
కొత్త ఐడియాలను అమలు చేయడంలో భారత్ ముందుంటుందని ఈ వీడియో నిరూపిస్తోంది. చాలామంది తమ టాలెంట్ చూపించి, అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి ఐడియాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇంటర్నెట్‌లో ఒక వీడియో అందరినీ అమితంగా అలరిస్తోంది. దీనిని చూసినవారంతా ఆ మహిళ ఐడియాను తెగ మెచ్చుకుంటున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. నీటి ట్యాప్ విరిగిపోవడంతో ఒక మహిళ దానికి టూత్‌పేస్ట్ ట్యూబ్ కత్తిరించి బిగించింది. దాని మూత తీస్తూ నీటిని పట్టుకుంటోంది. దీనిని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. వీడియో ప్రారంభంలో ఒక మహిళ నీటిని పట్టుకునేందకు ఒక బకెట్ తీసుకురావడం కనిపిస్తుంది. తరువాత అక్కడ విరిగి ఉన్న ట్యాప్ కనిపిస్తుంది.
ఆ విధంగా ఉంటే నీటిని పట్టుకోవడం ఇబ్బందికరం అని గ్రహించి, ఆమె ఒక టూట్‌పేస్ట్ కట్ చేసి, ఆ టాప్‌కు బిగిస్తుంది. తరువాత కావలినంత నీటిని పట్టుకుని, తరువాత దానికి మూత బిగిస్తుంది. ఈ వీడియో జూలై 12న షేర్ అవగా, ఇప్పటి వరకూ దీనికి 120.7కే వ్యూస్ దక్కాయి. 9 సెకెన్లు ఈ వీడియోకు ఇప్పటి వరకూ వెయ్యికి పైగా లైక్స్ దక్కాయి. వీడియో చూసిన నెటిజన్లు రరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Wow very practical👏
— Tansu YEĞEN (@TansuYegen) July 12, 2023
pic.twitter.com/T21h2EedtJ
ఇది కూడా చదవండి: చెత్త డబ్బాలో ‘సెర్చ్’,‘అన్‌లాక్’,‘డౌన్‌లోడ్’.. ఎందుకిదంతా జరుగుతోంది?
Comments
Please login to add a commentAdd a comment