
సాక్షి, సినిమా : టాలీవుడ్‌లో టాలెంటెడ్ నటుడిగా శ్రీ విష్ణుకి మంచి పేరుంది. సపోర్టింగ్ పాత్రలతోపాటు అప్పట్లో ఒకడుండేవాడు.. మెంటల్ మదిలో చిత్రాల్లో లీడ్ క్యారెక్టర్లతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. తాజాగా అతను నటించిన నీది నాది ఒకే కథ చిత్ర ట్రైలర్ విడుదలైంది.
చదువుల్లో పూర్ అయిన ఓ వ్యక్తి.. టీచర్ అయిన తన తండ్రి మెప్పుపొందేందుకు చేసే ప్రయత్నమే నీది నాది ఒకే కథ. ఇంట్రో నుంచే ట్రైలర్‌ను ఆసక్తికరంగా చూపించారు. చిత్తూరు స్లాంగ్‌లో విష్ణు నటన ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా హీరోయిన్ సట్నా టైటస్(బిచ్చగాడు ఫేం) మధ్య నడిచే సన్నివేశాలు ఫన్నీగా ఉన్నాయి. తర్వాత ఎమోషనల్ మోడ్‌లోకి మారిపోయిన ట్రైలర్.. చివర్లో ‘ఎప్పుడు చస్తామో తెలీని ఈ బొంగులో లైఫ్‌లో ఏంట్రా మీ సోదంతా’ అంటూ సీరియస్ డైలాగ్‌తో ముగించారు.
నారా రోహిత్ సమర్పణలో ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. మార్చి 23న నీది నాది ఒకే కథ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment