![Malli Malli Chusa Success Meet - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/21/malli-malli-chusaa.jpg.webp?itok=oPalHUov)
శ్వేత అవస్తి, అనురాగ్ కొణిదెన
అనురాగ్ కొణిదెన హీరోగా పరిచయమైన చిత్రం ‘మళ్ళీ మళ్ళీ చూశా’. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్స్‌గా నటించారు. హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. సక్సెస్ మీట్‌లో హేమంత్ కార్తీక్ మాట్లాడుతూ– ‘‘చాలా సంవత్సరాలుగా దర్శకత్వం అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. వయసు కాదు.. ప్రతిభే ముఖ్యం అని నమ్మిన కోటేశ్వరరావుగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాకుండా మంచి సినిమాలను ఎప్పుడూ ప్రోత్సహించే మీడియా రంగంలో నేను ఉన్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ పాలకుర్తి. ‘‘మాకు ఎంతో సహకారం అందించిన మైత్రీ మూవీస్ రవిగారు, నిర్మాత అనిల్ సుంకరగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు అనురాగ్ కొణిదెన. లిరిసిస్ట్ తిరుపతి జవాన్, హీరోయిన్ శ్వేతా అవస్తి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment