యాప్కు ఎక్స్టెన్షన్ కింద లెక్క. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాట్స్యాప్కు 60 కోట్ల మందికిపైగా యూజర్లు ఉన్నట్లు అంచనా. భారత్‌లో వాట్స్‌యాప్ యూజర్ల సంఖ్య 7 కోట్లు. ఈ సేవలను వినియోగించుకోవాలంటే.. యూజర్లు క్రోమ్ బ్రౌజర్లో ‘వెబ్.వాట్స్‌యాప్.కామ్’ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులోని క్యూఆర్ కోడ్‌ను మొబైల్‌తో స్కాన్ చేయాలి. దీంతో మొబైల్ ఫోన్లోని వాట్స్‌యాప్ అకౌంట్ బ్రౌజర్లో ప్రత్యక్షమవుతుంది. ఫోన్లో మెసేజ్‌లు పంపుకున్నట్లే బ్రౌజర్‌లోనూ దీన్ని ఉపయోగించొచ్చు. అయితే, మొబైల్లో తాజా వాట్స్‌యాప్ వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవడంతో పాటు మొబైల్‌ను నెట్‌తో కనెక్ట్ చేసి ఉంచడం తప్పనిసరి.