సింగిలే అంటున్న కార్తికేయ.. | The Third Song Singilu Singilu From 90ML Is Out Now | Sakshi
Sakshi News home page

సింగిలే అంటున్న కార్తికేయ..

Published Sat, Nov 16 2019 7:47 PM | Last Updated on Sat, Nov 16 2019 7:56 PM

The Third Song Singilu Singilu From 90ML Is Out Now  - Sakshi

హైదరాబాద్‌ : ఆర్‌ఎక్స్‌ 100 ఫేం కార్తికేయ హీరోగా సరస్వతి శుక్లా సమర్పణలో కార్తికేయ క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న 90 ఎంఎల్‌ మూవీ నుంచి మూడో పాట శనివారం విడుదలైంది. సింగిలుసింగిలు అంటూ సాగే ఈ పాట యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. అశోక్‌ రెడ్డి గుమ్మకొండ నిర్మాణ సారథ్యంలో యర్రా శేఖర్‌రెడ్డి నిర్ధేకత్వంలో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఆర్‌ఎక్స్‌ 100 తరహాలో బోల్డ్‌ మూవీగా యూత్‌ను టార్గెట్‌ చేస్తూ ఈ సినిమాను మేకర్లు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. కార్తికేయ సరసన నేహ సోలంకి నటిస్తున్న 90 ఎంఎల్‌ పూర్తి కమర్షియల్‌ హంగులను అద్దుకుని  డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement