deleted tweets
-
దున్నపోతుని తన్నినట్లు.. జితేందర్‌రెడ్డి వరుస ట్వీట్ల కలకలం
సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్మెంట్ అవసరమంటూ ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి చేసిన ఓ ట్వీట్ దుమారం రేపుతోంది. దున్నపోతుల్ని తన్నుకుంటూ ఓ వ్యక్తి ట్రాలీలో ఎక్కిన వీడియోను పోస్ట్ చేసిన.. ఇది తెలంగాణ బీజేపీకి అవసరమంటూ క్యాప్షన్ ఉంచారు. ఆయన కాసేపటికే దానిని డిలీట్ చేసి.. మళ్లీ పోస్ట్ చేయడం గమనార్హం. పైగా ఆ ట్వీట్‌కు అమిత్ షా, బీఎల్ సంతోష్, సునీల్ బన్సాల్ లాంటి అగ్రనేతలను ట్యాగ్ చేశారాయన. అయితే ఆయన ట్విటర్ వాల్‌పై ఆ పోస్ట్ కనిపించకపోవడంతో.. ఆయన దానిని డిలీట్ చేసినట్లు అర్థమైంది. ఆ వెంటనే మళ్లీ ఆ వీడియోను ఆయన పోస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో బీజేపీ గందరగోళ రాజకీయం నడిపిస్తోంది. పార్టీ కేడర్ సైతం అయోమయానికి గురవుతోంది. ఈ తరుణంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలంగాణ బీజేపీ నాయకత్వంపై అసంతృప్తితో రగిలిపోతున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ట్వీట్ తో పార్టీ పట్ల తన అసంతృప్తి చూపించారని కొందరు అంటుండగా.. పార్టీ మారతారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. This treatment is what's required for Bjp Telangana leadership.@blsanthosh @BJP4India @AmitShah @sunilbansalbjp @BJP4Telangana pic.twitter.com/MMeUx7fb4Q — AP Jithender Reddy (@apjithender) June 29, 2023 అయితే తన ట్వీట్‌ను సమర్థించుకునేలా మరో ట్వీట్ వెంటనే పోస్ట్ చేశారాయన. కేసిఆర్ సోషల్ మీడియా ఊరకుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటిదంటే... బండి సంజయ్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగ అర్థం చేసుకునే ఊరకుక్కల్లార... బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి — AP Jithender Reddy (@apjithender) June 29, 2023 बीजेपी नेता और पूर्व सांसद @apjithender ने अपना ये ट्वीट क्यों डिलीट कर दिया ? pic.twitter.com/rxSnAmskBO — Lutyens Media (@LutyensMediaIN) June 29, 2023 ఇదీ చదవండి: కేంద్రమంత్రిగా బండి.. ఈటలకేమో ఆ బాధ్యతలు? -
రవితేజ ‘నెక్స్ట్’.. రచ్చ కాకూడదనే!
సాక్షి, సినిమా : మాస్ మహారాజ్ రవితేజ చేసిన ఓ పని సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. తాజా చిత్రం టచ్ చేసి చూడు ప్రమోషన్లో భాగంగా గురువారం రవితేజ అభిమానులతో ట్విటర్లో చిట్ ఛాట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు మాస్ రాజా సమాధానం ఇవ్వటం... వెంటనే దానిని తొలగించటం చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ గురించి ‘ఒక్క ముక్కలో’ చెప్పండంటూ ఓ పవన్ వీరాభిమాని రవితేజను కోరాడు. దీనికి వెంటనే రవితేజ ‘నెక్స్ట్’ అంటూ బదులిచ్చి మరో ప్రశ్నకు వెళ్లిపోయాడు. అయితే తర్వాత ఏమైందో తెలీదుగానీ ఆ ట్వీట్‌ను మాస్ రాజా తొలగించేశాడు. కానీ, అప్పటికే కొందరు ఆ ట్వీట్‌ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటం ప్రారంభించేశారు. వివాదాస్పదం కావటం ఇష్టం లేకనే రవితేజ ఆ ట్వీట్‌ను తొలగించినప్పటికీ.. ముందే అలాంటి సమాధానం ఇవ్వకుండా ఉండాల్సిందని పలువురు విమర్శిస్తున్నారు. మరికొందరేమో మాస్ రాజాకు మద్ధతుగా.. అది కాకతాళీయంగా జరిగిపోయిందని.. అప్పట్లో ఓ టీవీషోలో మల్టీస్టారర్ పవన్‌తోనే చేస్తానన్న రవితేజ కామెంట్లను ప్రస్తావిస్తున్నారు. ఏది ఏమైనా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో స్పందించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలన్న విషయం మరోసారి రుజువైంది. అడుసు తొక్కనేలా.. కాళ్లు కడగనేలా! -
ఆ ట్వీట్లు మళ్లీ వస్తాయి!
న్యూయార్క్: రాజకీయ నాయకులకు మింగుడు పడని వార్త. ట్విటర్ లో పోస్ట్ చేసి, తొలగించిన వివాదస్పద ట్వీట్స్ మళ్లీ ప్రజల చేతుల్లోకి రానున్నాయి. ఈ మేరకు ట్విటర్ తో పొలిట్ వూప్స్ వెబ్ సైట్ ఒప్పందం కుదుర్చుకుంది. తాము ట్విటర్ ద్వారా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం కాగానే రాజకీయ నాయకులు వాటిని వెంటనే తొలగిస్తున్నారు. దీంతో అసలు వారేమన్నారో ప్రజలకు తెలియకుండా పోతోంది. ఇలా తొలగించిన ట్వీట్లను పొలిట్ వూప్స్ ద్వారా తిరిగి పొందవచ్చు. భారత్, అమెరికా, ఫ్రాన్స్, కెనడా సహా 30 దేశాల్లో ఈ సేవలను మళ్లీ ప్రారంభించనుందని సీనెట్ డాట్ కామ్ వెల్లడించింది. అమెరికాకు చెందిన సన్ లైట్ ఫౌండేషన్ నడుపుతున్న పొలిట్ వూప్స్ వైబ్ సైట్ ను నెదర్లాండ్ కు చెందిన పారదర్శక సంస్థ ఓపెన్ స్టేట్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. పొలిట్ వూప్స్ ఇంతకుముందు ఈ సేవలు అందించింది. అయితే తొలగించిన ట్వీట్లకు సంబంధించిన కోడ్ ఇచ్చేందుకు ట్విటర్ నిరాకరించడంతో గతేదాడి నుంచి ఈ సేవలు నిలిచిపోయాయి. ట్విటర్ సీఈవో జాక్ డోర్సెతో పలు దఫాలుగా తాము జరిపిన చర్చలు ఫలించడంతో మరోసారి ఈ సేవలు ప్రారంభించనున్నామని ఓపెన్ స్టేట్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. సమాచారం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని పేర్కొంది. అయితే ట్విటర్ లో తొలగించిన ట్వీట్లను తిరిగి పోస్ట్ చేస్తుందా అనేది స్పష్టం కాలేదు.