
లైంగిక దాడి కేసులో సినీ డైరెక్టర్‌కు రిమాండ్
బోడుప్పల్: వివాహితపై లైంగిక దాడికి పాల్పడిన ఓ సినిమా డైరెక్టర్‌ను శుక్రవారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అమీర్‌పేట మధురానగర్‌కు చెందిన కార్తికేయ సినిమా డైరెక్టర్‌గా పని చేసేవాడు. ఇతనికి వైజాగ్‌కు చెందిన ఓ వివాహిత పేస్ బుక్‌లో పరిచయం కావడంతో ఇద్దరు కలిసి సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సదరు వివాహిత ల్యాండ్ డాక్యుమెంట్‌లను కుదువ పెట్టి డబ్బులు తీసుకున్న అతను వాటితో సినిమా తీద్దామని చెప్పాడు.
అయితే సినిమా తీయకపోగా వివాహితకు మాయమాటలు చెప్పి మణికొండలోని అపార్టుమెంట్‌కు పిలిపించి కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత ఆమెను ఫొటోలు తీశాడు. వాటిని అడ్డుపెట్టుకుని పలుమార్లు తనపై లైంగిక దాడికి పాలుపడినట్లు బాధితురాలు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.