Replaced
-
టూత్‌పేస్ట్ ట్యూబ్‌తో నీళ్లు పడుతున్న మహిళ.. మెచ్చుకుంటున్న జనం!
కొత్త ఐడియాలను అమలు చేయడంలో భారత్ ముందుంటుందని ఈ వీడియో నిరూపిస్తోంది. చాలామంది తమ టాలెంట్ చూపించి, అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి ఐడియాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇంటర్నెట్లో ఒక వీడియో అందరినీ అమితంగా అలరిస్తోంది. దీనిని చూసినవారంతా ఆ మహిళ ఐడియాను తెగ మెచ్చుకుంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. నీటి ట్యాప్ విరిగిపోవడంతో ఒక మహిళ దానికి టూత్‌పేస్ట్ ట్యూబ్ కత్తిరించి బిగించింది. దాని మూత తీస్తూ నీటిని పట్టుకుంటోంది. దీనిని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. వీడియో ప్రారంభంలో ఒక మహిళ నీటిని పట్టుకునేందకు ఒక బకెట్ తీసుకురావడం కనిపిస్తుంది. తరువాత అక్కడ విరిగి ఉన్న ట్యాప్ కనిపిస్తుంది. ఆ విధంగా ఉంటే నీటిని పట్టుకోవడం ఇబ్బందికరం అని గ్రహించి, ఆమె ఒక టూట్‌పేస్ట్ కట్ చేసి, ఆ టాప్కు బిగిస్తుంది. తరువాత కావలినంత నీటిని పట్టుకుని, తరువాత దానికి మూత బిగిస్తుంది. ఈ వీడియో జూలై 12న షేర్ అవగా, ఇప్పటి వరకూ దీనికి 120.7కే వ్యూస్ దక్కాయి. 9 సెకెన్లు ఈ వీడియోకు ఇప్పటి వరకూ వెయ్యికి పైగా లైక్స్ దక్కాయి. వీడియో చూసిన నెటిజన్లు రరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. Wow very practical👏 pic.twitter.com/T21h2EedtJ — Tansu YEĞEN (@TansuYegen) July 12, 2023 ఇది కూడా చదవండి: చెత్త డబ్బాలో ‘సెర్చ్’,‘అన్‌లాక్’,‘డౌన్లోడ్’.. ఎందుకిదంతా జరుగుతోంది? -
పిట్ట పోయి కుక్క వచ్చె.. ట్విటర్ లోగోను మార్చిన మస్క్!
ఎలాన్ మస్క్ ట్విటర్లో మరో మార్పు చేశాడు. ఈ సారి లోగోపై పడ్డాడు. ఇప్పటి వరకూ ఉన్న పక్షి (బ్లూబర్డ్) లోగోను పీకేసి దాని స్థానంలో కుక్క (డాగీ) లోగోను పెట్టాడు. అయితే ఇది మొబైల్ యాప్‌లో కాదులెండి.. డెస్క్‌టాప్ వెర్షన్లో మాత్రమే ఇలా చేశాడు. (అప్పుడు కొనలేకపోయారా..? ఇప్పుడు కొనండి..) pic.twitter.com/wmN5WxUhfQ — Elon Musk (@elonmusk) April 3, 2023 ట్విటర్ వెబ్సైట్లో హోం బటన్‌గా ఉన్న ఐకానిక్ బ్లూ బర్డ్ లోగో స్థానంలో డాగీ కాయిన్ (Dogecoin) క్రిప్టోకరెన్సీ లోగోకు చెందిన డాగ్ మీమ్ ప్రత్యక్షమైంది. ఏప్రిల్ 3న దాన్ని గమనించిన యూజర్లు అవాక్కయ్యారు. ప్రముఖ క్రిప్టోకరెన్సీ డాగీ కాయిన్ లోగోలో ఉపయోగించిన డాగీ (షిబా ఇను డాగ్) చిత్రం చాలా కాలంగా అనేక వైరల్ మీమ్స్‌లో కనిపిస్తోంది. (జొమాటో డెలివరీ పార్ట్నర్స్కు ఎలక్ట్రిక్ స్కూటర్లు!) ట్విటర్ లోగో మార్పుపై ఎలాన్ మస్క్ తనదైన శైలిలో ఓ హాస్యభరితమైన మీమ్‌ను జోడిస్తూ ట్విటర్లో షేర్ చేశారు. అలాగే 2022 మార్చి 26 నాటి తన ట్విటర్ చాట్ స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకున్నారు. అందులో ఓ అజ్ఞాత యూజర్ ట్విటర్ బర్డ్ లోగోను ‘డాగ్’గా మార్చమని అడగ్గా దానికి మస్క్ సరే అని బదులిచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నట్లు ఆ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ పోస్ట్ చేశారు. (రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు) క్రిప్టోకరెన్సీ డాగీకాయిన్‌కు మద్దతుగా పిరమిడ్ స్కీమ్‌ను నిర్వహిస్తున్నారని ఎలాన్ మస్క్‌పై ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కోర్టుల్లో పలు వ్యాజ్యాలు సైతం దాఖలయ్యాయి. మస్క్ ట్విటర్ లోగోను డాగీ లోగోగా మార్చిన తర్వాత డాగీకాయిన్ విలువ 20 శాతం వరకు పెరిగింది. As promised pic.twitter.com/Jc1TnAqxAV — Elon Musk (@elonmusk) April 3, 2023 -
డొమినోస్ పిజ్జా కొత్త నిర్ణయం... పొల్యూషన్ ఫ్రీ డెలివరీ !
హైదరాబాద్: ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మీరాచానుకి జీవితాంతం ఫ్రీ ఆఫర్ ప్రకటించి దేశ ప్రజల మన్ననలు అందుకున్న డోమినోస్ మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకుంది. వాతవారణ కాలుష్యం తగ్గించడంలో భాగంగా తన వంతు ప్రయత్నాలను ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ డెలివరీ పర్సన్స్ ప్రస్తుతం ఉపయోగిస్తున్న పెట్రోలు బైకులు, స్కూటర్ల స్థానంలో ఇక నుంచి కాలుష్యం విడుదల చేయని ఎలక్ట్రికల్ వెహికల్స్‌ను ఎంపిక చేసిన నగరాల్లో ప్రయోగాత్మకంగా ఉపయోగించాలని డొమినోస్ నిర్ణయించింది. అక్కడ సానుకూల ఫలితాల వస్తే క్రమంగా దేశవ్యాప్తంగా అన్ని స్టోర్లలో పని చేస్తున్న డెలివరీ పర్సన్స్ ప్రస్తుతం ఉన్న పెట్రోలు బైకుల స్థానంలో ఎలక్ట్రిక్ బైకులు ఉపయోగించేలా మార్పులు తేనుంది. రివోల్ట్ 300 కాలుష్య నియంత్రణలో భాగంగా రివోల్ట్ 300 మోడల్ ఎలక్ట్రిక్ బైకులను డొమినోస్ పిజ్జా ఉపయోగించనుంది. ఈ మేరకు రివోల్ట్‌తో సంప్రదింపులు చేపడుతోంది. డెలివరీకి అనుగుణంగా ఈ బైకులను కష్టమైజ్ చేయనున్నారు. ఈ బైకులను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 నుంచి 150 కి,.మీ రేంజ్ మైలేజీ ఇవ్వగలవు. గరిష్ట వేగం గంటలకు 65 కిలోమీటర్లు. వేలల్లో డెలివరీ పర్సన్స్ డొమినోస్ పిజ్జాకి దేశ వ్యాప్తంగా వేలాది అవుట్లెట్లు ఉన్నారు. వేలాది మంది డెలివరీ బాయ్స్ నిత్యం నగరాల్లో బైకులపై తిరుగుతూ పిజ్జాలను డెలివరీ చేస్తున్నారు. వేలల్లో ఉన్న ఈ డెలివరీ పర్సన్స్ నిత్యం పెట్రోలు బైకులపై తిరుగుతూ తమ విధులు నిర్వహ్తిన్నారు. -
హీరో భార్యకి నచ్చలేదని నన్ను తప్పించారు
హిందీ సినిమా ‘పింక్’ తర్వాత దాదాపు శక్తిమంతమైన పాత్రలే చేస్తున్నారు తాప్సీ. తెర మీద అన్యాయాలను ఎదిరించే ధైర్యం ఉన్న అమ్మాయి పాత్రలు చేస్తున్న ఆమె తెరవెనక కూడా తన మనసులోని మాటలను ధైర్యంగా చెబుతున్నారు. సినిమా పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పలు సందర్భాల్లో చెప్పారామె. తాజాగా కొన్ని విషయాలను బయటపెట్టారు. అయితే తాను ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ల పేర్లను బయటపెట్టకుండా ‘ఆ హీరో’ అని సంబోధించారు. తాప్సీ మాట్లాడుతూ – ‘‘గతంలో ఓ హీరో భార్యకు నేను ఆ సినిమాలో నటించడం ఇష్టం లేకపోవడంతో నన్ను తప్పించి, వేరే హీరోయిన్ని తీసుకున్నారు. ఇంకో సినిమాకైతే హీరోకి నా డైలాగ్ నచ్చలేదు. దాంతో మార్చమన్నాడు. కానీ నేను తిరస్కరించాను. ఆ సినిమాకి నేను డబ్బింగ్ చెప్పుకున్నాను. కానీ నేను డైలాగ్ మార్చడానికి తిరస్కరించడం వల్ల డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో చెప్పించారు. అలాగే ఒక హీరో సరసన సినిమా కమిట్ అయ్యాక, ఆ హీరో అంతకు ముందు చేసిన సినిమా బాగా ఆడలేదని బడ్జెట్ కంట్రోల్ చేయాలని నా పారితోషికం తగ్గించుకోమన్నారు. ఇంకో హీరో అయితే నా ఇంట్రడక్షన్ సీన్‌ని మార్చాలని కోరాడు. ఎందుకంటే అతని ఇంట్రడక్షన్ సీన్‌ని డామినేట్ చేసే విధంగా ఉందని ఆ హీరోకి అనిపించిందట. ఇవన్నీ కూడా నా ముందు జరిగిన విషయాలు. ఇక వెనక ఎలాంటివి జరిగి ఉంటాయో’’ అన్నారు తాప్సీ. అయితే ఇప్పుడు మాత్రం ఎక్కడా తగ్గడంలేదని తాప్సీ చెబుతూ – ‘‘కొన్నాళ్లుగా నాకు పూర్తి సంతృప్తినిచ్చే సినిమాలనే ఒప్పుకుంటున్నాను. అయితే కొందరు నా నిర్ణయం సరికాదన్నారు. ఇక ఎవరైనా హీరోయిన్ లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తే చాలు... ఆమెను హీరోలు తమ సినిమాల్లో కథానాయికగా తీసుకోవడానికి వెనకాడతారు. ఏది ఏమైనా నాకు తృప్తినిచ్చే సినిమాలే చేయాలంటే ఒక్కోసారి సాధ్యపడకపోవచ్చు. కానీ అలాంటి సినిమాలు చేయడంవల్ల ప్రతిరోజూ నేను ఆనందంగా ఉంటాను’’ అన్నారు. హిందీలో నామ్ షబానా, బద్లా, సాండ్ కీ ఆంఖ్, థప్పడ్.. ఇలా వరుసగా కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేస్తున్నారు తాప్సీ. ప్రస్తుతం హిందీలో చేస్తున్న ‘హసీన దిల్ రుబా’, ‘రష్మీ రాకెట్’ చిత్రాలు కూడా ఆ కోవకి చెందినవే. ఓ తమిళ చిత్రంలో కూడా నటిస్తున్నారు. -
పంత్ ఇంగ్లండ్ పయనం
నాటింగ్‌హామ్: ఓపెనర్ శిఖర్ ధావన్ అనూహ్యంగా గాయపడటంతో భారత టీమ్ మేనేజ్మెంట్ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టింది. అవసరమైతే మరో ఆటగాడు అందుబాటులో ఉంటే మంచిదని భావిస్తూ అందుకోసం యువ ఆటగాడు రిషభ్ పంత్‌ను ఎంపిక చేసింది. ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన సమయంలో ప్రకటించిన రిజర్వ్ ఆటగాళ్లలో పంత్ కూడా ఒకడు. రిషభ్ గురువారం సాయంత్రం ఇంగ్లండ్ చేరుకుంటాడు. అయితే గాయం నుంచి కోలుకునే వరకు ధావన్‌ను జట్టుతోనే కొనసాగించాలని భారత్ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఐసీసీ నిబంధనల ప్రకారం పంత్ టీమిండియాతో చేరే అవకాశం లేదు. అతను జట్టుతో ఉండకుండా మాంచెస్టర్‌లో ఉంటాడని, ప్రస్తుతానికి పంత్ ‘స్టాండ్ బై’ మాత్రమేనని, ధావన్ స్థానంలో ఎంపిక చేయలేదని బీసీసీఐ ప్రకటించింది. గత ఏడాది కాలంగా అద్భుత ఫామ్‌లో ఉన్న పంత్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడంపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది. అయితే కుర్ర పంత్‌కంటే అనుభవజ్ఞుడైన దినేశ్ కార్తీక్కే ప్రాధాన్యమిచ్చామని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చారు. మరో రెండు మ్యాచ్‌లకు... ప్రస్తుతం ధావన్ గాయాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అతని గాయంపై పూర్తిగా స్పష్టత వచ్చేందుకు మరో 10–12 రోజులు పడుతుందని బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ వెల్లడించారు. ముందుగా అనుకున్నట్లు కివీస్, పాక్ మ్యాచ్‌లకే కాకుండా 22, 27 తేదీల్లో అఫ్గానిస్తాన్, వెస్టిండీస్‌లతో జరిగే మ్యాచ్‌లు కూడా ధావన్ ఆడే అవకాశం కనిపించడం లేదు. అయితే 30లోగా అతను పూర్తిగా కోలుకోవచ్చని వైద్యులు టీమ్ మేనేజ్మెంట్కు చెప్పినట్లు సమాచారం. వరల్డ్ కప్‌లో అతి పెద్ద మ్యాచ్‌గా భావిస్తున్న భారత్, ఇంగ్లండ్ మధ్య పోరు ఈ నెల 30న బర్మింగ్‌హామ్‌లో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో శిఖర్ బరిలోకి దిగితే చాలని భారత్ కోరుకుంటోంది. -
ఐఎస్ఐ చీఫ్‌ను మార్చేస్తున్న పాక్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. అత్యంత శక్తివంతమైన గూఢాచార్య సంస్థ ఐఎస్ఐ లెఫ్టినెంట్ జనరల్ రిజ్వాన్ అక్తార్ను మరికొద్ది వారాల్లో మార్చబోతున్నట్టు తెలుస్తోంది. ఇంటర్ సర్వీసు ఇంటిలిజెన్స్(ఐఎస్ఐ) డైరెక్టర్ జనవరల్గా రిజ్వాన్ అక్తర్ 2014 సెప్టెంబర్‌లో ఎంపికయ్యారు. లెఫ్టినెట్ జనరల్ జహీర్ ఉల్ ఇస్లాం స్థానంలో రిజ్వాన్ ఈ బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా ఈ పదవిలో కొనసాగే వారు మూడేళ్ల కాలానికి నియమితులవుతారు. కానీ ఐఎస్ఐ చీఫ్‌గా వారు రిటైరైనా లేదా ఆర్మీ చీఫ్ వారిని తొలగించినా పదవి నుంచి ఐఎస్ఐ చీఫ్ తప్పుకోవాల్సి ఉంటుంది. ఆశ్యర్యకరంగా మూడేళ్ల కాలం పూర్తవకుండానే రిజ్వాన్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. కరాచీ పోలీసుల కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ నవీద్ ముక్తర్ ఆయన స్థానంలో కొత్తగా రానున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్మీ చీఫ్‌గా జనరల్ రహీల్ షరీఫ్ పదవి పొడిగింపు లేదా రిటైర్మెంట్ ప్రకటించే సమయంలోనే ఇతని పదవి కూడా మార్పుచేయనున్నట్టు వెల్లడవుతోంది. అంతకముందు మిలటరీలో ఎలాంటి మార్పులు వెలువడే అవకాశం లేదని మరో అధికారి పేర్కొంటున్నారు. అయితే తనకు ఆర్మీ చీఫ్‌గా కొనసాగే ఆసక్తి లేదని, నవంబర్‌లో తాను పదవి విరమణ చేయనున్నట్టు ఈ ఏడాది మొదట్లోనే రహీల్ ప్రకటించారు. కానీ భారత్-పాకిస్తాన్ల మధ్య ఇటీవల నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో రహీల్ పదవిని పొడిగించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఐఎస్ఐ చీఫ్‌ను ఎందుకు మారుస్తున్నారో మాత్రం సరియైన కారణాలు వెల్లడికాలేదు. -
వైఎస్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలి
ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం ఆమనగల్లు: విజయవాడలో అర్థరాత్రి తొలగించిన దివంగత మహానేత, ప్రజానాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని అక్కడే పునప్రతిష్టించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి డిమాండ్ చేశారు. విజయవాడలో మహానేత వైఎస్ విగ్రహం తొలగింపునకు నిరసనగా ఆమనగల్లులో ఆదివారం వైఎస్ విగ్రహానికి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ నాయకులు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం చల్లా వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. విజయవాడలో మహానేత వైఎస్ కాంస్య విగ్రహాన్ని అధికార బలంతో అర్ధరాత్రి తొలగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అన్ని అనుమతులతో వైఎస్ విగ్రహం ఏర్పాటు చేసినప్పటికి అకారణంగా తొలగించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తొలగించిన చోటే వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. విజయవాడలో వైఎస్ విగ్రహ ఏర్పాటు కోసం జరిగే అన్ని కార్యక్రమాలలో పాల్గొంటామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయిల శ్రీనివాస్‌గౌడ్, వైఎస్సార్సీపీ నాయకులు ఆనంద్‌నాయక్, బాలస్వామి, రహీం, కాంగ్రెస్ నాయకులు, ఖాదర్, ఖలీల్, కృష్ణానాయక్, ధనుంజయ, పులికంటి మైసయ్య, రామలింగం, కండె సాయి, అలీం, రాఘవేందర్, రాములు తదితరులు పాల్గొన్నారు. -
కంపెనీల ఆదాయంలో 11-12% వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీల ఆదాయాలు స్థిరంగా 7-9% ఉంటాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రీసెర్చ్ పేర్కొంది. కాని గత రెండు త్రైమాసికాలతో పోలిస్తే ఆదాయాల క్షీణత ఆగి స్వల్ప వృద్ధి కనిపిస్తోందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11-12 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. ఎన్నికల తర్వాత స్థిరమైన ప్రభుత్వం వస్తుందన్న అంచనాతో ఆదాయం, నిర్వహణ లాభాల్లో క్షీణత ఆగి, వృద్ధి నమోదవుతోందని క్రిసిల్ ప్రెసిడెంట్ ముఖేష్ అగర్వాల్ తెలిపారు. దీనికితోడు గత 12-18 నెలల నుంచి ఆగిపోయిన ప్రాజెక్టుల్లో కదలిక తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, అం తర్జాతీయంగా జీడీపీ, ఎగుమతుల్లో వృద్ధి కనపడటంతో ఈ ఏడాది ఆదాయాలు 12% వరకు పెరగొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కీలకమైన లోహాలు, ఇంధన, బొగ్గు ధరలు తగ్గడంతో కంపెనీల ఎబిట్టా మార్జిన్లు 1% పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూపాయి క్షీణత వల్ల ఐటీ, ఫార్మా, రెడీమేడ్ గార్మెంట్స్, కాటన్ యార్న్ రంగాల ఆదాయాలు బాగా పెరగనున్నాయి. అలాగే గత 3 త్రైమాసికాల నుంచి వృద్ధి బాటలోకి వచ్చిన టెలికం, రిటైల్, మీడియా రంగాలు ఇదే విధమైన ధోరణిని కొనసాగిస్తాయని క్రిసిల్ పేర్కొంది. -
ఐశ్వర్య లేకుంటే అసిన్
ఐశ్వర్యరాయ్ కాదంటే తదుపరి ప్రాధాన్యత అసిన్కే నంటున్నారు ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం. కడల్ తరువాత ఈయన తాజా చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రం ప్రారంభానికి ముందే మార్పులు, చేర్పులు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. మొదట తమిళం, తెలుగు భాషలలో రూపొందించనున్నారనే ప్రచారం జరిగింది. అలాగే టాలీవుడ్ స్టార్స్ మహేశ్ బాబు, నాగార్జున హీరోలుగా నటించే ఈ చిత్రంలో ముఖ్య భూమికను మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ పోషించనున్నారనే వార్తలు వెలువడ్డాయి. తాజాగా ఈ చిత్రాన్ని మణిరత్నం తొలుత తెలుగులోనే రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు కోలీవుడ్‌లో ఫైనాన్స్ సమస్య కారణం అని సమాచారం. తాజాగా చిత్రంలో ఐశ్వర్యారాయ్ కూడా నటించే అవకాశం లేదని తెలుస్తోంది. వివాహానంతరం ఐశ్వర్యారాయ్ మణిరత్నం చిత్రం ద్వారానే రీ ఎంట్రీ కావాలని ఆశించారని, అందుకే ఆయన అడగ్గానే నటించడానికి ఓకే చెప్పారని సమాచారం. ఈ సుందరి మళ్లీ నటించడానికి ఆమె అత్త జయబచ్చన్‌కు ఇష్టం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో వారి కుటుంబంలో మనస్పర్థలు రేగే పరిస్థితులు తలెత్తడంతో ఇదే విషయాన్ని ఐశ్వర్యారాయ్ మణిరత్నంతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. మణిరత్నం ఆమె కోసం మరి కొద్ది కాలం వేచి ఉండడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేశారని సమాచారం. అయినా ఐశ్వర్యారాయ్ నటించని పక్షంలో ఆ పాత్రకు నటి అసిన్‌ను ఎంపిక చేయాలని మణిరత్నం నిర్ణయించినట్లు తాజా సమాచారం.