‘నా మందు తాగి నన్నే కొడతాడా.. వదలను’ | Kartikeya 90ml Telugu Movie Trailer Out | Sakshi
Sakshi News home page

‘గుండెను వదిలి లయ వెళుతుందే..’

Published Thu, Nov 21 2019 12:29 PM | Last Updated on Thu, Nov 21 2019 12:35 PM

Kartikeya 90ml Telugu Movie Trailer Out - Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘90 ఎంఎల్‌’. నేహా సోలంకి కథానాయిక. శేఖర్‌ రెడ్డి ఎర్ర దర్శకత్వం వహించారు. కార్తికేయ క్రియేటివ్‌ వర్క్‌ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, టీజర్‌, సాంగ్స్‌ సినీ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘నాతో నువ్వుంటే చాలు’ అనే సాంగ్‌ యూత్‌కు ముఖ్యంగా లవర్స్‌కు తెగ కనెక్ట్‌ అయింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది. తాజాగా మూవీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. 

‘నీతో కలిసి చచ్చేంత ప్రేమ నాలో ఉంది.. నాతో కలిసి బతకాలన్న ఆలోచనే నీలో లేదు.. ఐ హేట్‌ యూ’అంటూ ట్రైలర్‌లో హీరోయిన్‌ పలికే మాటలు ప్రేమికుల మనసులను కదిలించేలా ఉంది. ‘కొందరకి మందు తాగడం సరదా.. మరికొందరికి అది వ్యసనం.. కానీ మీ బాబుకు అది అవసరం, ఏ జన్మలో ఏ యాగం చేశారో ఈ రాజావారు ఈ జన్మలో ఈ యోగంతో పుట్టారు’ఈ డైలాగ్‌లతో ఈ సినిమాకు 90 ఎంఎల్‌ అని టైటిల్‌ ఎందుకు పెట్టారో అర్థమవుతోంది. అదేవిధంగా స్టోరీ కూడా తెలిసిపోతోంది. ఇక తనకున్న వీక్‌నెస్‌తో ప్రేమలో పడిన కష్టాలు, అమ్మాయి కుటుంబసభ్యులతో ఎదురైన సంఘటనలు చూస్తుంటే సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఇక  హీరోయిన్‌ హీరోను వదిలి వెళ్లిపోతుంటే ‘కన్నులు వదిలి కల వెళుతుందే.. గుండెను వదిలి లయ వెళుతుందే.. గుడినే  వదిలి దేవత వెళుతుందే’ వచ్చే సాంగ్‌ సూపర్బ్‌.  చివర్లో ‘నా మందు తాగి నన్నే కొడతాడా.. వదలను’అని విలన్‌ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ముగుస్తుంది.

ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు నెటిజన్లు ఫిదా అవడంతో తెగ వైరల్‌ అవుతోంది. ఇక ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో సెన్సేషన్‌ సృష్టించిన కార్తికేయ తరువాత ఆ స్థాయిలో సక్సెస్‌ సాధించలేకపోయాడు. ఇటీవల గ్యాంగ్‌ లీడర్ సినిమాతో ప్రతినాయక పాత్రలో సక్సెస్‌ అయిన ఈ యంగ్ హీరో ‘90 ఎంఎల్‌’పై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఈ చిత్రం డిసెంబర్‌ 5న విడుదల కానుంది. రవి కిషన్‌, రావూ రమేష్‌, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్ సంగీతమందిస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement