కార్తికేయతో సక్సెస్ని కొనసాగిస్తా – నిఖిల్ | Continue to Success with kartikeya, says actor Nikhil | Sakshi
Sakshi News home page

కార్తికేయతో సక్సెస్ని కొనసాగిస్తా – నిఖిల్

Published Mon, Dec 2 2013 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM

కార్తికేయతో సక్సెస్ని కొనసాగిస్తా – నిఖిల్

కార్తికేయతో సక్సెస్ని కొనసాగిస్తా – నిఖిల్

‘‘నా జీవితంలో ఎంతో ముఖ్యమైన సినిమా ‘స్వామి రారా’. ఆ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తున్నావ్.. అని చాలామంది అడిగారు. ఆ విజయాన్ని మరో విజయంతో కొనసాగించాలని ‘కార్తికేయ’ చేశాను’’ అని నిఖిల్ అన్నారు. ‘స్వామి రారా’తో హిట్ పెయిర్ అనిపించుకున్న నిఖిల్, స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్న చిత్రం ‘కార్తికేయ’. ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిఖిల్ ఇంకా మాట్లాడుతూ-‘‘ట్విట్టర్ ద్వారా ఇటీవలే విడుదలైన ఈ చిత్రం టీజర్కి మంచి స్పందన లభిస్తోంది. దర్శకుడు సినిమాను జనరంజకంగా తీర్చిదిద్దాడు. ప్యాచ్ వర్క్ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది’’ అని తెలిపారు. రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, యూత్ సినిమాలకు భిన్నంగా డెప్త్ ఉన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని నిర్మాత చెప్పారు. ఉత్కంఠకు లోను చేసే సినిమా ఇదని దర్శకుడు అన్నారు. ఇంకా రావురమేష్, జోగినాయుడు, కార్తిక శ్రీనివాస్, కెమెరామెన్ కార్తీక్ ఘట్టమనేని కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement