Karthi Viruman Movie Unit Celebrates Success: కోలీవుడ్ హీరో కార్తీ కథానాయకుడిగా 2డీ ఎంటర్ టైన్‌మెంట్ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మించిన చిత్రం 'విరుమాన్'. 'కొంబన్' చిత్రం తరువాత ముత్తయ్య దర్శకత్వంలో కార్తీ నటించిన చిత్రం ఇది. దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్ కథానాయికగా పరిచయం అయిన ఈ చిత్రంలో రాజ్‌కిరణ్ , ప్రకాష్‌రాజ్, సూరి, కరుణాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని తమిళనాడులో శక్తి ఫిలింస్ సంస్థ విడుదల చేసింది.
గత శుక్రవారం (ఆగస్టు 12) చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో ముఖ్యంగా రాగద్వేషాల ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం మిశ్రమ స్పందనతో ప్రదర్శింపబడుతోంది. అయితే టాక్‌కు అతీతంగా ఈ చిత్రం తొలిరోజే రూ. 7 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. దీంతో 'విరుమాన్' చిత్ర యూనిట్ శనివారం (ఆగస్టు 13) చిత్ర కార్యాలయంలో సక్సెస్ పార్టీని జరుపుకుంది. చిత్ర కథానాయకుడు కార్తీ, దర్శకుడు ముత్తయ్య, శక్తి ఫిలింస్ శక్తివేల్, చిత్ర సహ నిర్మాత రాజశేఖర్, కర్పూర సుందర పాండియన్ తదితరులు కేక్ కట్ చేసి సంతోషం పంచుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ విజయానందంలో మునిగి తేలుతోంది.
చదవండి: బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్
1947లో పుట్టుక.. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మరణించిన నటి
థియేటర్లలో 4 చిత్రాలు, ఓటీటీలో ఎన్నో..
Comments
Please login to add a commentAdd a comment