వెంకటాపురం(వరంగల్): కాకతీయుల కాలంలో నిర్మించిన వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప ఆలయం అద్భుతంగా ఉందని ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ కాన్సులేట్ జనరల్ (హైకమిషనర్) హస్సాన్ నౌరీయన్ అన్నారు. శనివారం పాలంపేట శివారులోని గల రామప్ప దేవాలయాన్ని ఆయన కుటుంబసమేతంగా సందర్శించారు. ఆలయ శిల్పకళాసంపద గురించి టూరిజం గైడ్‌లు గోరంట్ల విజయ్‌కుమార్, సూర్యకిరణ్‌లు ఆయన కుటుంబసభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా ఇరానీలు ఆలయానికి చెందిన ప్రతి శిల్పాన్ని పరీశీలిస్తూ శిల్పాకళ సౌందర్యాన్ని కెమెరాలో బంధించారు. నంది విగ్రహం వద్ద ఫొటోలు దిగారు. అనంతరం సరస్సు కట్టకు చేరుకొని సరస్సు అందాలను తిలకించారు.