‘రాంగోపాల్ వర్మను చెప్పులతో కొడతాం’ | Ram Gopal Varma should apologise for his remark, if he doesn't we will try to beat him with shoes: Vidya Chavan | Sakshi
Sakshi News home page

‘రాంగోపాల్ వర్మను చెప్పులతో కొడతాం’

Published Thu, Mar 9 2017 2:50 PM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

‘రాంగోపాల్ వర్మను చెప్పులతో కొడతాం’

‘రాంగోపాల్ వర్మను చెప్పులతో కొడతాం’

ముంబై: మహిళలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆయన వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మహిళలపై చేసిన వ్యాఖ్యలకు వర్మ క్షమాపణ చెప్పాలని ఎన్సీపీ నాయకురాలు విద్యా చవాన్ డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకుంటే వర్మను చెప్పులతో కొడతామని తీవ్రంగా హెచ్చరించారు.

మరోవైపు వర్మ సినిమాలకు పనిచేయకూడదని సినిమా సెట్టింగ్, దాని అనుబంధ కార్మికుల సంఘం నిర్ణయించింది. ఈ సంఘంలో 52 వేల మంది సినీ కార్మికులు ఉన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం వర్మ వివాదస్పద ట్వీట్ చేశారు. మహిళలను శృంగారతార సన్నీ లియోన్‌తో పోలుస్తూ అనుచిత ట్వీట్‌ చేయడంతో వివాదం రేగింది. మహిళలను కించపరిచేలా వర్మ వ్యాఖ్యలు చేశారని సామాజిక ఉద్యమకర్త విశాఖ మాంబ్రె గోవాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాంబ్రె ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement