సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరమంటూ ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి చేసిన ఓ ట్వీట్ దుమారం రేపుతోంది. దున్నపోతుల్ని తన్నుకుంటూ ఓ వ్యక్తి ట్రాలీలో ఎక్కిన వీడియోను పోస్ట్ చేసిన.. ఇది తెలంగాణ బీజేపీకి అవసరమంటూ క్యాప్షన్ ఉంచారు. ఆయన కాసేపటికే దానిని డిలీట్ చేసి.. మళ్లీ పోస్ట్ చేయడం గమనార్హం.
పైగా ఆ ట్వీట్‌కు అమిత్ షా, బీఎల్ సంతోష్, సునీల్ బన్సాల్ లాంటి అగ్రనేతలను ట్యాగ్ చేశారాయన. అయితే ఆయన ట్విటర్ వాల్‌పై ఆ పోస్ట్ కనిపించకపోవడంతో.. ఆయన దానిని డిలీట్ చేసినట్లు అర్థమైంది. ఆ వెంటనే మళ్లీ ఆ వీడియోను ఆయన పోస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో బీజేపీ గందరగోళ రాజకీయం నడిపిస్తోంది. పార్టీ కేడర్ సైతం అయోమయానికి గురవుతోంది. ఈ తరుణంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలంగాణ బీజేపీ నాయకత్వంపై అసంతృప్తితో రగిలిపోతున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ట్వీట్ తో పార్టీ పట్ల తన అసంతృప్తి చూపించారని కొందరు అంటుండగా.. పార్టీ మారతారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
This treatment is what's required for Bjp Telangana leadership.@blsanthosh @BJP4India @AmitShah @sunilbansalbjp @BJP4Telangana pic.twitter.com/MMeUx7fb4Q
— AP Jithender Reddy (@apjithender) June 29, 2023
అయితే తన ట్వీట్‌ను సమర్థించుకునేలా మరో ట్వీట్ వెంటనే పోస్ట్ చేశారాయన.
కేసిఆర్ సోషల్ మీడియా ఊరకుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటిదంటే...
— AP Jithender Reddy (@apjithender) June 29, 2023
బండి సంజయ్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగ అర్థం చేసుకునే ఊరకుక్కల్లార... బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి
बीजेपी नेता और पूर्व सांसद @apjithender ने अपना ये ट्वीट क्यों डिलीट कर दिया ? pic.twitter.com/rxSnAmskBO
— Lutyens Media (@LutyensMediaIN) June 29, 2023
ఇదీ చదవండి: కేంద్రమంత్రిగా బండి.. ఈటలకేమో ఆ బాధ్యతలు?
Comments
Please login to add a commentAdd a comment