ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ రూపొందించిన ఇంటర్నెట్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ సెంచరీ కొట్టింది. నేటి నుంచి గూగుల్ క్రోమ్ వెర్షన్ మూడు అంకెలకు విస్తరించనుంది. విండోస్, మ్యాక్, లైనక్స్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో స్థిరమైన బిల్డ్‌తో గూగుల్ క్రోమ్ 100 వెర్షన్‌ను గూగుల్ లాంచ్ చేసింది. ఇక క్రోమ్ బ్రౌజర్ కోసం రిఫ్రెష్ చేసిన లోగోను కూడా గూగుల్ తీసుకువచ్చింది. 2014 తరువాత క్రోమ్ లోగోను అప్‌డేట్ చేయడం ఇదే మొదటిసారి.
ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్ క్రోమ్ తన 100 వెర్షన్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఇది గూగుల్ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలవనుంది. 2008లో ప్రారంభించినప్పటి నుంచి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేక యూజర్లను ఆకర్షించింది. ఇక ఈ క్రోమ్ 100 అప్‌డేట్ వెర్షన్‌లో కొత్త ఫీచర్లు ఏవీ లేవు.
భయపెట్టిన మూడు అంకెలు..!
ఒకనొక సమయంలో గూగుల్ క్రోమ్ 100 వెర్షన్ గూగుల్‌కు కంటిమీద కునుకులేకుండా చేసింది. ఈ మూడు అంకెల అప్‌డేట్‌తో అనేక వెబ్‌సైట్‌లను విచ్చిన్నం చేసే అవకాశం ఉందని గూగుల్ భావించింది. ఈ వెర్షన్ గతంలో సుమారు 200 కోట్ల క్రోమ్ యూజర్లపై ప్రభావం చూపనుందని గూగుల్ భయపడింది. గూగుల్ క్రోమ్ 100 వెర్షన్ బదులుగా మరిన్నీ ఫీచర్లతో ‘క్రోమ్ కానరీ’ ను లాంచ్ చేయాలని భావించింది. తాజా వెర్షన్ 100తో ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో గూగుల్ ఊపిరిపిల్చుకున్నట్లు సమాచారం.
చదవండి: 200 కోట్ల యూజర్లకు పెను ప్రమాదం..! గూగుల్ హెచ్చరిక..!
Comments
Please login to add a commentAdd a comment