గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? అయితో మీకో అలర్ట్. కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్ వినియోగదారులకు తాజాగా ఒక హెచ్చరిక జారీ చేసింది. డెస్క్ టాప్ కంప్యూటర్లు, లాప్‌టాప్‌ల్లో పాత క్రోమ్ బ్రౌజర్లు వినియోగిస్తున్న గూగుల్ క్రోమ్ యూజర్లు అలర్ట్‌గా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. తక్షణమే అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. గూగుల్ క్రోమ్‌బ్రౌజర్‌లో పలు లోపాలను గుర్తించినట్టు తెలిపింది. దీంతో హ్యాకర్లు చొరబడి యూజర్ల పెర్సనల్ డేటా చోరీ చేసే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
CERT-In హైలైట్ చేసినవి
CVE-2023-4427
CVE-2023-4428
CVE-2023-4429
CVE-2023-4430
CVE-2023-4431
ప్రభావిత సాఫ్ట్‌వేర్
గూగుల్ క్రోమ్ విండో వర్షన్ 116.0.5845.110/.111 మ్యాక్, లైనక్స్ వర్షన్ 116.0.5845.110 కంటే ముందు వర్షన్ బ్రౌజర్లలో లోపాలను గుర్తించామని, వీటిని యూజర్లకు ముప్పు పొంచి ఉందని సెర్ట్-ఇన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని, అలాగే అనుమానాస్పద, నమ్మశక్యం కాగాని వెబ్‌సైట్ల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
Google Chromeని ఎలా అప్‌డేట్ చేసుకోవాలి
కంప్యూటర్‌లో క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి
కుడివైపున టాప్‌లో క్లిక్ మోర్‌మీద క్లిక్ చేయాలి చేయాలి.
‘హెల్ప్ అబౌట్ గూగులో క్రోమ్’ మీద క్లిక్ చేసి అప్‌డేట్ చేసుకోవాలి.
అప్‌డేట్ క్రోమ్ బటన్ కనిపించకపోతే మీ కంప్యూటర్ ఇప్పటికే అప్‌డేట్ అయినట్టు అర్థం. అపుడు రీలాంచ్ అనే బటన్‌మీద క్లిక్ చేయాలి.
ఇప్పటికే కొన్నింటిని అప్‌డేట్ చేసింది.అయితే ఆటోమేటిక్‌గా అప్ డేట్ కానిపక్షంలో ‘క్రోమ్ ఈజ్ అప్ టూ డేట్’ అనే మెసేజ్ వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment