Swamy Ra Ra
-
‘కార్తికేయ’ మూవీ ప్రెస్ మీట్
-
శ్రీకాంత్ హీరోగా తమిళంలో స్వామి రారా
టాలీవుడ్లో నిఖిల్ హీరోగా నటించిన వినోదాత్మక చిత్రం స్వామి రా రా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ఇప్పుడు శ్రీకాంత్ హీరోగా కోలీవుడ్‌లో సామియాట్టం పేరుతో తెరకెక్కుతోంది. శ్రీకాంత్ ఁస్వామి రా రారూ. చిత్ర రీమేక్ హక్కులు పొంది తన సొంత నిర్మాణ సంస్థ గోల్డెన్ ప్రైడ్ పతాకంపై నిర్మిస్తున్నారు. ధనుష్ నటించిన యారడీ నీ మోహినీ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన ఆ తరువాత వరుసగా ఆయన హీరోగా కుట్టి, ఉత్తమ పుత్తిరన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మిత్రన్ ఆర్ జవహర్ తెరకెక్కిస్తున్న నాలుగో చిత్రం సామియాట్టం. శ్రీకాంత్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఒకరు హీరోయిన్గా నటించనున్న ఈ చిత్రంలో ఎస్ఎస్ మ్యూజిక్ పూజా మురుగదాస్, సంపత్, తెలుగు నటుడు జీవా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమై తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్‌కు రెడీ అవుతున్న చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ సామియాట్టం పూర్తిగా హాస్యభరిత చిత్రంగా పేర్కొన్నారు. గుండెను పిండే సన్నివేశాలు, బీభత్సం సృష్టించే రక్తపాత సన్నివేశాలు లాంటివి లేకుండా పూర్తి జాయ్‌ఫుల్ కథా చిత్రం ఇదన్నారు. లోకల్‌గా చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే హీరోశ్రీకాంత్ బృందం చేతికి వినాయకుడి విగ్రహం వస్తుందన్నారు. అక్కడ నుంచి ఆ స్వామి ఆడించే ఆట కడుపుబ్బ నవ్విస్తుందని తెలిపారు. చెన్నై, పాండిచ్చేరి ప్రాంతంలో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. సుమారు 400 వాణిజ్య ప్రకటనలకు సంగీతాన్ని అందించిన శ్రీవరణ్ ఈ చిత్రం ద్వారా బిగ్ స్క్రీన్కు పరిచయం అవుతున్నట్లు తెలిపారు. -
థ్రిల్లింగ్ వినోదం
వినోదంతో కూడిన థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘కార్తికేయ’. ‘స్వామి రారా’ జంట నిఖిల్, స్వాతి మళ్లీ ఇందులో కలిసి నటించారు. చందు మొండేటి దర్శకుడు. వెంకట శ్రీనివాస్ బొగ్గారం నిర్మాత. చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రం మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుపుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని నిర్మిస్తున్నామని, అందరూ మెచ్చే సినిమా అవుతుందని నిర్మాత తెలిపారు. ‘‘ఇందులో హీరోహీరోయిన్లు వైద్య విద్యార్థులుగా కనిపిస్తారు. ఆద్యంతం వినోదాత్మకంగా, థ్రిల్ కలిగించేలా ఈ సినిమా ఉంటుంది. ఈ నెల 27న పాటలను, జూన్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని దర్శకుడు చెప్పారు. తనికెళ్ల భరణి, రావురమేశ్, రాజా రవీంద్ర, తులసి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: శేఖర్ చంద్ర, కూర్పు: కార్తీక శ్రీనివాస్, సమర్పణ: శిరువూరి రాజేశ్‌వర్మ. -
స్వామి రారాకి సెకండ్ పార్ట్
గత ఏడాది విడుదలైన చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించి, ‘పెద్ద సినిమా’గా నిలిచినవాటిలో ‘స్వామి రారా’ ఒకటి. నిఖిల్, స్వాతి జంటగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు సైతం లభించాయి. ఈ నేపథ్యంలో చిత్రనిర్మాత చక్రి చిగురుపాటి ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించనున్నారు. దీనికి ‘స్వామి స్వామి రారా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘ది సాగా కంటిన్యూస్’ అనేది ఉపశీర్షిక. ఎన్. బోస్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘కొత్తదనానికి నిర్వచ నంగా నిలిచిన ‘స్వామిరారా’కి సీక్వెల్ చేస్తున్నాం. ఓ ప్రముఖ కథా నాయకునితో, భారీ నిర్మాణ వ్యయంతో ఈ సినిమా నిర్మించను న్నాం’’ అని చెప్పారు. దీనికి సహ నిర్మాత: బీఎస్ వర్మ. -
కార్తికేయతో సక్సెస్‌ని కొనసాగిస్తా – నిఖిల్
‘‘నా జీవితంలో ఎంతో ముఖ్యమైన సినిమా ‘స్వామి రారా’. ఆ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తున్నావ్.. అని చాలామంది అడిగారు. ఆ విజయాన్ని మరో విజయంతో కొనసాగించాలని ‘కార్తికేయ’ చేశాను’’ అని నిఖిల్ అన్నారు. ‘స్వామి రారా’తో హిట్ పెయిర్ అనిపించుకున్న నిఖిల్, స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్న చిత్రం ‘కార్తికేయ’. ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిఖిల్ ఇంకా మాట్లాడుతూ-‘‘ట్విట్టర్ ద్వారా ఇటీవలే విడుదలైన ఈ చిత్రం టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది. దర్శకుడు సినిమాను జనరంజకంగా తీర్చిదిద్దాడు. ప్యాచ్ వర్క్ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది’’ అని తెలిపారు. రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, యూత్ సినిమాలకు భిన్నంగా డెప్త్ ఉన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని నిర్మాత చెప్పారు. ఉత్కంఠకు లోను చేసే సినిమా ఇదని దర్శకుడు అన్నారు. ఇంకా రావురమేష్, జోగినాయుడు, కార్తిక శ్రీనివాస్, కెమెరామెన్ కార్తీక్ ఘట్టమనేని కూడా పాల్గొన్నారు. -
తమిళ, మళయాళాల్లో 'స్వామి రారా' రీమేక్
చిన్న సినిమాగా మొదలై.. మంచి విజయం సాధించిన క్రైం కామెడీ చిత్రం 'స్వామి రారా' బాక్సాఫీసును బద్దలుకొట్టి వందరోజులు దాటడంతో, ఇప్పుడు ఆ సినిమాను తమిళం, మళయాళంలో కూడా రీమేక్ చేయనున్నారు. ఇప్పటికే ఇది కన్నడంలో రూపొందుతోంది. ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను తమిళ నటుడు శ్రీకాంత్ కొన్నారు. తమిళం, మళయాళం రెండు భాషలకూ తాను రీమేక్ రైట్స్ కొన్నానని, తమిళ వెర్షన్ ముందుగా తెరకెక్కించి, తర్వాత మళయాళంలో తీస్తామని శ్రీకాంత్ చెప్పారు. ఈ సినిమా చాలా సరదాగా ఉంటుందని, అందుకే దాన్ని తమిళంలో తీయాలని భావించానని తెలిపారు. తమిళంలో కూడా ఈ సినిమా బాగా ఆడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళ చిత్రంలో ప్రధాన పాత్రను శ్రీకాంతే పోషిస్తారు. మిగిలిన పాత్రలకు నటీనటులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. డైరెక్టర్‌ను ఖరారు చేసే దశలో ఉన్నట్లు శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాగానే ఈ సినిమా పని మొదలుపెడతామని అన్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ తమిళంలో నంబియార్, ఓం శాంతి ఓం చిత్రాల షూటింగ్లో బిజీగా ఉన్నారు. సుధీర్ వర్మ అనే కొత్త దర్శకుడి చేతిలో రూపొందిన స్వామి రారా చిత్రం ఈ సంవత్సరంలో సైలెంట్ హిట్‌గా నిలిచింది. విఘ్నేశ్వరుడి విగ్రహం చుట్టూ సినిమా మొత్తం నడుస్తుంది.. కాదు పరుగు పెడుతుంది. నిఖిల్, పూజా రామచంద్రన్, స్వాతి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.