సునందపుష్కర్ హత్య కేసులో ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ప్రస్తుతానికి ప్రశ్నించబోమని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
ముందు మిగతా వారందరినీ విచారిస్తాం: పోలీసులు
న్యూఢిల్లీ: సునందపుష్కర్ హత్య కేసులో ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ప్రస్తుతానికి ప్రశ్నించబోమని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. తొలుత.. ఈ కేసుకు సంబంధించిన ఇతర వ్యక్తులందరనీ విచారించటంతో పాటు, లభ్యమైన సాక్ష్యాధారాలను పరిశీలిస్తామని చెప్పారు. సునంద అనుమానాస్పద మరణానికి ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంటుతో సంబంధం ఉండొచ్చన్న వార్తా కథనాలను ప్రస్తావించగా.. తమకు ఇంతవరకూ అటువంటి కోణమేదీ తారసిల్లలేదని పోలీసులు బదులిచ్చారు.
కొత్తగా చెప్పటానికేం లేదు: థరూర్
సునందపుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు తీరుపై శుక్రవారం మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేసిన శశిథరూర్.. ఈ విషయంలో తాను కొత్తగా చెప్పేదేమీ లేదని శనివారం వ్యాఖ్యానించారు. ఆయన కొచ్చి పర్యటన సందర్భంగా మీడియా ప్రతినిధులు ఈ కేసు విషయాన్ని ప్రస్తావించగా పై విధంగా స్పందించారు.