90 ML Movie
-
సేఫ్ జానర్లో వెళ్లాలనుకోను
‘‘విభిన్న జానర్స్‌లో సినిమాలు చేయడానికి ఇష్టపడతా. సేఫ్ జానర్ అంటూ ఒకే రకమైన పాత్రలు చేయాలనుకోవడం లేదు. ఎలాంటి పాత్రౖకైనా కార్తికేయ నటుడిగా న్యాయం చేయగలడు అని రచయితలు నమ్మాలన్నదే నా లక్ష్యం ’’ అన్నారు కార్తికేయ. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకత్వంలో కార్తికేయ హీరోగా రూపొందిన చిత్రం ‘90ఎమ్ఎల్’. అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న రిలీజైంది. ఈ సందర్భంగా కార్తికేయ చెప్పిన విశేషాలు. ► ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రతి రివ్యూలోనూ కార్తికేయ పెర్ఫార్మెన్స్ బాగుందంటున్నారు. సోషల్ మీడియాలోనూ సినిమా గురించి పాజిటివ్ కామెంట్సే కనిపిస్తున్నాయి. విడుదల రోజు రెండు థియేటర్స్‌కు వెళ్లాను. అక్కడ ఆడియన్స్ క్లాప్స్ కొడుతూ, విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేయడం చూశాక చాలా హ్యాపీ ఫీలయ్యాను. థియేటర్లో సినిమా చూడటానికి వచ్చిన ఆడియన్స్ లాజిక్‌లు గురించి ఆలోచించకుండా నవ్వుకోవాలనుకుని ఈ సినిమా తీశాం. అందులో సక్సెస్ అయ్యామనే అనుకుంటున్నాం. ► ‘90 ఎమ్ఎల్’ అని టైటిల్ పెట్టడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అవుతారనుకోవడం లేదు. టైటిల్ ఆసక్తిగా ఉంటుందని సినిమా చూస్తారనుకున్నాం. అలాగే చూస్తున్నారు. ఆర్ఎక్స్ 100, హిప్పి, గుణ 369 చితాల్లో నాకు పెద్దగా డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు. అది ఈ చిత్రంతో కుదిరింది. చిన్న సెన్సార్ సమస్య వల్ల సినిమా ఒక రోజు ఆలస్యంగా విడుదలైంది. సినిమాలో ఆల్కహాల్ బ్రాండ్ పేర్లు చెప్పాల్సిన సన్నివేశాల్లోని పదాలను బీప్ చేశాం. ఎటువంటి అసభ్యకరమైన పదజాలం సినిమాలో లేదు. ► నాకు కథ నచ్చే సినిమాను స్టార్ట్ చేస్తా. నా జడ్జ్మెంట్ అన్నిసార్లూ సరైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అప్పుడు తప్పు ఎక్కడ జరిగిందో విశ్లేíషించుకుంటాను. నేను ఎంపిక చేసుకున్న కథలతో తెరకెక్కిన సినిమాలు విజయం సాధించినా, సాధించకపోయినా నా ఎంపికల్లో ఒక సర్ప్రైజ్ మాత్రం ఉంటుంది. ► ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’లో నేను చేసిన విలన్ పాత్రకు మంచి స్పందన వచ్చింది. మరిన్ని విలన్ పాత్రలు చేయాలని ఉంది. కానీ అవి నన్ను ఎగ్జైట్ చేసేలా ఉండాలి. ప్రస్తుతం 2 సినిమాల్లో హీరోగా నటిస్తున్నా. -
90 ఎంఎల్ : మూవీ రివ్యూ
టైటిల్: 90ఎంల్ నటీనటులు: కార్తికేయ, నేహా సోలంకి, రవికిషన్, రోల్‌రైడా, కాలకేయ ప్రభాకర్, రావూ రమేష్,అలీ, పోసాని కృష్ణమురళి, సత్యరాజ్ సంగీతం: అనూప్ రూబెన్స్ దర్శకుడు: ఎర్ర శేఖర్‌రెడ్డి నిర్మాణ సంస్థ: కార్తికేయ క్రియేటివ్ వర్క్ ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్లోకి దూసుకెచ్చిన యువకెరటం కార్తికేయ. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ కావడంతో కార్తికేయకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత హిప్పీ, గుణ 369 వంటి సినిమాలు చేసిన ఈ యంగ్ హీరో సరైన సక్సెస్‌ను అందుకోలేదు. ఈ క్రమంలో ‘90ఎంఎల్’ అంటూ డిఫరెంట్ టైటిల్‌తో తెరమీదకు వచ్చాడు కార్తీకేయ. రోజుకు మూడుపూటల మందు వేస్తే తప్ప మనుగడ సాగించని ఓ యువకుడి కథ అంటూ ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేక్షకులపైకి వదిలారు. ఇంతకు ఈ మందుబాబు కథేంటో తెలుసుకుందాం పదండి.. కథ: పార్వతీనగర్‌కు చెందిన దేవదాస్ (కార్తికేయ).. ఓ అరుదైన వ్యాధి వల్ల రోజూ మూడుపూటలు 90 ఎంఎల్ లిక్కర్ తాగాల్సిన విచిత్రమైన స్థితి అతనిది. ఈ వ్యాధి వల్ల కన్న తల్లిదండ్రులే మద్యం తాగమని అతన్ని బతిలాడుతుంటారు. అలాంటి దేవ్‌దాస్ సాహసాన్ని సోషల్ మీడియా ద్వారా చూసిన సువాసన (నేహా సోలంకి) అతన్ని ఇష్టపడుతుంది. ఇద్దరు ప్రేమించుకుంటారు. సువాహన కుటుంబానికి మద్యం అంటేనే పరమ అసహ్యం. ఆమె తండ్రి ట్రాఫిక్ పోలీసు. మరోవైపు జాన్విక్ (రవికిషన్) కూడా మద్యం వ్యసనపరుడే. మద్యం తాగి ఓసారి జాన్విక్ ఇంటికి వెళ్లిన దేవ్‌దాస్ కొన్ని కారణాల వల్ల అతన్ని చితకబాదుతాడు. ఈ క్రమంలో సువాహనకు దేవ్‌దాస్ మద్యం తాగే విషయం తెలిసి అతనితో బ్రేకప్ చేసుకుంటుంది. అతను ఎందుకు మద్యం తాగుతున్నాడో సువాహనకు తెలుసుకోదు. ఇంకోవైపు మద్యంలో మత్తులో ఉన్నప్పుడు తనను ఎవరు కొట్టారు? ఎందుకు కొట్టారు? తెలుసుకునేందుకు జాన్విక్ ప్రయత్నిస్తుంటాడు. అసలు జాన్విక్-దేవ్దాస్కు మధ్య ఏం జరిగింది? ఒక్క పూట 90 ఎంఎల్ తాగకుంటే చచ్చిపోయే స్థితిలోని దేవదాస్ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు. ఈ క్రమంలో జాన్విక్, అతని గ్యాంగ్ నుంచి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడన్నది మిగతా కథ. విశ్లేషణ: కొత్త దర్శకుడు యెర్ర శేఖర్‌రెడ్డి ఒకింత భిన్నమైన కథతో కమర్షియల్ హంగులతో మాస్, యూత్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ మాస్‌మసాలా కథను సిద్ధంచేసినట్టు కనిపిస్తోంది. సినిమాటిక్‌గా, కామెడీపరంగా సినిమా బావుంది. కామెడీ సీన్లు నవ్వించేలా ఉన్నాయి. హీరోహీరోయిన్లు కార్తికేయ, సోలంకీ చాలా ఎనర్జీటిక్గా యాక్ట్ చేశారు. సినిమాటోగ్రఫి, నేపథ్య సంగీతం, పాటలు బావున్నాయి. రవికిషన్, కాలకేయ ప్రభాకర్, రావూ రమేశ్, సత్యరాజ్, పోసాని కృష్ణమురళి, రోల్‌రైడా తమ పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. నిర్మాణ విలువులు చిత్రస్థాయికి తగ్గట్టు ఉన్నాయి. కానీ, బలమైన కథ, కథనాలు సినిమాలో లేకపోవడం, ఎక్కువగా సినిమాటిక్‌గా, సెకండాఫ్ కొంత బోర్ కొట్టించడం మైనస్ పాయింట్‌గా అనిపిస్తుంది. ఈ సినిమా మూలకథనే మద్యం మీద ఆధారపడి ఉంది. ఒకప్పుడు దేవదాసు సినిమాలో ప్రేమలో విఫలమై గుండెల్ని పిండేసే బాధను దిగమింగలేక మద్యానికి బానిసై.. జగమే మాయా, బతుకే మాయ అని పాడుకుంటే ప్రేక్షకులు కూడా ఆ పాత్రలో లీనమై దుఃఖించారు. కథపరంగా చూసుకుంటే ఈ సినిమాలోని హీరోది పెద్ద సమస్యే. ఒక్క పూట మద్యం తాగకపోయినా చచ్చిపోయే పరిస్థితి ఉండటం హీరో పట్ల సానుభూతి కల్పించేదే. కానీ, సినిమాలో కమర్షియల్ పంథాలో మాస్ అంశాలను దృష్టిలో పెట్టుకొని మద్యం సేవించడాన్ని కొంత గ్లోరిఫై చేసినట్టు కనిపిస్తుంది. సమాజం మీద ఎంతో విషప్రభావం చూపుతున్న మద్యం నేపథ్యంగా సినిమాను తీసినప్పుడు దర్శకుడు కమర్షియల్, మాస్ అంశాలే కాకుండా ఇంకాస్త సెన్సిబుల్‌గా ఆలోచించి.. సమాజానికి ఏదైనా చెబితే బాగుండేనేమోనని ప్రేక్షకులకు అనిపించవచ్చు. ఎందుకంటే సినిమా వినోద సాధనమే కాదు బలమైన మాద్యమం కూడా. సినిమా తెర నిండా ‘పొగ త్రాగుట, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం’ అన్న ట్యాగ్ తప్ప.. మద్యం వల్ల జరిగే ఏ చెడు గురించి సినిమా పెద్దగా ఫోకస్ చేసినట్టు కనిపించదు. సినిమాలో ‘రేప్’ మీద జోక్ వినిపించడం ఇన్సెన్సిటివ్గా అనిపిస్తుంది. బలాలు హీరోహీరోయిన్ల నటన కామెడీ చిత్ర నిర్మాణ విలువలు బలహీనతలు బలమైన కథ, కథనాలు లేకపోవడం మరీ సినిమాటిక్‌గా ఉండటం - శ్రీకాంత్ కాంటేకర్ -
90 ఎంఎల్ ఆరోగ్యకరమైన కిక్ ఇస్తుంది
‘‘ఆర్ఎక్స్ 100’ తర్వాత మా అమ్మానాన్న, బాబాయ్ మరోసారి నన్ను సపోర్ట్ చేశారు. వాళ్లే నా బ్యాక్‌గ్రౌండ్. ‘ఆర్ఎక్స్ 100’ తో డబుల్ ప్రాఫిట్స్ అందుకున్నాం, ఈ సినిమాతో మూడింతల లాభాలు అందుకుంటాం’’ అన్నారు కార్తికేయ. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వంలో కార్తికేయ, నేహా సోలంకి నటించిన చిత్రం ‘90 ఎంఎల్’. అశోక్ గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమా ఈనెల 5న విడుదలకానుంది. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో కార్తికేయ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారి సినిమాలు చూసి హీరో అవ్వాలనుకున్నాను. నా దృష్టిలో చిరంజీవి, మహేశ్‌బాబు నిజమైన హీరోలు. వారే నాకు స్ఫూర్తి. ఈ సినిమాకోసం శేఖర్ చాలా కష్టపడ్డాడు. హీరోగా, విలన్‌గా చేసినా ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ సినిమా ‘90 ఎంఎల్’ కాదు. 900 ఎంఎల్ కిక్ ఇస్తుంది. ఆరోగ్యకరమైన కిక్ ఇస్తుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా సక్సెస్ సాధించాలి. కార్తికేయతో మరో సినిమా చేస్తాను’’ అన్నారు ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి. ‘‘కార్తికేయ చాలా కష్టపడతాడు’’ అన్నారు హీరో సందీప్ కిషన్. ‘‘ఈ సినిమాతో కార్తికేయ ఇంకా పెద్ద రేంజ్‌కి వెళ్లాలి’’ అన్నారు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. ‘‘ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నాకు అండగా నిలబడిన కార్తికేయగారికి థ్యాంక్స్’’ అన్నారు శేఖర్ రెడ్డి. ‘‘కార్తికేయతో ఇంకో సినిమా చేయాలనుంది’’ అన్నారు నేహా సోలంకి. -
‘90 ఎంఎల్’ సాంగ్‌కు చిందేసిన యువ హీరోలు
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘90 ఎం.ఎల్’. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ వేడుకకు అతిథిగా హాజరైన హీరో సందీప్ కిషన్, కార్తీకేయతో కలిసి చిందులేశారు. 90 ఎంఎల్ చిత్రంలోని టైటిల్ సాంగ్‌కు సందీప్, కార్తికేయ ఫుల్ జోషుగా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రవికిషన్, రావు రమేష్, అజయ్, ఆలీ, ప్రగతి, ప్రవీణ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. -
‘90 ఎంఎల్’ ప్రీ రిలీజ్ వేడుక
-
పాట ఎక్కడికీ పోదు
‘‘ఏదైనా చక్కటి పాట విన్నప్పుడు దాన్ని ప్రేరణగా తీసుకొని మనదైన స్టయిల్లో ఒక కొత్త ట్యూన్‌ని సిద్ధం చేసుకోవడాన్ని కాపీ కొట్టడం అని అనుకోను. ఒకవేళ మక్కీకి మక్కీ దించేస్తే కాపీయే అంటారు. నేనెప్పుడూ కాపీ కొట్టలేదు. కొట్టను కూడా’’ అని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అన్నారు. కార్తికేయ, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘90 ఎంఎల్’. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకత్వంలో అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ చెప్పిన విశేషాలు. ► నేను మందు తాగను. కానీ శేఖర్ రెడ్డి ‘90 ఎం.ఎల్’ చిత్రకథను చెప్పినప్పుడు మందు తాగినంత కిక్ ఎక్కింది. ఎంత బాగా కథ చెప్పాడో అంతే బాగా చిత్రీకరించాడు కూడా. పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కించాడు. ఈ సినిమా కోసం ఫుల్ మాస్ ఆల్బమ్‌ను రూపొందించాను. ఇందులో ఆరు పాటలుంటాయి. ఒక బిట్ సాంగ్ కూడా ఉంటుంది. ఈ మాస్ సాంగ్స్‌కి కార్తికేయ వేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ► నా హిట్ ఆల్బమ్స్‌లో ఎక్కువగా మెలోడీలు ఉండటంతో మాస్ సినిమాలకు పనిచేసే అవకాశం పెద్దగా రాలేదు అనుకుంటున్నాను. సంగీతం సమకూర్చేప్పుడు సినిమా పెద్దదా, చిన్నదా అనేది పట్టించుకోను. కథానుసారంగా ట్యూన్స్ కంపోజ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. స్టార్ హీరోలతో పని చేసేప్పుడు వాళ్ల ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుంటాను. మనం మంచి మ్యూజిక్ ఇచ్చినా కొన్నిసార్లు సినిమాలు సరిగ్గా ఆడకపోవచ్చు. అప్పుడు మన శ్రమ వృథా అవుతుంది. ఆ సమయంలో కొంచెం బాధపడతాను. ► ఈ మధ్య కొన్ని పెద్ద ప్రాజెక్ట్‌లు మిస్సయ్యాయి. అందుకే కొంత గ్యాప్ వచ్చింది. ఎప్పుడేం జరుగుతుందో మన చేతుల్లో ఉండదు కాబట్టి బాధపడను. ► కొత్త సంగీతం వస్తోంది. ప్రేక్షకులు మ్యూజిక్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి పాటలు ఉంటే థియేటర్స్‌కు వస్తున్నారు. మరోవైపు కార్తీ నటించిన ‘ఖైదీ’ లాంటి సినిమా చూసి ‘భవిష్యత్తులో పాటలు లేని సినిమాలే ఉంటే సంగీత దర్శకులకు దెబ్బే’ అని కొందరు అంటున్నారు. భారతీయ సినిమాల్లో నుంచి పాట ఎక్కడికీ పోదు. పాట లేని సినిమా అయినా నేపథ్య సంగీతం కావాలి. అదీ సంగీతదర్శకుడి పనే. మన సినిమాల్లో పాటలు పక్కా ఉండాలని ఓ సందర్భంలో షారుక్ ఖానే అన్నారు. ► ప్రస్తుతం రాజ్ తరుణ్ నటిస్తున్న ‘ఓరేయ్ బుజ్జిగా’ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను. -
ఇది తాగుబోతుల సినిమా కాదు
‘‘కొందరు ప్రేక్షకులకు కుటుంబకథా చిత్రాలు నచ్చుతాయి. మరికొందరికి యాక్షన్, ఇంకొందరికి థ్రిల్లర్.. ఇలా డిఫరెంట్ జానర్ ఆడియన్స్ ఉంటారు. అన్ని రకాల పేక్షకులను సంతృప్తిపరచేలా సినిమా తీయడం చాలా కష్టం. కానీ ఈ విషయంలో నా ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటాను’’ అన్నారు శేఖర్‌రెడ్డి. కార్తికేయ, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘90 ఎంఎల్’. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకత్వంలో అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శేఖర్ చెప్పిన విశేషాలు. ► నేను నల్గొండ జిల్లా లింగరాజుపల్లిలో పుట్టాను.. హైదరాబాద్‌లో పెరిగాను. ఆసక్తితో సినిమా రంగంవైపు వచ్చాను. చంద్రమహేశ్‌గారి దగ్గర అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశాను. కొన్ని సినిమాలకు రచయితగా కూడా ఉన్నాను. నాలో డైరెక్షన్, రైటింగ్ ఇలా రెండు స్కిల్స్ ఉన్నాయి. ► ‘90ఎంఎల్’ దర్శకునిగా నా తొలి సినిమా. టైటిల్ వినగానే ఇది లిక్కర్ నేపథ్యంలో సాగే చిత్రం అని కొందరు ఊహించుకుంటారు. కానే కాదు. ఇది తాగుబోతుల సినిమా కాదు. భావోద్వేగ అంశాలకు వాణిజ్యపరమైన అంశాలు జోడించి ఈ సినిమాను తెరకెక్కించాం. మంచి వినోదాత్మకంగా ఉంటుంది. ► తన పిల్లాడికి పాలు ఇవ్వాల్సిన తల్లికి.. లిక్కర్ ఇవ్వాల్సి వస్తే ఆ తల్లి మనసు ఎంత బాధపడుతుందో సినిమాలో చూపించాం. అంతేకానీ మందు సీన్లు పెట్టలేదు. మందు తాగమని ప్రోత్సహించే సన్నివేశాలను తెరకెక్కించలేదు. ► మందు తాగకపోతే బతకలేని ఓ డిజార్డర్ ఉన్న వ్యక్తి దేవదాసు పాత్రలో కార్తికేయ నటించారు. అసలు లిక్కర్ వాసన అంటేనే పడని ఓ కుటుంబంలోని అమ్మాయితో దేవదాసు ప్రేమలో పడతాడు. అప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయన్న అంశాలు సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. ► తమిళంలో మా సినిమా టైటిల్‌తోనే ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాకు, మా సినిమాకు ఏ సంబంధం లేదు. అలాగే మా ‘90 ఎంఎల్’ చిత్రంపై ‘ఆర్ఎక్స్ 100’ సినిమా ప్రభావం పడదు. టైటిల్ వల్ల మా సినిమాకు ప్రేక్షకులు దూరంగా ఉంటారు అంటే నేను కాదనే అంటాను. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ షో పడగానే కథ, సినిమా టాక్ బయటకు వచ్చేస్తుంది. మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. ► నిర్మాత అశోక్రెడ్డిగారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. నా నెక్ట్స్ సినిమా గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. -
‘90 ఎంఎల్’ మూవీ వర్కింగ్ స్టిల్స్
-
‘నా మందు తాగి నన్నే కొడతాడా.. వదలను’
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘90 ఎంఎల్’. నేహా సోలంకి కథానాయిక. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వం వహించారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, సాంగ్స్ సినీ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘నాతో నువ్వుంటే చాలు’ అనే సాంగ్ యూత్‌కు ముఖ్యంగా లవర్స్‌కు తెగ కనెక్ట్ అయింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది. తాజాగా మూవీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘నీతో కలిసి చచ్చేంత ప్రేమ నాలో ఉంది.. నాతో కలిసి బతకాలన్న ఆలోచనే నీలో లేదు.. ఐ హేట్ యూ’అంటూ ట్రైలర్లో హీరోయిన్ పలికే మాటలు ప్రేమికుల మనసులను కదిలించేలా ఉంది. ‘కొందరకి మందు తాగడం సరదా.. మరికొందరికి అది వ్యసనం.. కానీ మీ బాబుకు అది అవసరం, ఏ జన్మలో ఏ యాగం చేశారో ఈ రాజావారు ఈ జన్మలో ఈ యోగంతో పుట్టారు’ఈ డైలాగ్‌లతో ఈ సినిమాకు 90 ఎంఎల్ అని టైటిల్ ఎందుకు పెట్టారో అర్థమవుతోంది. అదేవిధంగా స్టోరీ కూడా తెలిసిపోతోంది. ఇక తనకున్న వీక్నెస్తో ప్రేమలో పడిన కష్టాలు, అమ్మాయి కుటుంబసభ్యులతో ఎదురైన సంఘటనలు చూస్తుంటే సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఇక హీరోయిన్ హీరోను వదిలి వెళ్లిపోతుంటే ‘కన్నులు వదిలి కల వెళుతుందే.. గుండెను వదిలి లయ వెళుతుందే.. గుడినే వదిలి దేవత వెళుతుందే’ వచ్చే సాంగ్ సూపర్బ్. చివర్లో ‘నా మందు తాగి నన్నే కొడతాడా.. వదలను’అని విలన్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ముగుస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు నెటిజన్లు ఫిదా అవడంతో తెగ వైరల్ అవుతోంది. ఇక ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ సృష్టించిన కార్తికేయ తరువాత ఆ స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాడు. ఇటీవల గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రతినాయక పాత్రలో సక్సెస్ అయిన ఈ యంగ్ హీరో ‘90 ఎంఎల్’పై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. రవి కిషన్, రావూ రమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నాడు. -
‘ఇది నేను నిర్మిస్తున్న రెండో చిత్రం’
సాక్షి, ఖమ్మంమయూరిసెంటర్: ‘90 ఎంఎల్’ సినిమా హీరో, ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ బుధవారం ఖమ్మం నగరంలో సందడి చేశాడు. తాను నటించిన ‘90 ఎంఎల్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని ఖమ్మంలోని సీక్వెల్ రిసార్ట్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్తికేయ వేదికపై పాటలు పాడి అలరించాడు. అలాగే తన చిత్రాల్లోని డైలాగ్‌లు చెప్పి విద్యార్థుల్లో జోష్ నింపాడు. అమ్మాయిలు నృత్యాలు చేస్తూ, హీరోతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా ‘90 ఎంఎల్’ సినిమాపై కార్తికేయ ముచ్చటించాడు. ఇది తాను నటించిన 5వ చిత్రమని, తాము నిర్మిస్తున్న రెండో సినిమా అని తెలిపారు. హీరోతో కరచాలనం చేస్తున్న విద్యార్థినులు అలాగే ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తనకు వచ్చిన పేరు మరోసారి ‘90 ఎంఎల్’తో వస్తుందన్నాడు హీరో కార్తికేయ. 90 ఎంఎల్ సినిమాకి సంబంధించిన మూడు పాటలను ఇప్పటికే విడుదల చేశామని, పాటలు బాగా వచ్చాయని, అనూప్ రూబెన్స్ మంచి సంగీతాన్ని అందించారని అన్నారు. గురువారం సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 5వ తేదీన చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మంకు తాను రావడం ఇది మూడోసారని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఈవెంట్ ఆర్గనైజర్ రవికుల నారాయణ ప్రసాద్, శ్రీచైతన్య జూయనియర్ కళాశాలల ఏజీఎంలు చిట్టూరి బ్రహ్మం, జి.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సింగిలే అంటున్న కార్తికేయ..
హైదరాబాద్ : ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ హీరోగా సరస్వతి శుక్లా సమర్పణలో కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై తెరకెక్కుతున్న 90 ఎంఎల్ మూవీ నుంచి మూడో పాట శనివారం విడుదలైంది. సింగిలుసింగిలు అంటూ సాగే ఈ పాట యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాణ సారథ్యంలో యర్రా శేఖర్‌రెడ్డి నిర్ధేకత్వంలో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రూపొందుతోంది. ఆర్ఎక్స్ 100 తరహాలో బోల్డ్ మూవీగా యూత్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను మేకర్లు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. కార్తికేయ సరసన నేహ సోలంకి నటిస్తున్న 90 ఎంఎల్ పూర్తి కమర్షియల్ హంగులను అద్దుకుని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నవ్వులు పంచే 90 ఎం.ఎల్
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘90 ఎం.ఎల్’. నేహా సోలంకి కథానాయిక. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వం వహించారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమాని డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్‌ని శ్రీ వైష్ణవి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సొంతం చేసుకుంది. అశోక్‌రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ– ‘‘90.ఎంఎల్’ టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా కూడా వైవిధ్యంగా ఉంటుంది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో వాణిజ్య అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇటీవల అజర్బైజాన్లో మూడు పాటలు చిత్రీకరించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకున్నాయి’’ అన్నారు. ‘‘ఆర్ఎక్స్ 100’ లో కార్తికేయను చూడగానే ‘90 ఎంఎల్’ కథకి కరెక్టుగా సరిపోతాడనిపించింది. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా కార్తికేయకు ఈ పాత్ర కరెక్టుగా సరిపోయిందని అంటారు. యూత్‌ఫుల్‌గా సాగే సినిమా ఇది. అజర్బైజాన్లో చిత్రీకరించిన మూడు పాటలు సినిమాకు హైలైట్ అవుతాయి. ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు చాలా మంచి స్పందన వస్తోంది’’ అన్నారు శేఖర్ రెడ్డి ఎర్ర. రవికిషన్, రావు రమేష్, అజయ్, ఆలీ, ప్రగతి, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: జె.యువరాజ్. -
‘ఒక్క అడుగు నాతో వేస్తే చాలు’
‘ఒకసారి చూస్తే చాలు.. ఒకసారి నవ్వితే చాలు.. ఒక అడుగు నాతో వేస్తే చాలు.. ఒక రిప్లై ఇస్తే చాలు.. ఒక స్మైలీ పెడితే చాలు.. ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. నాతో నువ్వుంటే చాలు.. కోరుకోను ఇంకేం వరాలు’అంటూ సాగే ఈ పాట లవర్స్‌కు బాగా కనెక్ట్ అవుతోంది. అంతేకాకుండా వాట్సప్ స్టేటస్, కాలర్ ట్యూన్, రింగ్ ట్యూన్స్‌లలో ఈ పాట మార్మోగటం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగులో లవ్ సాంగ్స్ స్పెషలిస్ట్‌గా పేరు గాంచిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ పాటకు ట్యూన్ కట్టగా.. చంద్రబోస్ లిరిక్స్‌ను అందించాడు. ఈ పాటకు వీరిద్దరు ఒకెత్తయితే అద్నాన్ సమీ వాయిస్ ఈ పాటకు మరింత హైలెట్‌గా నిలిచింది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ నటిస్తోన్న ‘90 ఎం.ఎల్’ సినిమాలోని మరో లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట యూత్‌ను ముఖ్యంగా లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. చంద్రబోస్ అందించిన హార్ట్ టచింగ్ లిరిక్స్‌తో పాటు అద్నాన్ సమీ వాయిస్ ఎక్స్ట్రార్డినరీగా నిలిచింది. ఇక జానీ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ కూడా కొత్తగా ఉంది. ఓవరాల్‌గా అన్ని హంగులు జోడించి విడుదల చేసిన ఈ లిరికల్ సాంగ్ వీడియో నెట్టింట్లో రచ్చ చేస్తోంది. ఇక ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహా సోలంకి కథానాయికగా కనిపించనుంది. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ ఈ సినిమా నిర్మిస్తున్నారు. వాణిజ్య అంశాలతో వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే సినిమా విడుదల తేదీపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా ఈ చిత్రంలో రవికిషన్, రావు రమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్, ప్రగతి, ప్రవీణ్ తదితరులు నటించారు. -
‘ఇది లిక్కర్‌తో నడిచే బండి’
ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ సృష్టించిన కార్తికేయ తరువాత ఆ స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాడు. ఇటీవల గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రతినాయక పాత్రలో సక్సెస్ అయి ఈ యంగ్ హీరో ఇప్పుడు హీరోగా ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఆర్ఎక్స్ 100 నిర్మాతలు తెరకెక్కించిన 90 ఎంఎల్ సినిమాలో దేవదాసు పాత్రలో అలరించనున్నాడు. ఈ రోజు కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్లో సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు చిత్రయూనిట్. పూటకో 90 తాగే కేర్‌లేస్ కుర్రాడి పాత్రలో కార్తికేయ ఆకట్టుకున్నాడు. తన సొంత బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకు. కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్గా నటిస్తుండగా రవి కిషన్, రావూ రమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.