శ్రీకాంత్ హీరోగా తమిళంలో స్వామి రారా
టాలీవుడ్‌లో నిఖిల్ హీరోగా నటించిన వినోదాత్మక చిత్రం స్వామి రా రా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ఇప్పుడు శ్రీకాంత్ హీరోగా కోలీవుడ్‌లో సామియాట్టం పేరుతో తెరకెక్కుతోంది. శ్రీకాంత్ ఁస్వామి రా రారూ. చిత్ర రీమేక్ హక్కులు పొంది తన సొంత నిర్మాణ సంస్థ గోల్డెన్ ప్రైడ్ పతాకంపై నిర్మిస్తున్నారు. ధనుష్ నటించిన యారడీ నీ మోహినీ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన ఆ తరువాత వరుసగా ఆయన హీరోగా కుట్టి,
ఉత్తమ పుత్తిరన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మిత్రన్ ఆర్ జవహర్ తెరకెక్కిస్తున్న నాలుగో చిత్రం సామియాట్టం. శ్రీకాంత్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఒకరు హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రంలో ఎస్‌ఎస్ మ్యూజిక్ పూజా మురుగదాస్, సంపత్, తెలుగు నటుడు జీవా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమై తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్‌కు రెడీ అవుతున్న చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ సామియాట్టం పూర్తిగా హాస్యభరిత చిత్రంగా పేర్కొన్నారు.
గుండెను పిండే సన్నివేశాలు, బీభత్సం సృష్టించే రక్తపాత సన్నివేశాలు లాంటివి లేకుండా పూర్తి జాయ్‌ఫుల్ కథా చిత్రం ఇదన్నారు. లోకల్‌గా చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే హీరోశ్రీకాంత్ బృందం చేతికి వినాయకుడి విగ్రహం వస్తుందన్నారు. అక్కడ నుంచి ఆ స్వామి ఆడించే ఆట కడుపుబ్బ నవ్విస్తుందని తెలిపారు. చెన్నై, పాండిచ్చేరి ప్రాంతంలో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. సుమారు 400 వాణిజ్య ప్రకటనలకు సంగీతాన్ని అందించిన శ్రీవరణ్ ఈ చిత్రం ద్వారా బిగ్ స్క్రీన్‌కు పరిచయం అవుతున్నట్లు తెలిపారు.