న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సోషల్‌మీడియా చీఫ్ దివ్య స్పందన అలియాస్ రమ్య గురువారం వివాదాస్పద ట్వీట్ చేశారు. ప్రధాని మోదీని పక్షి రెట్టతో పోల్చుతూ ఆమె చేసిన ట్వీట్‌పై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడగా, కాంగ్రెస్ పార్టీ మౌనం దాల్చింది. గుజరాత్‌లో నర్మదా నదీతీరాన బుధవారం సర్దార్ పటేల్ స్మృత్యర్థం నిర్మించిన 182 మీటర్ల ఎత్తయిన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని మోదీ బుధవారం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నలుపురంగులో ఏర్పాటుచేసిన ఈ విగ్రహం దగ్గర తెల్లటి దుస్తులతో మోదీ ఫొటోలు దిగారు. పటేల్ విగ్రహం కాళ్లదగ్గర మోదీ నిలబడ్డ ఫొటోను ట్విట్టర్‌లో పంచుకున్న రమ్య..‘అది పక్షి రెట్టేనా?’ అని ట్వీట్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నిజమైన సంస్కృతి ఇదేనని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మండిపడ్డారు. మరోవైపు తన ట్వీట్‌ను సమర్థించుకున్న దివ్య.. దీనిపై వివరణ ఇవ్వబోననీ, అది అడిగే అర్హత బీజేపీ నేతలకు లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment