సన్నీ లియోన్‌కు క్షమాపణలు | Rakhi Sawant Finally Apologies to Sunny Leone | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 4 2018 10:22 AM | Last Updated on Mon, Aug 20 2018 2:50 PM

Rakhi Sawant Finally Apologies to Sunny Leone - Sakshi

రాఖీ సావంత్‌.. పక్కన కూతురితో సన్నీ లియోన్‌

సాక్షి, ముంబై: మాజీ శృంగార తార, బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌కు నటి రాఖీ సావంత్‌ క్షమాపణలు చెప్పారు. గతంలో సన్నీని టార్గెట్‌ చేసి రాఖీ తీవ్రంగా దూషించిన విషయం తెలిసిందే. సన్నీ రాకతో భారతీయ చిత్ర పరిశ్రమ భ్రష్టుపట్టే అవకాశం ఉందని ఓ ఆల్బమ్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో రాఖీ మండిపడ్డారు. బూతు సినిమాలు చేసుకునే సన్నీ తక్షణమే బాలీవుడ్‌ను, ఇండియాను విడిచిపోవాలంటూ రాఖీ అల్టిమేటం జారీ చేశారు కూడా.  ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలో  కూడా సన్నీపై విచిత్రమైన ఆరోపణలు చేస్తూ వస్తున్న రాఖీ.. ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. 

‘సన్నీ గురించి నాకు ఏం తెలుసని నేను అలా మాట్లాడానో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అది ముమ్మాటికీ నా పొరపాటే. ఆమె గతం, జీవన ప్రయాణం నాకు అవసరం లేని విషయాలు. ప్రస్తుతం ఆమె ఏంటన్నది ముఖ్యం. పిల్లలను దత్తత తీసుకోవటం, సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్న సన్నీ చాలా గొప్పది. ఆమెను చూస్తుంటే గర్వంగా ఉంది. ఆమెపై అనవసరంగా తప్పుడు వ్యాఖ్యలు చేశా. ఆమె జీవితాన్ని నిర్ణయించడానికి అసలు నేనెవర్ని? ఇప్పుడు సమయం దొరికింది కాబట్టి ఆమెకు అందరి ముందు క్షమాపణలు చెబుతున్నా’ అని రాఖీ సావంత్‌ తెలిపారు. 

అంతకుముందు ఓ ప్రముఖ ఛానెల్‌ చిట్‌ఛాట్‌ షోలో మోడల్‌ అర్షి ఖాన్‌తోపాటు పాల్గొన్న రాఖీ సన్నీపై చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చెప్పారు. మరోవైపు అర్షి ఖాన్‌ కూడా ఇదే షోలో అఫ్రిదీపై చేసిన వివాదాస్పద ట్వీట్‌పై తప్పు ఒప్పుకున్న విషయం విదితమే. (‘శృంగారం’ ట్వీట్‌.. నా పొరపాటే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement