
సాక్షి, చెన్నై: సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద వీడియో పోస్ట్ చేసిన బీజేపీ మహిళా నేతను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్న సౌదామణి గత జనవరిలో రెండు మతాల మధ్య ఘర్షణలు రేకెత్తించేలా ఉన్న వీడియోను తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. దీనిపై చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయబడింది. సెంట్రల్ క్రైమ్ విభాగం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి సౌదామణి ముందస్తు బెయిల్ కోరుతూ చెన్నై హైకోర్టులో గత ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నారు. దానిని కోర్టు తిరస్కరించింది. ఈ నేథ్యంలో శనివారం సెంట్రల్ క్రైమ్, సైబర్ క్రైమ్ పోలీసులు సౌదామణి చెన్నైలోని ఆమె ఇంటిలో అరెస్టు చేశారు.
చదవండి: అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్