ఐఎస్ఐ చీఫ్ను మార్చేస్తున్న పాక్
ఐఎస్ఐ చీఫ్ను మార్చేస్తున్న పాక్
Published Sat, Oct 8 2016 2:17 PM | Last Updated on Sat, Mar 23 2019 7:58 PM
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. అత్యంత శక్తివంతమైన గూఢాచార్య సంస్థ ఐఎస్ఐ లెఫ్టినెంట్ జనరల్ రిజ్వాన్ అక్తార్ను మరికొద్ది వారాల్లో మార్చబోతున్నట్టు తెలుస్తోంది. ఇంటర్ సర్వీసు ఇంటిలిజెన్స్(ఐఎస్ఐ) డైరెక్టర్ జనవరల్గా రిజ్వాన్ అక్తర్ 2014 సెప్టెంబర్లో ఎంపికయ్యారు. లెఫ్టినెట్ జనరల్ జహీర్ ఉల్ ఇస్లాం స్థానంలో రిజ్వాన్ ఈ బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా ఈ పదవిలో కొనసాగే వారు మూడేళ్ల కాలానికి నియమితులవుతారు. కానీ ఐఎస్ఐ చీఫ్గా వారు రిటైరైనా లేదా ఆర్మీ చీఫ్ వారిని తొలగించినా పదవి నుంచి ఐఎస్ఐ చీఫ్ తప్పుకోవాల్సి ఉంటుంది.
ఆశ్యర్యకరంగా మూడేళ్ల కాలం పూర్తవకుండానే రిజ్వాన్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. కరాచీ పోలీసుల కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ నవీద్ ముక్తర్ ఆయన స్థానంలో కొత్తగా రానున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్మీ చీఫ్గా జనరల్ రహీల్ షరీఫ్ పదవి పొడిగింపు లేదా రిటైర్మెంట్ ప్రకటించే సమయంలోనే ఇతని పదవి కూడా మార్పుచేయనున్నట్టు వెల్లడవుతోంది.
అంతకముందు మిలటరీలో ఎలాంటి మార్పులు వెలువడే అవకాశం లేదని మరో అధికారి పేర్కొంటున్నారు. అయితే తనకు ఆర్మీ చీఫ్గా కొనసాగే ఆసక్తి లేదని, నవంబర్లో తాను పదవి విరమణ చేయనున్నట్టు ఈ ఏడాది మొదట్లోనే రహీల్ ప్రకటించారు. కానీ భారత్-పాకిస్తాన్ల మధ్య ఇటీవల నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో రహీల్ పదవిని పొడిగించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఐఎస్ఐ చీఫ్ను ఎందుకు మారుస్తున్నారో మాత్రం సరియైన కారణాలు వెల్లడికాలేదు.
Advertisement
Advertisement